
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌కు చెందిన కీలకనేతలు బీజేపీ చేరబోతున్నారని, అందుకు అనుగుణంగా బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారబోతున్నారని తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, పార్టీ మారేందుకు రాంమాధవ్‌ను కలిశానని అనడం అవాస్తవమని అన్నారు. అసలు రాంమాధవ్ ఎవరో తనకు తెలియదన్నారు. ఇప్పటివరకు అతన్ని చూడలేదని తేల్చిచెప్పారు. భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా భువనగిరి అభివృద్ది కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఏపీ సీఎం జగన్‌ను చూసి కేసీఆర్ పంథా మార్చుకోవాలన్నారు. జగన్ కేబినేట్‌లో అన్ని వర్గాల వారికి అవకాశం ఇచ్చాడని, అది చూసైనా తన కేబినేట్‌లో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తక్కువ కాలంలోనే అందరి మన్నలను పొందుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తరహా ప్రజల్లోకి వెళ్తామని, జగన్‌లా ప్రజల్లో ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వంద సీట్లు ఖాయమని అన్నారు.
చదవండి : తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్!
Comments
Please login to add a commentAdd a comment