సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటన సంచలనంగా మారింది. ఈ ఆపరేషన్లలో వైద్యుల నిర్లక్ష్యంగా నలుగురు మహిళలు మృతిచెందారు. దీంతో, ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతలు, ప్రజలు మండిపడుతున్నారు.
కాగా, మహిళల మృతిపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్, సీఎంపై ఫైరయ్యారు. కేసీఆర్ బీహార్ పర్యటనను ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా సీఎం కేసీఆర్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? అంటూ కోమటిరెడ్డి సదరు లేఖలో కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా?
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 31, 2022
అనుకూల మీడియాలో వైద్య ఆరోగ్య శాఖ గురించి అనవసర ప్రచారం చేయించే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం దారుణం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 31, 2022
Comments
Please login to add a commentAdd a comment