
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు కావాలని అధిష్టానాన్ని అడిగానని, దీనిపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని మాజీమంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 20 ఏళ్లనుంచి ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా పనిచేస్తున్నానని చెప్పారు. పీసీసీ పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా అధిష్టానం చెప్పినట్టు చేస్తానన్నారు. నల్లగొండలో తనపై గెలిచేస్థాయి ఎవరికీ లేదన్నారు. గత ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి భార్యా, పిల్లలు, కుటుంబసభ్యులు అంతా ప్రచారం చేసుకున్నా ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.