highcommand
-
బీజేపీలో రచ్చ.. బండి వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలో నేతల మధ్య ముసలం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని హైకమాండ్ భావిస్తుండగా.. స్థానిక నేతల్లో ఐకమత్యం లేకపోవడం తలనొప్పిగా మారిందనే చర్చ నడుస్తోంది. ఇక, తాజాగా తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ను టార్గెట్ చేసిన సంచలన కామెంట్స్ చేశారు. దీంతో, తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ రఘునందన్ అన్నట్టుగా పొలిటికల్ హీట్ నెలకొంది. అయితే, పార్టీలో రఘునందన్ ప్రాధాన్యతపై బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని, ప్రధాని మోదీని, అమిత్ షాలను విమర్శించిన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఎందుకంటూ బండి ఫైరయ్యారు. ఇదే విషయమై పార్టీ పెద్దల దగ్గర బండి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నిన్న(శుక్రవారం) కోర్ కమిటీ సమావేశం ముగియకముందే బండి సంజయ్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. నిన్నటి మీటింగ్‌లోనూ ఆయన ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే పార్టీ నేతల మధ్య లుకలుకలు బయట పడ్డాయి. కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించడాన్ని, ఆయన సభలో పాల్గొనడాన్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించబోమని, ఏమి చేసుకుంటారో చేసుకోండన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా పిలుస్తారని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, విజయశాంతి, తదితరులు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. ఉద్యమ సమయంలో తనపై కేసులు పెట్టి వేధించిన వ్యక్తిని పిలవడంపై విజయశాంతి నిలదీసినట్టు తెలిసింది. ఇదే తరహాలో రాజ్‌గోపాల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. కిషన్‌రెడ్డి బీజేపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతల ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీలోనే కొందరు తనపై నాయకత్వానికి ఫిర్యాదులు చేశారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకు.. సీఎం కేసీఆర్ ఈడీని మేనేజ్ చేశారని ఆయన అనడం పార్టీ నేతల మధ్య చర్చకు దారితీసింది. దీంతో, బీజేపీలో పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డి వచ్చినా కొత్త టెన్షన్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు! -
బీజేపీలో హాట్ టాపిక్.. డీకే అరుణ మౌనంపై సస్పెన్స్!
తెలంగాణ ఫైర్ బ్రాండ్.. గద్వాల జేజమ్మ సైలంటయ్యారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉంటున్నారు. పాలమూరుకే పరిమితమవుతున్నారు. జేజమ్మ సైలెంట్ వెనుక కారణమేంటి?. కమలం పార్టీలో ప్రాధాన్యం తగ్గిందా? లేక ఏదైనా కొత్త పదవి కోసం ఎదురుచూస్తున్నారా? డీకే అరుణ మౌనం వ్యూహత్మకమా? ఇంకేదైనా రీజన్ ఉందా?.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డీకే అరుణ.. కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన సమయంలో డీకే అరుణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో చక్రం తిప్పారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీలో చేరిన డీకే అరుణ.. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలతో పాటు.. కర్ణాటక రాష్ట్ర కో-ఇంఛార్జ్ బాధ్యతలు డీకే అరుణకు అప్పగించారు. పార్టీ లైన్ క్రాస్ కాకుండా.. తనపని తాను చేసుకుంటూపోతున్నారు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డిని బరిలో దించి.. గెలిపించడంలో అరుణ కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో ముందుండే డీకే అరుణ ఒక్కసారిగా సైలెంట్ కావడం ఇప్పుడు కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకే ఆమె పరిమితమవుతున్నారు. హైదరాబాద్ రాకుండా.. కేవలం సొంత జిల్లాలోనే పార్టీ పనులు చేసుకోవడం వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు కారణంగానే డీకే అరుణ సైలెంట్‌గా ఉంటున్నారా?. వ్యూహత్మకంగానే ఆమె మౌనపాత్ర పోషిస్తున్నారా? అనే విషయం అంతుచిక్కడం లేదని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. బీజేపీ హైకమాండ్ ఢిల్లీలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు, ఇతర బాధ్యతల విషయంలో మార్పులు చేర్పులపై దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీలో కూడా కొద్దిపాటి మార్పులు జరుగుతాయనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ డీకే అరుణ సైలెంట్‌పై తెరవెనుక ఏమైనా పావులు కదుపుతున్నారా? రాష్ట్ర పార్టీ వ్యవహారాలు తనకెందుకులే అని పాలమూరు జిల్లాకే పరిమితం అయ్యారా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఏదేమైనా గద్వాల జేజెమ్మ సైలెన్స్ వెనుక కారణం ఏమై ఉంటుందా అంటూ పార్టీలో తెగ చర్చించుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మల్లు రవితో జూపల్లి భేటీ.. కాంగ్రెస్ సీనియర్ ఏమన్నారంటే? -
పొలిటికల్ కారిడార్: కమలం రేకులను కలిపేందుకు హైకమాండ్ కసరత్తు
-
పొలిటికల్ కారిడార్ : తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ చిన్న చూపు
-
Telangana Congress: 3 నెలలు ఆగాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి మరో మూడు నెలలు సమయం పట్టనుందని తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కోశాధికారితోపాటు అధికార ప్రతినిధుల నియామకం కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భారీ కసరత్తు చేస్తున్నారు. అలాగే, ఈ పదవులతోపాటు మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించాలన్న టీపీసీసీ ప్రతిపాదనకు హైకమాండ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ నేతలకు ఈ పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి. కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్రపై దృష్టి పెడతారని, ఈలోపు రాష్ట్రంలో నాలుగైదు చోట్ల ఇంద్రవెల్లి తరహా సభలు నిర్వహిస్తారని తెలుస్తోంది. మరో ఇద్దరు కావాలి.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పుడే ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 10 మంది సీనియర్ ఉపాధ్యక్షులను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇందులో ఇద్దరు బీసీ, ఒక మైనార్టీ, ఒక రెడ్డి, ఒక ఎస్సీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించారు. బీసీల నుంచి రెండు ప్రధాన సామాజిక వర్గాలైన యాదవ్, రెడ్డిలకు అవకాశమివ్వగా, ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన గీతారెడ్డిని నియమించారు. అయితే, బీసీల్లో మరో ప్రధాన సామాజికవర్గానికి అవకాశమివ్వాలని, ఎస్సీల నుంచి మాదిగలను నియమించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సామాజిక వర్గాలకు అవకాశమిచ్చేలా మరో ఇద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలని టీపీసీసీ పార్టీ హైకమాండ్‌కు ప్రతిపాదన పంపినట్టు తెలుస్తోంది. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఢిల్లీ నాయకత్వం బీసీల నుంచి కొండా సురేఖ (మున్నూరుకాపు), ఈరవత్రి అనిల్ (పద్మశాలీ), మాదిగ సామాజికవర్గం నుంచి ఎస్.సంపత్‌కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమతూకం.. సహకారం టీపీసీసీ కొత్త కార్యవర్గం కోసం సామాజిక సమతూకంతోపాటు తనకు పూర్తి సహకారాన్ని అందించగల నాయకులు ఎవరున్నారన్న దానిపై రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ నుంచి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పదవులు లభించే కోణంలోనూ ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో ఉన్న తరహాలో జంబో కార్యవర్గం కాకుండా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కలిపి 50 మంది దాటొద్దని, అధికార ప్రతి నిధుల సంఖ్య కూడా 20–25కు మించొద్దని ఆయన భావిస్తున్నారు. దీంతోపాటు కొన్ని జిల్లాల అధ్యక్షులను కూడా మార్చాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. ఈ తతంగమంతా పూర్తయ్యేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని తన సన్నిహితుల వద్ద రేవంత్ చెప్పినట్టు తెలుస్తోంది. -
ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానంపై పోరు తీవ్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అసంతృప్త నేతలు అధిష్టానంపై పోరును తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుత్తున్నారు. పార్టీలో ప్రక్షాళనపేరుతో అధిష్టాన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన జీ–23 నాయకులు కీలక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. గులాం నబీ ఆజాద్ జీ–23 లో కీలక సభ్యుడు అయిన కారణంగానే ఆయన రాజ్యసభ పదవీకాలాన్ని పొడిగించకుండా, అధిష్టానం పక్కన పెట్టిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అంతేగాక రాజ్యసభా పక్ష నాయకుడిగా గులాంనబీ పదవీకాలం ముగిసిన తర్వాత సీనియర్ నేత ఆనంద్ శర్మను కాదని, అధిష్టానం రాహుల్‌గాంధీ విధేయుడిగా పేరున్న మల్లికార్జున ఖర్గేకు అప్పగించినప్పటి నుంచి, జీ–23 నేతలు అధిష్టానంపై అసహనాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. రాజ్యసభ పక్ష నాయకుడి పదవి ఆనంద్ శర్మకు రాకుండా అడ్డుకోవడంలో అధిర్ రంజన్ చౌధరి వంటి వారు కీలకపాత్ర పోషించారని జీ–23 బృందం గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ఎన్నికల పొత్తు విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరిపై ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐఎస్ఎఫ్తో పొత్తు కాంగ్రెస్ భావజాలానికి పూర్తి విరుద్ధమని, అలాంటి నిర్ణయం తీసుకునే ముందు పార్టీస్థాయిలో వివరణాత్మక చర్చ జరగాలని ఆనంద్ శర్మ తన ట్వీట్లో అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధిర్ రంజన్ చౌదరిని టార్గెట్ చేశారు. ఆనంద్ శర్మ ట్వీట్ల తరువాత, అధిర్ రంజన్ చౌదరి సైతం ఘాటుగానే జవాబిచ్చారు. వీరి మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత పోరును మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. చదవండి: (ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ గాంధీ) ఢిల్లీ పీసీసీలోనూ.. మరోవైపు అసమ్మతి వర్గంలో కీలకంగా ఉన్న నలుగురు నేతలు ఢిల్లీకి చెందిన వారు కావడంతో, ఢిల్లీ పీసీసీలోనూ అంతర్గత పోరు మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరుగబోయే కీలక సమావేశంలో పార్టీ అసంతృప్త నాయకుల భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగనున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్, ఢిల్లీ పీసీసీ మాజీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్, మాజీ ఉపాధ్యక్షుడు యోగానంద్ శాస్త్రిలు జీ –23లో ఉన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఢిల్లీ పీసీసీలో ఈ అసంతృప్త నాయకుల జాబితా పెరుగుతోందని సమాచారం. గతంలో 23 మంది.. పార్టీని బలోపేతం చేసే విషయంలో అధిష్టానం తీరు మార్చుకోవాలంటూ గతేడాది సోనియాగాంధీకి 23 మంది అసంతృప్త నేతలు రాసిన లేఖ పార్టీలో పెద్ద ఎత్తున దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం సోనియాగాంధీ నివాసంలో జీ –23 నేతలతో జరిగిన కీలక సమావేశంలో తమ అభిప్రాయాలను పలువురు పార్టీ సీనియర్లు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల ముందుంచారు. అయితే ఆ సమావేశం జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం జీ–23 నేతలు చేసిన సూచనలను పట్టించుకున్న దాఖలాలు లేవని, అçసంతృప్తి కారణంగా పార్టీని వీడాలనుకుంటున్న నాయకులతో ప్రత్యేకంగా చర్చించిన పరిస్థితి సైతం లేదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, త్వరలో జరపాలనుకుంటున్న సమావేశం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక బలమైన సందేశాన్ని పంపించాలని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చదవండి: (చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ) -
పీసీసీ అడిగాను.. హైకమాండ్ ఇష్టం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు కావాలని అధిష్టానాన్ని అడిగానని, దీనిపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని మాజీమంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 20 ఏళ్లనుంచి ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా పనిచేస్తున్నానని చెప్పారు. పీసీసీ పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా అధిష్టానం చెప్పినట్టు చేస్తానన్నారు. నల్లగొండలో తనపై గెలిచేస్థాయి ఎవరికీ లేదన్నారు. గత ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి భార్యా, పిల్లలు, కుటుంబసభ్యులు అంతా ప్రచారం చేసుకున్నా ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. -
అధిష్టానానికి ఫిర్యాదు
నూనెపల్లె: నంద్యాల తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులు చెత్తలో వేసిన సంఘటనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి చింతలపల్లె సుధాకర్ రావు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ ఇన్చార్జి శిల్పామోహన్ రెడ్డి ఇంటి సమీపంలో చెత్త బుట్టలో టీడీపీ సభ్యుత్వ కార్డులు పడేయడం పార్టీని అగౌరవపరచడమే అన్నారు. 2014లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించగా కాంగ్రెస్ నుంచి శిల్పా టీడీపీలోకి చేరారని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు నమోదు ప్రక్రియ శిల్పా చేపట్టారన్నారు. అప్పటి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మొత్తం సభ్యుత్వ కార్డులు శిల్పా చేతికే అందించారని గుర్తు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి ఫరూక్ 8వేలకు పైగా సభ్యత్వం చేశారని, వాటిని శిల్పాకే ఇవ్వడమే చెత్త పాలు చేశారన్నారు. -
కేంద్రమంత్రి కావూరి భవిష్యత్ ఏంటీ?
-
రాష్ట్ర విభజన అనాలోచిత చర్య: కావూరి