
అహంభావం వద్దు: చాడ
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్న వారికి అహంభావం పనికిరాదని శని వారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై కేసులు పెడతామని, జైలుకు పంపిస్తామని సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడడమంటే విపక్షాల గొంతును నొక్కే ప్రయత్నం చేయడమేనన్నారు. ఇటువంటి బెది రింపులు, కేసుల విషయంలో ఇటీవల తమిళనాడు సీఎం జయలలితకు సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు.
మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంతో తెలంగాణకు నష్టమన్నారు. తక్కువ వ్యయంతో పూర్యయ్యే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముందుగా చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై అందరితో చర్చించి విధివిధానాలను రూపొందించుకోవాలని సూచించారు.