ఇద్దరు విలేకరుల అరెస్ట్ | Two journalists arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు విలేకరుల అరెస్ట్

Published Mon, Sep 28 2015 7:06 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Two journalists arrested

అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు విలేకరులపై సంజామల పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కంభగిరిస్వామి ఆలయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని బయటపెడితే తమరు జైలు కెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని బెదిరించి విలేకరులు పూజారి రామ్మోహన్ స్వామి నుంచి మూడు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. వాటిని ఉపయోగించి నుంచి రూ.లక్ష విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయం గురించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు విలేకరులు గఫ్ఫార్, బాబా సప్తగిరిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంజామల మండలం పేరుసోమల గ్రామంలో ఉన్న కంభగిరిస్వామి ఆలయంలో రామ్మోహన్ స్వామి పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement