గత కొద్ది రోజులుగా విద్యార్థిని, విద్యార్థులు తమ పాఠశాల, కళాశాలల్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, కుల వివక్ష గురించి బహిరంగంగా నోరు విప్పుతున్నారు. ఇటీవల చెన్నైలో ఓ కళాశాలకు చెందిన కామర్స్ ఉపాధ్యాయుడిపై సదరు పాఠశాల విద్యార్థులు కుల వివక్ష, లైంగిక వేధింపుల వంటి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మిగతా స్కూళ్ల విద్యార్థులు సైతం తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో సినీ నటి, ‘96, మాస్టర్’ మూవీ ఫేం గౌరి కిషన్ కూడా తాను స్కూలింగ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలో చదువుతున్న రోజుల్లో కుల వివక్ష, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్‌కు గురయ్యానంటూ ట్విటర్ వేదికగా బుధవారం వరుస పోస్ట్స్ షేర్ చేశారు. ‘ప్రతి ఒక్కరికి చదువుతున్న రోజులు మధుర జ్ఞాపకాలుగా ఉంటాయని భావిస్తారు. కానీ అవే రోజులు కొందరికి భయం పుట్టించేవిగా ఉండటం నిజంగా బాధాకరం. నేను కూడా అలాంటి చెదు అనుభవాలను నా స్కూలింగ్‌లో చూశాను. ఇప్పుడు నాలాంటి అమ్మాయిలు వేల సంఖ్యల్లో ఉన్నారనే విషయం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. పాఠశాల అనేది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే మైదానం కావాలి, కానీ వారి విలువలను కూల్చేసే స్థలం కాకుడదు’ అంటు ఆమె రాసుకొచ్చారు. అంతేగాక తను చదివిన ఆడయార్ హిందు సీనియర్ సెకండరీ స్కూల్ సంఘటనలను కూడా గుర్తు చేసుకున్నారు.
‘ఇటీవల వెలుగు చూసిన పీఎస్‌బీబీ స్కూల్ సంఘటన మాదిరిగా నేను చదివిన అడయార్ హిందూ సీనియర్ సెకండరీ పాఠశాలలో కూడా ఇలాంటి భయంకర సంఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. విద్యార్థులపై లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, కుల వివక్షత, వ్యక్తిత్వాన్ని కించపరడం, నిరాధారమైన ఆరోపణలు వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల వారి ఆత్మగౌరవంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వేధింపులన్నిటిని కూడా నేను అడయార్ పాఠశాలలో స్వయంగా చూశాను, ఎదుర్కొన్నాను. అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే దీనికి కారణమైన ఉపాధ్యాయుల పేర్లను చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇలాంటివి ధైర్యంగా బహిర్గతం చేయడం ద్వారా మున్ముందు పాఠశాలల సంస్కృతిలో మార్పు తీసుకువస్తాయనే ఆశిస్తున్నా. ఎందుకంటే బాల్యంలో ఇలాంటి సంఘటనలు నరకంగా ఉంటాయి. అవి గుర్తుకు వస్తనే గుండెల్లో వణుకుపుడుతుంది’ అంటు ఆమె భావోద్వేగంతో చేదు జ్ఞాపకాలను పంచుకుంది.
This is with respect to the issues being brought to light in school environments which seem highly toxic and problematic!
— Gouri G Kishan (@Gourayy) May 25, 2021
It needs to change, NOW.
Please read the thread. #SpeakUpAgainstHarrasment
#HinduSchoolAdyar #PSBB @Chinmayi pic.twitter.com/QXsV784x6P
Comments
Please login to add a commentAdd a comment