Master Movie
-
హీరో విజయ్‌ది రియల్ హెయిరా? లేదంటే విగ్గా?
40.. 50.. 60.. 70 ఏళ్ల వయసులోనూ స్టార్ హీరోలు యంగ్‌గా కనిపిస్తున్నారు. నిత్యం కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు. డైట్ ఫాలో అవుతూ గ్లో కాపాడుకుంటున్నారు. ఈ వయసులోనూ హెయిర్ లాస్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా చిన్నవయసులోనే జుట్టు తెల్లబారడం, కాస్త వయసు మీద పడగానే జుట్టు రాలిపోవడం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఈ పెద్ద హీరోల జుట్టు మాత్రం ఇప్పటికీ నిగనిగలాడుతుందేంటి? అన్న ప్రశ్న ఎందరికో వచ్చే ఉంటుంది. నిజంగానే అందరు హీరోలది రియల్ హెయిర్ కాకపోవచ్చు. కొందరు విగ్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని ఉండవచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా ఈ కోవలోకే వస్తాడు. 39 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో ఉన్న నటుడు, దర్శకుడు చిత్ర లక్ష్మణన్‌కు గతంలో.. విజయ్ సినిమాల్లో విగ్గు వాడతాడా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. విజయ్ విగ్గు వాడడని క్లారిటీ ఇచ్చాడు. అయితే అతడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడని పేర్కొన్నాడు. విజయ్ మాత్రమే కాదని, తమిళంలో ఎంతో మంది హీరోలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే మాస్టర్, వారసుడు సినిమాల్లో విజయ్ హెయిర్ స్టైల్ చాలామందికి నచ్చింది. దానికంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మాస్టర్ రిలీజ్ సమయంలోనూ విజయ్ హెయిర్ స్టైల్ గురించి అతడి బెస్ట్ ఫ్రెండ్ శ్రీమాన్‌కు ప్రశ్న ఎదురైంది. 'విజయ్ సర్ విగ్గు వాడుతున్నాడా?' అని ఓ నెటిజన్ అడగ్గా.. 'కావచ్చు, కాకపోవచ్చు. అతడు చిత్రయూనిట్ ఎలా చెప్తే అలా రెడీ అయిపోతాడు. అసలే కరోనా టైం ఇది.. ఈ చర్చ ఆపి ప్రార్థనలు చేయండి' అని రిప్లై ఇచ్చాడు శ్రీమాన్. May be may not be what ever he does is designed by the crew of this film. Bro padam parunghaa no comments now just silence and prayers for corona . You will live my nanban in vjy 64 mASTER — actor sriman (@ActorSriman) March 15, 2020 చదవండి: స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు నవ్వాలో, ఏడ్వాలో తెలియదు: ఆర్జీవీ -
ఉత్తమ నటుడిగా విజయ్, ఉత్తమ విలన్ అవార్డు ఎవరంటే?
ఒసాకా తమిళ్ అంతర్జాతీయ 2021 సినీ అవార్డుల వేడుక ఇటీవల జపాన్‌లో జరిగింది. ఈ వేదికపై 2021 ఏడాదికి గానూ తమిళ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. అందులో మాస్టర్ చిత్రంలోని నటనకు గానూ కథానాయకుడు విజయ్‌కు ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించారు. మాళవికా మోహన్ హీరోయిన్గా నటించిన ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్, ఎక్స్‌బీ.ఫిలిం క్రియేటర్స్ సంస్థలు నిర్మించాయి. ఇందులో నటించిన విజయ్‌సేతుపతికి ఉత్తమ ప్రతినాయకుడు అవార్డును ప్రకటించారు. ఈ చిత్రంలోని వాత్తి కమింగ్ పాట ఉత్తమ పాట అవార్డును గెలుచుకుంది. ఆ విధంగా మాస్టర్ చిత్రం మూడు అవార్డులను కై వసం చేసుకుంది. ఇకపోతే తలైవి చిత్రంలో నటనకు గానూ నటి కంగనారనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు వరించింది. అదే విధంగా సార్పట్ట పరంపరై చిత్రానికి గానూ పా.రంజిత్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును మానాడు చిత్రానికి గానూ దర్శకుడు వెంకట్‌ప్రభు గెలుచుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ అవార్డును మండేలా చిత్రానికి గానూ వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్, ఓపెన్ విండో ప్రొడక్షన్స్, విష్బెర్రి ఫిలింస్ సంస్థలు గెలుచుకున్నాయని అవార్డుల జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. Thalapathy Vijay's #Master bags 3 awards at the Osaka Film International Festival. The Osaka Tamil Film International Film Festival was recently held in Japan. Vijay was awarded the "Best Actor" award for his performance in Master. #LEO #LeoFilm #BloodySweet @actorvijay pic.twitter.com/DcHHFXx4Of — Actor Vijay Team (@ActorVijayTeam) May 23, 2023 చదవండి: విషాదం.. కారు ప్రమాదంలో నటి మృతి -
‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
సీనియర్ నటి, హీరోయిన్ సాక్షి శివానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు, రాజశేఖర్ వంటి అగ్ర నటులతో జతకట్టింది. 90లో స్టార్ హీరోయిన్గా రాణించిన సాక్షి చిరంజీవి మాస్టర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున సీతారామారాజు మూవీలో అలరించింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సాక్షి ఆ తర్వాత సడెన్‌గా సినిమాలకు దూరమైంది. తెలుగులో హీరోయిన్గా కనిపించిన ఆమె చివరి చిత్రం సింహరాశి. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పుటికి ఆ తర్వాత సాక్షికి అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో తమిళ్, కన్నడ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. అలా ఆడపదడపా చిత్రాల్లో నటించిన ఆమె 2008లో జగపతిబాబు నటించిన హోమం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్‌లో నటించింది. ఆ తర్వాత 2010లో శ్రీకాంత్ నటించిన ‘రంగ ది దొంగ’ సినిమాలో నటించిన సాక్షికి తెలుగులో చివరి చిత్ర ఇదే. ఆ తర్వాత ఆమె మరే సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని గృహిణిగా ఉంటుంది. కాగా తెలుగులో ఆమె బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు మహేశ్ బాబుతో యువరాజుతో పాటు మరిన్ని చిత్రాలతో ఆకట్టుకుంది. పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పింది. అయితే ఇటీవల ఆమె బర్త్‌డే సందర్భంగా ఆమె లేటెస్ట్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో సాక్షి గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటూ ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పటికే అలాగే అందంగా, గ్లామరస్‌గా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Happy Birthday to Sakshi Shivanand#SakshiShivanand #Actress About: https://t.co/FxnCqP9IQf pic.twitter.com/Z4K69OVLpX — Celebrity Born (@CelebrityBorn) April 15, 2017 -
విజయ్ బంధువు.. బ్రిట్టో ఇంట్లో ఐటీ దాడులు
సాక్షి, చెన్నై: నటుడు విజయ్ బంధువు, మాస్టర్ చిత్ర నిర్మాత జేవియర్ బ్రిట్టో ఇంట్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. చెన్నై, శ్రీపెరంబదూరులోని పలు సెల్‌ఫోన్ సంస్థలపై మంగళవారం సాయంత్రం నుంచి ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. బుధవారం ఉదయం అడయార్‌లోని జేవియర్ బ్రిట్టో నివాసం, చెన్నై కార్యాలయాల్లో సోదాలు చేశారు. సెల్‌ఫోన్ సంస్థల్లో జరిపిన సోదాల్లో లభించిన సమాచారంతోనే దాడులు జరిగినట్లు సమాచారం. పొద్దుపోయే వరకు సోదాలు సాగాయి. విజయ్ బంధువైన బ్రిట్టో మాస్టర్ చిత్రంతో నిర్మాతగా మారారు. ఆయనకు పలు ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలోని హార్బర్ల ద్వారా అనేక దేశాలకు వివిధ ఉత్పత్తులను తరలిస్తున్నారు. చదవండి: (జీవితం మీద విరక్తి.. చెరువులోకి దూకిన కుటుంబం) -
చిరు కోసం దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన మెగాస్టార్
ఈ మధ్య కాలంలో తమ తమ అభిమాన నటీనటుల కోసం పాదయాత్రలు చేయడం కామన్ అయిపోయింది. తమకు నచ్చిన హీరోని ఒక్కసారైనా ప్రత్యేక్షంగా కలవాలనుకుంటారు. అందుకోసం ఎంతటి రిస్క్ అయిన చేయడానికి వెనకడారు. ఇక హీరోలు సైతం తమ బిజీ షెడ్యూల్డ్‌ని పక్కనపెట్టి, ఇంటికి వచ్చిన అభిమానులను కలుస్తుంటారు. వారికి ఆర్థికంగా సాయం చేయడం చేస్తుంటారు. తాజాగా ఓ దివ్యాంగ అభిమాని 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్‌కు వచ్చి మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. (చదవండి: దటీజ్ మెగాస్టార్.. అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ..) వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్ చిరంజీవికి పెద్ద అభిమాని. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేయాలనుకున్నాడు. అక్టోబర్ 3వ అమలాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి, 23 రోజులు 726 కి. మీ నడిచి సోమవారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరకి చేరుకున్నాడు.ఈ వార్త తెలిసి చలించిపోయిన చిరంజీవి.. గంగాధర్‌ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. నంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. అయితే తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకున్న గంగాధర్ చిరంజీవి ఆతిధ్యానికి పులకించిపోయారు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. -
హీరో విజయ్ 64 లుక్‌లు చూసేద్దామా..
చెన్నై: కోలీవుడ్‌లో నటుడు విజయ్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయన చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక విజయ్ పుట్టినరోజంటే అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు. ఈ నెల 22వ తేదీ విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని నెల రోజుల నుంచే అభిమానులు కరోనా బాధిత కుటుంబాలకు వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా మాస్టర్ చిత్ర నిర్మాత లలిత్‌కుమార్ ఒక స్పెషల్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఆ పోస్టర్లో విజయ్ నటించిన (మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకు) 64 చిత్రాలకు సంబంధించిన విజయ్ ముఖ చిత్రాలను పొందుపరిచారు. ప్రస్తుతం విజయ్ 65వ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా తెలుగులో తొలిసారిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. Here is our #Thalapathy Birthday Special ❤❤ Advance birthday wishes to our beloved #Master @actorvijay sir ❤❤#HappyBirthdayThalapathy #June22@Lalit_SevenScr pic.twitter.com/txftucrFTD — Seven Screen Studio (@7screenstudio) June 18, 2021 -
ఇండియన్ మోస్ట్ పాపులర్ మూవీగా విజయ్ ‘మాస్టర్’
సాక్షి, చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం ‘మాస్టర్’. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో విడుదలై ఈ సినిమా తమిళనాడులో రూ. 200 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. 2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ విడుదల చేసింది. అందులో మాస్టర్ చిత్రం నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్ వెబ్‌సిరీస్, ది వైట్ టైగర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తమన్నా నవంబర్ స్టోరీ- 5, ధనుష్ చిత్రం కర్ణన్- 6, పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ చిత్రం-7, క్రాక్ 9వ స్థానం దక్కించుకుంది. -
కుల వివక్ష, వేధింపులకు గురయ్యా: నటి
గత కొద్ది రోజులుగా విద్యార్థిని, విద్యార్థులు తమ పాఠశాల, కళాశాలల్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, కుల వివక్ష గురించి బహిరంగంగా నోరు విప్పుతున్నారు. ఇటీవల చెన్నైలో ఓ కళాశాలకు చెందిన కామర్స్ ఉపాధ్యాయుడిపై సదరు పాఠశాల విద్యార్థులు కుల వివక్ష, లైంగిక వేధింపుల వంటి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మిగతా స్కూళ్ల విద్యార్థులు సైతం తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో సినీ నటి, ‘96, మాస్టర్’ మూవీ ఫేం గౌరి కిషన్ కూడా తాను స్కూలింగ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలో చదువుతున్న రోజుల్లో కుల వివక్ష, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్‌కు గురయ్యానంటూ ట్విటర్ వేదికగా బుధవారం వరుస పోస్ట్స్ షేర్ చేశారు. ‘ప్రతి ఒక్కరికి చదువుతున్న రోజులు మధుర జ్ఞాపకాలుగా ఉంటాయని భావిస్తారు. కానీ అవే రోజులు కొందరికి భయం పుట్టించేవిగా ఉండటం నిజంగా బాధాకరం. నేను కూడా అలాంటి చెదు అనుభవాలను నా స్కూలింగ్‌లో చూశాను. ఇప్పుడు నాలాంటి అమ్మాయిలు వేల సంఖ్యల్లో ఉన్నారనే విషయం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. పాఠశాల అనేది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే మైదానం కావాలి, కానీ వారి విలువలను కూల్చేసే స్థలం కాకుడదు’ అంటు ఆమె రాసుకొచ్చారు. అంతేగాక తను చదివిన ఆడయార్ హిందు సీనియర్ సెకండరీ స్కూల్ సంఘటనలను కూడా గుర్తు చేసుకున్నారు. ‘ఇటీవల వెలుగు చూసిన పీఎస్‌బీబీ స్కూల్ సంఘటన మాదిరిగా నేను చదివిన అడయార్ హిందూ సీనియర్ సెకండరీ పాఠశాలలో కూడా ఇలాంటి భయంకర సంఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. విద్యార్థులపై లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, కుల వివక్షత, వ్యక్తిత్వాన్ని కించపరడం, నిరాధారమైన ఆరోపణలు వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల వారి ఆత్మగౌరవంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వేధింపులన్నిటిని కూడా నేను అడయార్ పాఠశాలలో స్వయంగా చూశాను, ఎదుర్కొన్నాను. అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే దీనికి కారణమైన ఉపాధ్యాయుల పేర్లను చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇలాంటివి ధైర్యంగా బహిర్గతం చేయడం ద్వారా మున్ముందు పాఠశాలల సంస్కృతిలో మార్పు తీసుకువస్తాయనే ఆశిస్తున్నా. ఎందుకంటే బాల్యంలో ఇలాంటి సంఘటనలు నరకంగా ఉంటాయి. అవి గుర్తుకు వస్తనే గుండెల్లో వణుకుపుడుతుంది’ అంటు ఆమె భావోద్వేగంతో చేదు జ్ఞాపకాలను పంచుకుంది. This is with respect to the issues being brought to light in school environments which seem highly toxic and problematic! It needs to change, NOW. Please read the thread. #SpeakUpAgainstHarrasment #HinduSchoolAdyar #PSBB @Chinmayi pic.twitter.com/QXsV784x6P — Gouri G Kishan (@Gourayy) May 25, 2021 -
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ యంగ్ డైరెక్టర్
చెన్నై : కరోనా వైరస్..సినీ ఇండస్ర్టీని వణికిస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు కరోనా సోకింది. ఈయన దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో 'మాస్టర్' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా డైరెక్టర్ కనగరాజ్ వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాని, వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పాడు. దీంతో మీరు త్వరగా కోలుకొని తిరిగి రావాలంటూ పలువురు అభిమానులు ట్వీట్ చేశారు. 2016లో అవియాల్తో సినీ కెరీర్ ప్రారంభించిన కనగరాజ్..కొద్ది కాలంలోనే స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా 'విక్రమ్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 🙏 pic.twitter.com/hSUFnNO3GB — Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 29, 2021 చదవండి : ‘మాస్టర్’ సినిమా లీక్.. దర్శకుడి భావోద్వేగ ట్వీట్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత, కారణం ఇదే.. -
'మాస్టర్' డ్యాన్స్‌తో దుమ్మురేపిన క్రికెటర్లు
అహ్మదాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. అయితే ఆనందాన్ని అతను ఇంకా కొనసాగిస్తున్నట్లుగా తాజాగా రిలీజ్ చేసిన వీడియో ద్వారా తెలుస్తుంది. ఇళయదళపతి విజయ్ 'మాస్టర్' సినిమా తమిళనాట ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో మాస్టర్ టైటిల్సాంగ్ 'వాతీ కమింగ్' పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదే పాటకు అశ్విన్ మాస్టర్ సిగ్నేచర్ స్టెప్ వేయగా.. హార్దిక్ పాండ్యా అతన్ని అనుకరించాడు. ఇక చివర్లో వీరిద్దరి మధ్యలో కుల్దీప్ వచ్చి ఇరగదీశాడు. జిమ్ సెషన్లో వర్క్‌వుట్ చేస్తున్న సమయంలో సరదాగా డ్యాన్స్ చేసిన అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్, కుల్దీప్లను ట్యాగ్ చేస్తూ వాతీ షుడ్ బీ హ్యాపీ( అనిరుధ్, విజయ్ చూస్తే సంతోషిస్తారు) అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా మొటేరా వేదికగా జరగనున్న పింక్‌బాల్ టెస్టు పురస్కరించుకొని ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఇరు జట్ల మధ్య డే నైట్ టెస్టు సిరీస్ జరగనుంది. కాగా అశ్విన్ రెండో టెస్టులో సెంచరీతో పాటు బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేపట్టాడు. తద్వారా టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. చదవండి: సిక్సర్లతో రెచ్చిపోయిన ఇషాన్ కిషన్ 'అంత తక్కువ ధర.. ఐపీఎల్ ఆడకపోవచ్చు' View this post on Instagram A post shared by Ashwin (@rashwin99) -
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ‘మాస్టర్’
తమిళ స్టార్ హీరో విజయ్ 'మాస్టర్' చిత్రం ఈ సంక్రాంతికి తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మాస్టర్’ 200 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది. ఈ క్లబ్‌లలో చేరిన విజయ్ చిత్రాలలో ‘మెర్సల్’ (అదిరింది), ‘సర్కార్’,‘బిగిల్’ (విజిల్)ల తర్వాత ఇప్పడు ‘మాస్టర్’ నాలుగో చిత్రంగా నిలిచింది. (చదవండి: ఇలాగైతే... ఎలా మాస్టర్?) కాగా తమిళ, తెలుగు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బ్లస్టర్‌గా నిలిచిన ‘మాస్టర్’ మూవీ ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతికి సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ మూవీ విడుదలైన 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల కావడం గమనార్హం. ఈ వార్త విన్న డిజిటల్ ప్లాట్‌ఫాం ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. ట్రేడ్ వర్గాలు మాత్రం దీని ప్రభావం కలెక్షన్ల మీద పడే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేస్తున్నాయి. (చదవండి: విజయ్‌తో రొమాన్స్ చేయనున్న బుట్ట బొమ్మ!) -
‘మాస్టర్’ సినిమా లీక్.. దర్శకుడి భావోద్వేగ ట్వీట్
తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' విడుదలకు కొద్ది గంటల ముందే పైరసీ బారిన పడింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం (జనవరి 13)న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కానీ ఇంతలోనే సినిమాకు సంబందించిన కొన్ని సీన్లు లీక్ అయ్యాయి. నిన్నటి నుంచి ఇవి సోషల్ మీడియాలో వైరల్ కాగా, పలువురు తమ స్టాటస్ మెసేజ్ లుగా వీటిని పెడుతుండటంతో సినిమా యూనిట్ అప్రమత్తమైంది. తమకు జరుగుతున్న నష్టంపై చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించి, మాస్టర్ ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. మీ వద్దకు లీక్ అయిన దృశ్యాలు వస్తే వాటిని దయచేసి షేర్ చేయకండి. విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది’ అని లోకేశ్ కనకరాజ్ ట్వీట్ చేశారు. నగరం, ఖైది చిత్రాల తర్వాత లొకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. తెలుగు, తమిళంలో ఈ సినిమా జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ప్రోమోలతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. Dear all It's been a 1.5 year long struggle to bring Master to u. All we have is hope that you'll enjoy it in theatres. If u come across leaked clips from the movie, please don't share it 🙏🏻 Thank u all. Love u all. One more day and #Master is all yours. — Lokesh Kanagaraj (@Dir_Lokesh) January 11, 2021