ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న ‘మాస్టర్‌’ | Vijay Master Movie Streaming On Amazon Prime From February 12th | Sakshi
Sakshi News home page

అప్పటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న ‘మాస్టర్‌’

Published Sat, Jan 23 2021 8:34 PM | Last Updated on Sat, Jan 23 2021 10:47 PM

Vijay Master Movie Streaming On Amazon Prime From February 12th - Sakshi

తమిళ స్టార్ హీరో విజయ్ 'మాస్టర్' చిత్రం ఈ సంక్రాంతికి తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మాస్టర్’ 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఈ క్లబ్‌లలో చేరిన విజయ్‌ చిత్రాలలో ‘మెర్సల్’ (అదిరింది), ‘సర్కార్’,‘బిగిల్’ (విజిల్)ల తర్వాత ఇప్పడు ‘మాస్టర్’‌ నాలుగో చిత్రంగా నిలిచింది. (చదవండి: ఇలాగైతే... ఎలా మాస్టర్‌?)

కాగా తమిళ, తెలుగు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బ్లస్టర్‌గా నిలిచిన ‘మాస్టర్’‌ మూవీ ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్‌ ప్రైంలో స్ట్రీమింగ్‌ కానుంది. సంక్రాంతికి సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచిన ఈ మూవీ విడుదలైన 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల కావడం గమనార్హం. ఈ వార్త విన్న డిజిటల్‌ ప్లాట్‌ఫాం ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. ట్రేడ్‌ వర్గాలు మాత్రం దీని ప్రభావం కలెక్షన్ల మీద పడే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేస్తున్నాయి. (చదవండి: విజయ్‌తో రొమాన్స్‌ చేయనున్న బుట్ట బొమ్మ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement