Senior Actress Sakshi Shivanand Latest Photo Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

Sakshi Shivanand: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాస్టర్‌’ హీరోయిన్‌! సాక్షి లేటెస్ట్‌ ఫొటో వైరల్‌..

Published Wed, Feb 1 2023 1:45 PM | Last Updated on Wed, Feb 1 2023 3:27 PM

Senior Actress Sakshi Shivanand Latest Photo Goes Viral in Social Media

సీనియర్‌ నటి, హీరోయిన్‌ సాక్షి శివానంద్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, మహేశ్‌ బాబు, రాజశేఖర్‌ వంటి అగ్ర నటులతో జతకట్టింది. 90లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సాక్షి చిరంజీవి మాస్టర్‌ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున సీతారామారాజు మూవీలో అలరించింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన సాక్షి ఆ తర్వాత సడెన్‌గా సినిమాలకు దూరమైంది. 

తెలుగులో హీరోయిన్‌గా కనిపించిన ఆమె చివరి చిత్రం సింహరాశి. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పుటికి ఆ తర్వాత సాక్షికి అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో తమిళ్‌, కన్నడ ఇండస్ట్రీలపై ఫోకస్‌ పెట్టింది. అలా ఆడపదడపా చిత్రాల్లో నటించిన ఆమె 2008లో జగపతిబాబు నటించిన హోమం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్‌లో నటించింది. ఆ తర్వాత 2010లో శ్రీకాంత్ నటించిన ‘రంగ ది దొంగ’ సినిమాలో నటించిన సాక్షికి తెలుగులో చివరి చిత్ర ఇదే. ఆ తర్వాత ఆమె మరే సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని గృహిణిగా ఉంటుంది.

కాగా తెలుగులో ఆమె బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు మహేశ్‌ బాబుతో యువరాజుతో పాటు మరిన్ని చిత్రాలతో ఆకట్టుకుంది. పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పింది. అయితే ఇటీవల ఆమె బర్త్‌డే సందర్భంగా ఆమె లేటెస్ట్‌ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో సాక్షి గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటూ ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పటికే అలాగే అందంగా, గ్లామరస్‌గా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement