
చెన్నై : కరోనా వైరస్..సినీ ఇండస్ర్టీని వణికిస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు కరోనా సోకింది. ఈయన దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో 'మాస్టర్' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా డైరెక్టర్ కనగరాజ్ వెల్లడించారు.
ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాని, వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పాడు. దీంతో మీరు త్వరగా కోలుకొని తిరిగి రావాలంటూ పలువురు అభిమానులు ట్వీట్ చేశారు. 2016లో అవియాల్‌తో సినీ కెరీర్ ప్రారంభించిన కనగరాజ్..కొద్ది కాలంలోనే స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా 'విక్రమ్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 29, 2021
చదవండి : ‘మాస్టర్’ సినిమా లీక్.. దర్శకుడి భావోద్వేగ ట్వీట్
ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత, కారణం ఇదే..