Director Arunraja Kamaraj Wife Sindhuja Passed Away Due To Covid - Sakshi
Sakshi News home page

కోలివుడ్‌లో విషాదం: నటుడు, దర్శకుడి సతీమణి మృతి

May 18 2021 8:08 AM | Updated on May 18 2021 3:05 PM

Arunraja Kamaraj Wife Succumbed To Coronavirus - Sakshi

కరోనా కోరల్లో కోలివుడ్‌ విలవిలలాడుతోంది. దర్శకుడు అరుణ్‌రాజ్‌ కామరాజ్‌కు భార్య హింధూజ, యువ నటుడు నితీష్‌ వీరా కరోనాతో కన్నుమూశారు..

కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని కోలివుడ్‌ విలవిలలాడుతోంది. సోమవారం ఓ దర్శకుడు భార్యను, మరో యువ నటుడిని కరోనా కాటేసింది. దర్శకుడు అరుణ్‌రాజ్‌ కామరాజ్‌కు భార్య హింధూజ, యువ నటుడు నితీష్‌ వీరా కరోనాతో కన్నుమూశారు. దర్శకుడు అరుణ్‌రాజ్‌ కామరాజ్‌ సతీమణి హిందూజాకు ఇటీవల కరోనా సోకడంతో చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, శివకార్తికేయన్, హిందూజా భౌతిక కాయానికి నివాళులు అర్పించి సంతాపం ప్రకటించారు.  

యువ నటుడిని బలితీసుకున్న కోవిడ్‌ 
మరో యువ నటుడు నితీష్‌ వీరాను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. పుదుకోట్టై, వెన్నెల కబడ్డీ కుళు, కాలా అసురన్‌ చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి నితీష్‌ వీరా గుర్తింపు పొందారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన లాభం చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కరోనా వ్యాధి సోకడంతో నితీష్‌ వీరా స్థానిక ఓమందూర్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. సోమవారం 6.30 గంటల పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: ఆగని మృత్యుఘోష: ఇద్దరు కమెడియన్లు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement