
హీరోయిన్ కీర్తి సురేష్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా కరోనా నుంచి బాధపడుతున్న ఆమె తాజాగా దీన్నుంచి కోలుకుంది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈరోజుల్లో నెగిటివ్ అనేది పాజిటివ్‌గా మారింది. నాపై మీరు చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అని పేర్కొంది.
కోవిడ్ నెగిటివ్ అనంతరం తొలిసారిగా సెల్ఫీ ఫోటోను షేర్ చేసింది. దీంతో కీర్తి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే భోళా శంకర్‌లో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment