ఈ మధ్య కాలంలో తమ తమ అభిమాన నటీనటుల కోసం పాదయాత్రలు చేయడం కామన్ అయిపోయింది. తమకు నచ్చిన హీరోని ఒక్కసారైనా ప్రత్యేక్షంగా కలవాలనుకుంటారు. అందుకోసం ఎంతటి రిస్క్ అయిన చేయడానికి వెనకడారు. ఇక హీరోలు సైతం తమ బిజీ షెడ్యూల్డ్‌ని పక్కనపెట్టి, ఇంటికి వచ్చిన అభిమానులను కలుస్తుంటారు. వారికి ఆర్థికంగా సాయం చేయడం చేస్తుంటారు. తాజాగా ఓ దివ్యాంగ అభిమాని 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్‌కు వచ్చి మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు.
(చదవండి: దటీజ్ మెగాస్టార్.. అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ..)
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్ చిరంజీవికి పెద్ద అభిమాని. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేయాలనుకున్నాడు. అక్టోబర్ 3వ అమలాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి, 23 రోజులు 726 కి. మీ నడిచి సోమవారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరకి చేరుకున్నాడు.ఈ వార్త తెలిసి చలించిపోయిన చిరంజీవి.. గంగాధర్‌ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. నంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. అయితే తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకున్న గంగాధర్ చిరంజీవి ఆతిధ్యానికి పులకించిపోయారు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment