
సాక్షి, చెన్నై: నటుడు విజయ్ బంధువు, మాస్టర్ చిత్ర నిర్మాత జేవియర్ బ్రిట్టో ఇంట్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. చెన్నై, శ్రీపెరంబదూరులోని పలు సెల్‌ఫోన్ సంస్థలపై మంగళవారం సాయంత్రం నుంచి ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.
బుధవారం ఉదయం అడయార్‌లోని జేవియర్ బ్రిట్టో నివాసం, చెన్నై కార్యాలయాల్లో సోదాలు చేశారు. సెల్‌ఫోన్ సంస్థల్లో జరిపిన సోదాల్లో లభించిన సమాచారంతోనే దాడులు జరిగినట్లు సమాచారం. పొద్దుపోయే వరకు సోదాలు సాగాయి. విజయ్ బంధువైన బ్రిట్టో మాస్టర్ చిత్రంతో నిర్మాతగా మారారు. ఆయనకు పలు ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలోని హార్బర్‌ల ద్వారా అనేక దేశాలకు వివిధ ఉత్పత్తులను తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment