
చెన్నై : కోలీవుడ్ నటుడు విజయ్, సినీ ఫైనాన్షియర్ అన్బుచెళియన్‌కు చెందిన 38 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా వారు రూ.77 కోట్ల లెక్కతేలని నగదును స్వాధీనం చేసుకున్నారు. గతేడాది విడుదలైన ‘బిగిల్’ చిత్రానికి సంబంధించి పన్ను ఎగవేశారనే ఆరోపణలతో విజయ్ నివాసాలతోపాటు ఆ చిత్రాన్ని తెరకెక్కించిన ఏజీఎస్ సంస్థ కార్యాలయాలు, సంస్థకు చెందిన వ్యక్తుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అన్బు చెళియన్‌కు చెందిన సంస్థలు, మదురైలోని ఆయన నివాసంలో కూడా ఈ సోదాలు జరిగాయి. ఈ క్రమంలో రూ.77 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు పలు ఆస్తుల పత్రాలు, ప్రాంసరీ నోట్లు, హామీ కింద తీసుకున్న పోస్ట్‌డేటెడ్ చెక్కులను అధికారులు సీజ్ చేశారు. హీరో విజయ్ సదరు నిర్మాత నుంచి తీసుకున్న పారితోషికం, ఆస్తులపై పెట్టిన పెట్టుబడుల గురించి ఆరా తీయడంలో భాగంగా సోదాలు చేపట్టామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment