Is Actor Vijay Hair Original? Popular Director Answer This Question - Sakshi
Sakshi News home page

Vijay: హీరో విజయ్‌ది విగ్గా? లేక హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్నాడా?

Published Sun, May 28 2023 3:45 PM | Last Updated on Sun, May 28 2023 4:00 PM

Is Actor Vijay Hair Original? Popular Director Answer this Question - Sakshi

40.. 50.. 60.. 70 ఏళ్ల వయసులోనూ స్టార్‌ హీరోలు యంగ్‌గా కనిపిస్తున్నారు. నిత్యం కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేస్తున్నారు. డైట్‌ ఫాలో అవుతూ గ్లో కాపాడుకుంటున్నారు. ఈ వయసులోనూ హెయిర్‌ లాస్‌ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా చిన్నవయసులోనే జుట్టు తెల్లబారడం, కాస్త వయసు మీద పడగానే జుట్టు రాలిపోవడం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఈ పెద్ద హీరోల జుట్టు మాత్రం ఇప్పటికీ నిగనిగలాడుతుందేంటి? అన్న ప్రశ్న ఎందరికో వచ్చే ఉంటుంది. నిజంగానే అందరు హీరోలది రియల్‌ హెయిర్‌ కాకపోవచ్చు. కొందరు విగ్‌ లేదా ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకుని ఉండవచ్చు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కూడా ఈ కోవలోకే వస్తాడు.

39 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో ఉన్న నటుడు, దర్శకుడు చిత్ర లక్ష్మణన్‌కు గతంలో.. విజయ్‌ సినిమాల్లో విగ్గు వాడతాడా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. విజయ్‌ విగ్గు వాడడని క్లారిటీ ఇచ్చాడు. అయితే అతడు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నాడని పేర్కొన్నాడు. విజయ్‌ మాత్రమే కాదని, తమిళంలో ఎంతో మంది హీరోలు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇకపోతే మాస్టర్‌, వారసుడు సినిమాల్లో విజయ్‌ హెయిర్‌ స్టైల్‌ చాలామందికి నచ్చింది. దానికంటూ ‍ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. మాస్టర్‌ రిలీజ్‌ సమయంలోనూ విజయ్‌ హెయిర్‌ స్టైల్‌ గురించి అతడి బెస్ట్‌ ఫ్రెండ్‌ శ్రీమాన్‌కు ప్రశ్న ఎదురైంది. 'విజయ్‌ సర్‌ విగ్గు వాడుతున్నాడా?' అని ఓ నెటిజన్‌ అడగ్గా.. 'కావచ్చు, కాకపోవచ్చు. అతడు చిత్రయూనిట్‌ ఎలా చెప్తే అలా రెడీ అయిపోతాడు. అసలే కరోనా టైం ఇది.. ఈ చర్చ ఆపి ప్రార్థనలు చేయండి' అని రిప్లై ఇచ్చాడు శ్రీమాన్‌.

చదవండి: స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు నవ్వాలో, ఏడ్వాలో తెలియదు: ఆర్జీవీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement