Hair transplants
-
ఊపిరి తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్
దొడ్డబళ్లాపురం: జట్టు రాలిపోయి అందం చెడిపోతోంది, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని బాగా కనిపించాలని అనుకున్న యువకుడు ప్రాణాలే కోల్పోయాడు. కాస్మెటిక్ సర్జరీలు వికటిస్తే ఫలితం ఘోరంగా ఉంటుందనేందుకు మరో ఉదంతం తోడైంది. ఈ సంఘటన మంగళూరులో చోటుచేసుకుంది. స్థానిక అక్కరెకెరె నివాసి మహమ్మద్ మాజీన్కు జుట్టు రాలిపోయే సమస్య ఉంది. దీంతో మంగళూరు బెందోర్వెల్లో ఉన్న ఫ్లోంట్ కాస్మెటిక్ సర్జరీ– హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌లో సంప్రదించాడు. అక్కడ నిపుణులు అతనికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేస్తుండగా మహమ్మద్ ఆరోగ్యం విషమించింది. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందాడు. నిపుణుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. -
టర్కీకి క్యూ కడుతున్న పురుషులు : ఎందుకో తెలుసా?
ఆధునిక ప్రపంచంలో అందానికి ప్రాధాన్యత పెరిగింది. వయసు పైబడినా కూడా 20 సమ్‌థింగ్ లాగా కనిపించడం సాధ్యమే. శరీరంలోని ఏ భాగాన్నైనా మన ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత ఇరవయ్యేళ్లుగా గ్లోబల్ బ్యూటీ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించింది.వయసు పెరుగుతున్న కొద్దీ పురుషులను భయపెడుతున్న సమస్య బట్టతల. కొంతమందికి చిన్న వయసులోనే వెంట్రుకలు రాలుతూ ఉంటే బట్టతల వచ్చేస్తుందేమో అని టెన్షన్ వారిని స్థిమితంగా కూర్చోనీయదు దీనికి పరిష్కారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. మరోవిధంగా చెప్పాలంటే బట్టతల మీద కృత్రిమంగా జుట్టును మొలిపించుకోవడం. ఈ విషయంలో టర్కీ టాక్ ఆప్ ది వరల్డ్‌గా నిలుస్తోంది. టర్కీకే ఎందుకుహెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చు భారీగానే ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల జుట్టు మార్పిడికి ప్రపంచ వ్యాప్తంగా టర్కీ ఒక ముఖ్యమైన డెస్టినేషన్‌గా మారిపోయింది. బట్టతలపై పుష్కలంగా జుట్టు రావాలన్నా, బట్టతల మచ్చలను కప్పిపుచ్చుకోవాలన్నా టర్కీకి క్యూ కడుతున్నారు పురుషులు.పెరుగుతున్న ప్రజాదరణఇండియా టుడే కథనం ప్రకారం "అత్యంత నైపుణ్యం, అనుభవజ్ఞులైన సర్జన్లు, అధునాతన వైద్య సదుపాయాలు, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చులతో సహా అనేక కారణాల వల్ల టర్కీ జుట్టు మార్పిడికి ప్రముఖ గమ్యస్థానంగా మారింది" అని ఆర్టెమిస్ హాస్పిటల్ చీఫ్, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ విపుల్ నందా తెలిపారు.అంతేకాదు వసతి, రవాణాతో సహా మెడికల్ టూరిజం ప్యాకేజీలను కూడా అందజేస్తోందట టర్కీ ప్రభుత్వం. చికిత్స కోసం దేశాన్ని సందర్శించే ప్రతి వ్యక్తికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అలాగే స్థానిక క్లినిక్‌లు అత్యాధునిక సాంకేతికతలు, సాంకేతికతలతో చక్కటి ఫలితాలను సాధిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టర్కీలో బ్లాక్ మార్కెట్ కూడా విస్తరించిందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు విషయానికి వస్తే..క్లినిక్, సర్జన్ నైపుణ్యం లాంటి అంశాల ఆధారంగా జుట్టు మార్పిడికి అయ్యే ఖర్చు మారుతుంది. మన ఇండియాలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాదాపు 83 వేల నుంచి రూ. 2 లక్షల 50 వేలు అవుతుంది. టర్కీలో, సగటున సుమారు రూ. 1,24,000 నుండి రూ. 2 లక్షల 90 వేల వరకు ఉంటుంది. ఇది పాశ్చాత్య దేశాల కంటే చాలా తక్కువ. -
68 ఏళ్ల వయసులో శ్రీదేవి భర్త హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య జుట్టు ఊడటం. ఎన్నిరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా జుట్టు కాపాడుకోవడం గగనమైపోతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇదే పరిస్థితి. ఇక వయసు పైబడినవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బట్టతలతోనే నెట్టుకువస్తున్నారు. చాలామంది జుట్టు ఊడటాన్ని ఆపలేక హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. బట్టతలను కప్పిపుచ్చుకోవడానికి ఇది చక్కటి మార్గం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తాజాగా దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన బోనీ కపూర్ అదే క్లినిక్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇంకేముంది, అతడి బట్టతలను కాస్తా నిండైన ఒత్తైన వెంట్రుకలతో నింపేశారు. నా తలపై వెంట్రుకలు వచ్చాయ్.. ఇది చూసిన బోనీ కపూర్.. నా తలపై వెంట్రుకలు వచ్చాయ్. ఇది నా లుక్కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి అని చెప్పుకొచ్చాడు. 68 ఏళ్ల వయసులో జుట్టు కోసం ఆరాటపడుతుండటం చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా నిర్మాతగా బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన బోనీ కపూర్ గతేడాది 'తు జూటీ మై మక్కర్' సినిమాతో నటుడిగా మారాడు. ఇందులో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. చదవండి: షణ్ముఖ్ అన్న ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో.. -
హీరో విజయ్‌ది రియల్ హెయిరా? లేదంటే విగ్గా?
40.. 50.. 60.. 70 ఏళ్ల వయసులోనూ స్టార్ హీరోలు యంగ్‌గా కనిపిస్తున్నారు. నిత్యం కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు. డైట్ ఫాలో అవుతూ గ్లో కాపాడుకుంటున్నారు. ఈ వయసులోనూ హెయిర్ లాస్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా చిన్నవయసులోనే జుట్టు తెల్లబారడం, కాస్త వయసు మీద పడగానే జుట్టు రాలిపోవడం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఈ పెద్ద హీరోల జుట్టు మాత్రం ఇప్పటికీ నిగనిగలాడుతుందేంటి? అన్న ప్రశ్న ఎందరికో వచ్చే ఉంటుంది. నిజంగానే అందరు హీరోలది రియల్ హెయిర్ కాకపోవచ్చు. కొందరు విగ్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని ఉండవచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా ఈ కోవలోకే వస్తాడు. 39 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో ఉన్న నటుడు, దర్శకుడు చిత్ర లక్ష్మణన్‌కు గతంలో.. విజయ్ సినిమాల్లో విగ్గు వాడతాడా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. విజయ్ విగ్గు వాడడని క్లారిటీ ఇచ్చాడు. అయితే అతడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడని పేర్కొన్నాడు. విజయ్ మాత్రమే కాదని, తమిళంలో ఎంతో మంది హీరోలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే మాస్టర్, వారసుడు సినిమాల్లో విజయ్ హెయిర్ స్టైల్ చాలామందికి నచ్చింది. దానికంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మాస్టర్ రిలీజ్ సమయంలోనూ విజయ్ హెయిర్ స్టైల్ గురించి అతడి బెస్ట్ ఫ్రెండ్ శ్రీమాన్‌కు ప్రశ్న ఎదురైంది. 'విజయ్ సర్ విగ్గు వాడుతున్నాడా?' అని ఓ నెటిజన్ అడగ్గా.. 'కావచ్చు, కాకపోవచ్చు. అతడు చిత్రయూనిట్ ఎలా చెప్తే అలా రెడీ అయిపోతాడు. అసలే కరోనా టైం ఇది.. ఈ చర్చ ఆపి ప్రార్థనలు చేయండి' అని రిప్లై ఇచ్చాడు శ్రీమాన్. May be may not be what ever he does is designed by the crew of this film. Bro padam parunghaa no comments now just silence and prayers for corona . You will live my nanban in vjy 64 mASTER — actor sriman (@ActorSriman) March 15, 2020 చదవండి: స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు నవ్వాలో, ఏడ్వాలో తెలియదు: ఆర్జీవీ -
బట్టతల బెంగా.. పరిష్కారాలు ఇవిగో..!
మామూలుగానేమనలో చాలామందికి జుట్టుఎక్కువగా రాలిపోతుంటుంది. ఇంకొంతమందిలో అయితే జుట్టు చాలా ఎక్కువగా రాలుతూ తమకు బట్టతల వస్తుందేమోఅన్న బెంగ కలిగిస్తుంటుంది. ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలూ, వివరాలూ ఇవి... జెండర్ ప్రకారం చూస్తే బట్టతలలో రెండు రకాలుంటాయి. మొదటిది పురుషుల్లో వచ్చే బట్టతల. దీన్నే ‘మేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’ అంటారు. ఇక రెండోది మహిళల్లో వచ్చే ‘ఫిమేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’. బట్టతలను వైద్యపరిభాషలో ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటారు. బట్టతల... కారణాలు గతకొద్దికాలం వరకూ పురుషుల్లో బట్టతల రావడానికి కారణం టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్లనే అనే అపోహ ఉండేది. మగపిల్లల్లో యుక్తవయసు రాగానే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రవించడం మొదలవుతుందనీ... ఈ టెస్టోస్టెరాన్ కారణంగా యువ దశ మొదలుకొని క్రమంగా వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో హెయిర్‌లైన్ కొద్దికొద్దిగా వెనక్కు పోతూ ఉండేదన్న అభిప్రాయం ఉండేది. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం దీనికి టెస్టోస్టెరాన్ కారణం కాదనీ... ‘డీహెచ్‌టీ’ (డిహైడ్రో టెస్టోస్టెరాన్) కారణమని తేలింది. పురుషులు... మహిళల్లో తేడాలిలా... ఇక పురుషుల్లో వచ్చే బట్టతలలో నుదురు మీద ఉండే హెయిర్‌లైన్ క్రమంగా వెనక్కిపోతూ ఉంటుంది. అదే మహిళల్లోనైతే ఫిమేల్ పాట్రన్ హెయిర్‌లాస్ అనే కండిషన్ ఉంటుంది. ఇందులో తలపై ముందున్న హెయిర్‌లైన్ అలాగే ఉండి, మాడు మీద జుట్టు పలచబారుతూ పోతుంటుంది. బట్టతల... నిర్ధారణ పరీక్షలివి... బట్టతలను నిర్ధారణ చేయడానికి డెర్మోస్కోపీ లేదా ట్రైకోస్కోపీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. చికిత్స ప్రక్రియలు... బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక... తొలుత మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. వాటితో ప్రయోజనం లేకపోతే మీసోథెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండ్ డర్మారోలర్ వంటి ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు. ఇక లేజర్ సహాయంతో చేసే ఇన్ఫ్రారెడ్ లైట్ థెరపీ, లేజర్ కోంబింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటన్నింటితో పాటు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి చికిత్సలు కూడా ఉపకరిస్తాయి. -
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన రెండు రోజులకే..
ముంబై: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనంతరం వ్యాపారి మృతి చెందిన కేసులో వైద్యుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. రోగి తన అనారోగ్య స్థితిని చెప్పినప్పటికీ వైద్యులు సరిగా పట్టించుకోలేదని నివేదికలో పొందుపరిచింది. వ్యాపారి మరణానికి వైద్యుల నిర్లక్ష్యంతోపాటు నర్సింగ్ హోంను బాధ్యులుగా చేర్చుతూ ప్రముఖ జేజే ఆసుపత్రి నివేదికను వెల్లడించింది. వివరాలు.. ముంబైకి చెందిన వ్యాపారి శ్రవణ్ కుమార్ చౌదరి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం డెర్మటాలజిస్ట్ డా. వికాస్ హల్వాయ్ను సంప్రదించాడు. ఈ క్రమంలో శ్రవణ్‌కు మార్చి 7న ఒకే సిట్టింగ్‌లో 9వేలకు పైగా వెంట్రుకలను ట్రాన్స్‌ప్లాంట్ చేశాడు. అనంతరం శ్రవణ్ మెడనొప్పితో అనారోగ్యం పాలవగా వెంటనే గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ గ్లోబల్ ఆసుపత్రి అతడిని చేర్చుకోడానికి నిరాకరించింది. దీంతో అక్కడి నుంచి దాల్వీ నర్సింగ్ హోంను ఆశ్రయించాడు. కానీ శ్రవణ్‌ను నర్సింగ్ హోంలో చేర్చుకున్న కొద్ది గంటలకే డిశ్చార్జి చేసి పంపించేశారు. దీంతో రోగి కోలుకోకపోగా మరింత జబ్బుపడ్డాడు. అతని మొహం, భుజాలపై వాపు రావడంతోపాటు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. శ్రవణ్ కుటుంబ సభ్యులు అతడిని హీరానందని ఆసుపత్రికి తరలించగా, మరుసటి రోజు(డిసెంబర్ 9న) మృతి చెందాడు. దీంతో పోలీసులు శ్రవణ్‌ది ఆకస్మిక మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై ప్రముఖ జేజే ఆసుపత్రి వైద్యుల బృందంతో నిపుణుల కమిటీని వేయగా వారు గురువారం నివేదికలోని అంశాలను వెల్లడించారు. శ్రవణ్ కుమార్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత అనారోగ్యం పాలయ్యాడని ఆ సమయంలో అతనికి మెరుగైన వైద్యం అందించాల్సిందని అభిప్రాయపడింది. అతని మృతికి డెర్మటాలజిస్ట్ వికాస్ హల్వాయ్తోపాటు నిర్లక్ష్యం ప్రదర్శించిన నర్సింగ్ హోం వైద్యులను ప్రధాన కారకులుగా పేర్కొంది. కాగా శ్రవణ్ మృతికి కారకులైనవారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ శ్రవణ్ కుమార్ సోదరుడు శివ్ కరణ్ పేర్కొన్నారు. చదవండి: ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ -
ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ముంబై: ముంబైలో గతవారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయించుకున్న ఓ వ్యాపారవేత్త ఆ తర్వాత 40 గంటల్లోనే మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రావణ్ చౌదరి అనే వ్యాపారవేత్త (43) మార్చి 7న ఈ చికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ 12 గంటలు సాగింది. ఆ తర్వాత ఇంటికెళ్లారు. తర్వాత శ్వాస, గొంతు, ముఖం వాపు సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన సలహాను కాదని ఒకేసారి 9,000 వెంట్రుకలను పెట్టించుకున్నాడని, సాధారణంగా ఒకేసారి 3,000 వెంట్రుకలు పెట్టకూడదని వైద్యుడు పోలీసులకు తెలిపారు. పోలీసులు ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్; వ్యక్తి మృతి
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న ఓ వ్యక్తి ఎలర్జీతో మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈమేరకు అతడికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన డెర్మటాలజిస్టును విచారిస్తున్నారు. వివరాలు.. ముంబైకి చెందిన వ్యాపార్తవేత్త(40) కొన్ని రోజుల క్రితం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఓ క్లినిక్‌కు వెళ్లాడు. తనకు ఒకే సిట్టింగులో 9 వేల వెంట్రుకలు ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం అతడికి ఎలర్జీ వచ్చింది. దీంతో అనఫిలాక్సిస్ సోకడంతో శరీరంలోని ముఖ్య అవయవాలన్నీ పాడైపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక సిట్టింగ్‌లో 3 వేల వెంట్రుకలు మాత్రమే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. అదే విధంగా సర్జరీ చేసే క్రమంలో గ్రహీత శరీరం సరిగా స్పందించనట్లైతే సైడ్ ఎఫెక్్ట్ప వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. -
వికటించిన కేశ చికిత్స.. ఆత్మహత్య
సాక్షి, యశవంతపుర : కేశ సౌందర్యం కోసం చేసిన ట్రీట్మెంట్ కారణంగా వెంట్రుకలు మొత్తం ఊడిపోవడంతో అవమానంగా భావించిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడగు జిల్లా విరాజపేట తాలూకా కొట్టిగేరి గ్రామానికి చెందిన నేహా గంగమ్మ (18) బీబీఏ చదువుతోంది. తల వెంట్రుకలు రింగు రింగులుగా ఉండటానికి మైసూరులోని ఓ బ్యూటీ పార్లర్లో కేశ సౌందర్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంది. అయితే కొద్ది రోజులుగా ఆమె జట్టు ఊడిపోతూనే ఉంది. ఆరు నెలలోపే తల గుండుగా మారింది. దీంతో సహచర విద్యార్థులకు సమాధానం చెప్పలేక కళాశాలకు వెళ్లడం మానేసింది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. లక్ష్మణ తీర్థ నదిలో నేహ మృతదేహం లభించింది. తల వెంట్రుకలు మొత్తం ఊడిపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జుట్టు కోసం వెళ్లి...ప్రాణంపైకి తెచ్చుకున్నాడు
-
జుట్టు రాలె..కన్ను పాయె!
సౌదీ అరేబియాకు చెందిన తారిక్ కుస్సు బట్టతలపై జుట్టు కోసం బంజారాహిల్స్‌లోని ఓ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్లో సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ వికటించి కంటిచూపు కోల్పోయాడు. బాధితుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు కేంద్రాన్ని తనిఖీ చేస్తే సదరు వైద్యుడు అసలు సర్జనే కాదని తేలింది. మెడికల్ టూరిజానికి కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో ఇతర దేశాలతో పోలిస్తే వైద్యం చాలా చౌక. తక్కువ ధరకే మెరుగైన వైద్యం పొందే వీలుంది. దీంతో విదేశాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. అయితే అక్రమ సంపాదనే లక్ష్యంగా కొందరు వైద్యులు చికిత్స ముసుగులో అనైతిక చర్యలకు పాల్పడుతుంటే.. ఏ అర్హతలూ లేని అనేక మంది శంకర్‌దాదా ఎంబీబీఎస్లుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి వ్యక్తులపై ఏడాది కాలంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు 40 ఫిర్యాదులు అందాయి. అనైతిక వైద్యసేవలు.. వైద్యసేవల్లోనిర్లక్ష్యం.. వంటి ఘటనలపై తెలంగాణమెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదులువెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు40 ఫిర్యాదులు అందగా, వీటిలోఇప్పటికే నలుగురు వైద్యులపైరెండు నుంచి ఐదేళ్ల పాటు సస్పెన్షన్వేటు విధించారు. తాజాగా మరో వైద్యుడిపై రెండేళ్ల పాటు వేటువిధించింది. మరో ఐదుగురు వైద్యులకు హెచ్చరిక ఇచ్చి పంపింది. సాక్షి, సిటీబ్యూరో: వృత్తిపట్ల అంకిత భావం, వైద్య రంగంలో కనీస అనుభవం లేని వారు చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. నిపుణులతో పాటు ఆస్పత్రిలో కనీస సదుపాయాలు లేకపోయినా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులుగా చెలామణి అవుతూ.. నిపుణులు, వారు చేసిన చికిత్సలపై ప్రచారం చేసుకుని రోగులను మభ్య పెడు తున్నారు. తీరా ప్రాణాల మీదకు వచ్చే సరికి ‘మా వల్ల కాదు..’అంటూ చేతులెత్తేస్తున్నారు. ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అప్పటికే రోగం మరింత ముదిరి పోవడంతో పాటు వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల అనేక మంది మత్యువాత పడుతున్నారు. కానీ ఇవేవీ బయటికి రావడం లేదు. ఒక వేళ వచ్చినా, వారు కూడా ఆ క్షణానికి హంగమా సృష్టించి రూ.లక్షో..రెండు లక్షలు నష్టపరిహారంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వైద్య పరమైన నిర్లక్ష్యంపై ఆస్పత్రులను కోర్టులకు ఈడుస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మచ్చుకు కొన్ని ఫిర్యాదులు... ♦ సౌదీఅరేబియాకు చెందిన తారిక్ కుçస్సు బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 1లోని ఖాన్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్లో సర్జరీ చేయించుకున్నాడు. డాక్టర్ ఇష్రత్ ఉల్లా ఖాన్ చేసిన సర్జరీ వికటించడంతో రోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కంటిచూపును కూడా కోల్పొవాల్సి వచ్చింది. దీంతో బాధితుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు సదరు కేంద్రానికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. సదరు వైద్యుడు అసలు సర్జనే కాదని తేలింది. కనీస వైద్య సదుపాయాలు లేని సెంటర్లో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఎలాంటి అర్హతలు లేకుండా కాస్మొటిక్ సర్జరీ చేయడం వల్లే వైద్యం వికటించినట్లు గుర్తించింది. అనైతిక వైద్యానికి పాల్పడిన ఆ వైద్యుడిపై రెండేళ్లపాటు సస్పెన్షన్ వేటు విధించింది. ♦ కేన్సర్‌తో బాధపడుతున్న రోగులకు సంతోష్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో డాక్టర్ ఏక్యూ టెర్రి రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఏకంగా కీమోథెరపీ నిర్వస్తున్నాడు. కేన్సర్ అడ్వాన్స్ స్టేజీ లో ఉన్న రోగులకు ఖరీదైన మందులు సూచిస్తూ మోసం చేస్తున్నాడు. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మెడికల్ కౌన్సిల్ బృందం ఆ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి, సదరు డాక్టర్‌కు హెచ్చరించింది. ♦ సంగారెడ్డిలో కొంతమంది వైద్యులు అన వసరంగా సిజేరియన్లు నిర్వహించారు. ఈ అం శంపై జిల్లా కలెక్టర్ ఐదు ఆస్పత్రులపై ఫిర్యాదు చేశారు. ఎథిక్స్ కమిటీ బృందం ఇటీవల ఆయా ఆస్పత్రులను తనిఖీ చేసింది. అక్రమ సంపాధనే లక్ష్యంగా సిజేరియన్లు చేసినట్లు గుర్తించింది. జిల్లా కలెక్టర్‌కు నివేదిక కూడా అందజేసింది. ♦ నిమ్స్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఓ వై ద్యుడు తన వద్దపని చేస్తున్న పీజీ వైద్యుల ప ట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు రావడంతో... ఆయన్ను హెచ్చరించి పంపింది. ♦ న్యూబోయిన పల్లిలోని ఓ ఆస్పత్రిలో చని పోయినవ్యక్తిని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం చేసినట్లు నటించారు. బాధితులు గొడవ చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం వారికి పరిహారం అందజేసింది. కమీషన్లు ఇవ్వడం నేరమే రోగుల పట్ల సున్నితంగా వ్యవహరించడం, వారి బాధలను సహృదయంతో అర్థం చేసుకోవాలి. వైద్యులు రోగుల మెడికల్ రికార్డులను మూడేళ్ల పాటు విధిగా భద్రపరచాలి. గ్రామీణ ఆర్ఎంపీ వైద్యులకు కమిషన్లు చెల్లించడం, వారి ద్వారా రోగులను రప్పించుకోవడం నేరం. సర్జరీలపై వైద్యుడి పేరుతో వ్యాపార ప్రకటనలు ఇవ్వడం నైతిక విరుద్ధం. – డాక్టర్ రాజలింగం,వైస్ చైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠినంగా వ్యవహరిస్తాం గతంతో పోలిస్తే ప్రస్తుతం వైద్య చికిత్సలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఏ చికిత్స దేనికి చేస్తారో? ఏ మందులు ఏ జబ్బుకు సూచిస్తారో? అనే అంశం వైద్యవృత్తితో సంబంధం లేని సగటు మనిషికి కూడా తెలిసి పోయింది. వైద్యపరమైన నిర్లక్ష్యంపై సంబంధిత ఆస్పత్రులను, వైద్యులను నిలదీస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులపైనే కాదు వారి వద్ద వైద్యవిద్య నేర్చుకుంటున్న విద్యార్థులు, వారి ఫిర్యాదులను కూడా స్వీకరించి హెచ్చస్తున్నాం. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ -
‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించినా నో యూజ్’
ప్రస్తుత కాలంలో ఆడ, మగ, చిన్నా పెద్ద ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని కోసం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత డబ్బు వెచ్చించినా.. ఫలితం లేకుండా పోతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందటానికి ఇటీవల పాకిస్థాన్‌కి చెందిన ప్రముఖ నటుడు సయీద్ సాజిద్ హసన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స చేయించారు. అయితే ఆ చికిత్స వికటించిదంటూ ఓ వీడియో ద్వారా తెలియజేశారు. చికిత్స మొదలు పెట్టినప్పటినుంచి తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని సయీద్ సాజిత్ ఆ వీడియాలో పేర్కొన్నారు. చికిత్స వికటించి తలపై ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. వైద్యులతో ఈ విషయం చెబితే ఇలాంటి సమస్య సాధారణమే అని చెప్పి, తలపై వచ్చిన ఇన్ఫెక్షన్ను సెలైన్ వాటర్‌తో శుభ్రం చేశారని వాపోయారు. చికిత్స వికటించి తలపై వచ్చిన గాయాలను హసన్ చూపిస్తూ.. ‘ఇప్పడు ఇది నా పరిస్థితి.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల చాలా బాధపడుతున్నాను. కొంతకాలంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. వృత్తిపరంగా కూడా ఇబ్బందిపడాల్సి వస్తోంది’ అని తెలిపారు. అదేవిధంగా ఇలా చికిత్స చేయించుకోవాలనుకునే వారు మంచి సర్జన్ దగ్గరికి వెళ్లండి అంటూ.. లేకపోతే నాలాంటి పరిస్థితి మీకు వస్తుందని సందేశమిచ్చారు. -
బోడిగుండుపై వెంట్రుకలు మొలుస్తాయి!
బట్టతలతో చిక్కేమీ ఉండదుగానీ... చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో అన్న బెంగే ఎక్కువ. అందుకే బట్టతలకు చికిత్స అంటే చాలు.. చాలామంది వేలకువేలు పోసి నూనెలు కొంటూంటారు. కష్టమైనా.. నొప్పి ఎక్కువ ఉన్నా... హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కూ సిద్ధమవుతూంటారు. ఇకపై ఈ బాదరబందీలేవీ వద్దంటున్నారు ఇండియానా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు. శరీరంలో... ఏ కణంగానైనా మారగల సామర్థ్యమున్న మూలకణాలతో తాము పరిశోధనశాలలో వెంట్రుకలతో కూడిన ఎలుక చర్మాన్ని సృష్టించగలిగామని వారు ప్రకటించారు. మూలకణాలతో ఇది సాధ్యమేనని చాలాకాలంగా అనుకుంటున్నప్పటికీ వాస్తవంగా చేసి చూపింది మాత్రం వీరే. ప్రొఫెసర్ కార్ల్ కోహ్లెర్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల లక్ష్యం బధిరత్వానికి చికిత్స కనుక్కోవడం అయినప్పటికీ ఈ క్రమంలో మూలకణాలు చర్మం తాలూకూ కణాలను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించడంతో బట్టతల సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రత్యేకమైన మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన ఒకే ఒక్క చర్మపు మొగ్గ (ఇంగ్లీషులో బడ్ అంటారు) అటు చర్మపు పైపొరతో పాటు లోపలి పొర అయిన డెర్మిస్‌ను కూడా సృష్టించగలదని, ఫలితంగా ఎలుకల శరీరంపై జరిగినట్లే వెంట్రుకలు మొలుస్తున్నట్లు వీరు గుర్తించారు. వేర్వేరు రకాల చర్మ కణ కుదుళ్లు (ఫోలికల్స్) తయారవుతూండటం ఇంకో విశేషం. మొత్తం మీద ఈ పద్ధతి బట్టతలకు మాత్రమే కాకుండా.. సూక్ష్మరూపంలో ఉండే అవయవాలను తయారు చేసేందుకూ ఉపయోగించవచ్చునని కోహ్లెర్ వివరించారు. -
జుట్టు రాలిపోతోంది, ఏమయినా చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35. నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. ఈ మధ్య వెంట్రుకలు బాగా రాలిపోతుంటే డాక్టర్‌ను సంప్రదించాను. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. దీనికి హోమియోలో ఏమయినా చికిత్స ఉందా? - అనిల్‌కుమార్, హైదరాబాద్ జుట్టు రాలే సమస్యను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి స్త్రీలలో జుట్టు రాలడం, పురుషుల్లో జుట్టు రాలడం, పేను కొరకడం, జుట్టు మొత్తం ఊడిపోవడం. పురుషుల్లో జుట్టు రాలడం: కొందరు పురుషుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీనివల్ల ముఖం మీద, నుదురు భాగంలో ఉండే జుట్టు సరిహద్దు క్రమంగా పలచబడి వెనక్కు వెళుతుంది. వీరిలో ఏదో ఒక ప్రాంతంలో పూర్తిగా జుట్టు ఊడిపోయి, తిరిగి అభివృద్ధి చెందదు. దీన్ని బట్టతల అంటారు. ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది. స్త్రీలలో జుట్టు రాలడం: స్త్రీలలో ముఖ్యంగా తలస్నానం చేసిన తర్వాత దువ్వుకొనేటప్పుడు ఎక్కువగా చిక్కుబడిపోయి జుట్టు ఊడుతుంది. స్త్రీలలో జుట్టు రాలడానికి హార్మోన్ సమస్యలు, థైరాయిడ్, నెలసరి సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన కారణం. పేనుకొరుకుడు: దీనిని అలోపేసియా అంటారు. కొందరిలో తలలో లేక మీసం, గడ్డంలో జుట్టు వృత్తాకారంలో ఊడిపోవడం జరుగుతుంది. దీనికి మానసిక ఒత్తిడి ఒక కారణమైతే శరీర రక్షణ వ్యవస్థ జుట్టు మీదకు దాడి చేసి కుదుళ్లను దెబ్బతీయడం మరోకారణం. జుట్టు మొత్తం ఊడిపోవడం: టోటల్ అలోపెసియస్: కొద్దిమందిలో తలపై ఉండే జుట్టు మొత్తం కనుబొమలు, కనురెప్పలతో సహా ఊడిపోవడం జరుగుతుంది. దీనికి మానసిక ఒత్తిడి, ఆటో ఇమ్యూనిజం కొంతవరకు కారణం కావచ్చు. కారణాలు: పోషకాహార లోపం, గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత, అధిక ఒత్తిడి, ఐరన్ లోపం, దీర్ఘకాలిక వ్యాధులు, స్త్రీలలో బిడ్డ పుట్టిన తర్వాత మూడు నెలలకు జుట్టు రాలడం ఎక్కువ కావచ్చు. కొన్ని రకాల మందుల ప్రభావం, ఇన్ఫెక్షన్లు, పిల్లల నెత్తిపై ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లు. నిర్ధారణ: సీబీపీ, టిఎస్హెచ్, హార్మోన్ పరీక్షలు, రక్తంలో గ్లూకోజ్ శాతం, కొవ్వుశాతం నిర్థారించే పరీక్షల ద్వారా. జాగ్రత్తలు: కృత్రిమంగా తయారయే హెయిర్‌డైలు, కృత్రిమ రంగులను జుట్టుకు ఉపయోగించవద్దు. మంచి షాంపూతో వెంట్రుకలను శుభ్రం చేసుకుని, తడి లేకుండా తుడుచుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, క్యాల్షియం, ఐరన్ ప్రొటీన్లు, అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. తగినంత నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. హోమియో చికిత్స: హోమియో చికిత్స విధానంలో జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు మంచి మందులున్నాయి. ముందే కనిపెట్టి, తగిన మందులు వాడితే ఉపయోగం ఉంటుంది. పూర్తిగా బట్టతల అయిన తర్వాత ఇంక హెయిర్ట్రాన్స్ప్లాంటేషనే శరణ్యం. జన్యులోపాలు, హార్మోన్ల సమస్యలను సరిచేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. దీనికి యాసిడ్ ఫ్లోర్, ఆలోస్, నెటమొర్, యూస్పిలిగో, ఫాస్పరస్ మందులు డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 15 ఏళ్లు. గత ఏడాది క్రికెట్ ఆడుతుండగా అతడి కుడి మోకాలిలో నొప్పి వచ్చింది. తర్వాత అది తగ్గినా మోకాలిలో కొన్నిసార్లు వాపు వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాం. ఎక్స్-రే తీయించాం. కానీ అది నార్మల్ అని వచ్చింది. రెండు వారాల తర్వాత ఎమ్మారై కూడా చేయించాం. అందులో కార్టిలేజ్ ఫ్రాక్చర్ ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. అది తగ్గదనీ, ఆ తర్వాత ఆర్థరైటిస్‌కు దారి తీస్తుందని డాక్టర్ చెబుతున్నారు. రెండో మోకాలిలోనూ నొప్పి వస్తోంది. ఈ వయసులోనే ఇలా ఉంటే, భవిష్యత్తులో అతడి పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - సురేశ్‌బాబు, బాపట్ల పిల్లలు ఆడుకునే సమయంలో జరిగే దురదృష్టకరమైన సంఘటనలు ఇవి. ఎమ్మారైలో కనిపించిన రిపోర్టులను బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ అబ్బాయికి వచ్చిన సమస్యను వైద్యపరిభాషలో ‘ఆస్టియో కాండ్రైటిస్ డిసెకాన్స్’ అంటారు. కంటికి కనిపించనంత చిన్న గాయాల వల్ల కార్టిలేజ్‌కు రక్తసరఫరాలో వచ్చే లోపాలతో ఈ సమస్య వస్తుంటుంది. మరీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఒక మోకాలికి ఈ సమస్య వస్తే 20 శాతం మందిలో రెండో మోకాలికీ ఇదే సమస్య రావచ్చు. అయితే ఈ విషయంలో రోగులకు శుభవార్త ఏమిటంటే... గతంలోలా దీనికి చికిత్స లేని పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానం వల్ల తగిన చికిత్స చేసి ఈ ‘ఆస్టియోకాండ్రైటిస్ డిసెకాన్స్’ సమస్యను నయం చేయవచ్చు. ఆర్థ్రోస్కోప్ (కీ-హోల్ సర్జరీ) ప్రక్రియ ద్వారా ఎముకకు ఆగిపోయిన రక్తప్రసరణను పునరుద్ధరించవచ్చు. దాంతో ఎముకలో కార్టిలేజ్ (చిగురు ఎముక/మృదులాస్థి) మళ్లీ పెరిగి, మోకాలు ముందులాగే ఉండేలా చూడవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే... ఈ చికిత్స అయ్యేవరకూ అతడు ఆటలాడకుండా, పరుగెత్తకుండా చూడాలి. మీరు ఆందోళన చెందకుండా ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. మూడేళ్లుగా హైబీపీ ఉంది. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రొటీన్‌గా టెస్ట్ చేయించుకుంటే క్రియాటినిన్ 6 అనీ, యూరియా 120 అని రిపోర్టు వచ్చింది. నా కిడ్నీలు పనిచేయడం లేదని చెప్పారు. ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఇలా ఉండవచ్చా? - కుమారస్వామి, గూడూరు మీకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది. రెండు కిడ్నీలు పనితీరు 50 శాతం తగ్గినప్పటికీ లక్షణాలు ఏవీ కనిపించకపోవచ్చు. కొంతమందిలో కిడ్నీ పనితీరు 15 శాతానికి పడిపోయినప్పుడు కూడా ఏ ఇబ్బందులూ కనిపించకపోవచ్చు. కానీ కేవలం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే విషయం బయటపడుతుంది. అందుకే ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ రిస్క్ ఉంటుందో (బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీలో ఇన్ఫెక్షన్, ఫ్యామిలీలో కిడ్నీ వ్యాధులు) వారు ప్రతి ఏడాదీ కిడ్నీ పనితీరు ఎలా ఉందో పరీక్షలు చేయించుకొని తెలుసుకోవాలి. క్రానిక్ కిడ్నీ డిసీజ్‌ను ముందుగానే కనుగొంటే ఆ తర్వాత వచ్చే దుష్ర్పభావాలను ముందునుంచే నివారించడానికి అవకాశం ఉంటుంది. నాకు 38 ఏళ్లు. ఈ మధ్యనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకొన్నాను. నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - రాఘవరావు, మార్కాపురం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత కిడ్నీ రిజెక్ట్ కాకుండా ఇచ్చే మందులు క్రమం తప్పకుండా జీవితాంతం వాడాలి. చాలామంది పేషెంట్స్ కిడ్నీ బాగా పనిచేస్తుంది కదా అనుకొని మందులు వాడరు. ఇలా చేయడం వల్ల కిడ్నీ రిజెక్ట్ అవుతుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జలుబుగాని, జ్వరంగాని, ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఏ ఇతర మందులు వాడరాదు. అప్పటికప్పుడు ఒండిన ఆహారం తీసుకోవాలి. మంచినీరు కాచి, చల్లార్చినవి వాడాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్లను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్