
నేహ గంగమ్మ
సాక్షి, యశవంతపుర : కేశ సౌందర్యం కోసం చేసిన ట్రీట్‌మెంట్ కారణంగా వెంట్రుకలు మొత్తం ఊడిపోవడంతో అవమానంగా భావించిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడగు జిల్లా విరాజపేట తాలూకా కొట్టిగేరి గ్రామానికి చెందిన నేహా గంగమ్మ (18) బీబీఏ చదువుతోంది. తల వెంట్రుకలు రింగు రింగులుగా ఉండటానికి మైసూరులోని ఓ బ్యూటీ పార్లర్‌లో కేశ సౌందర్యానికి సంబంధించిన ట్రీట్‌మెంట్ తీసుకుంది.
అయితే కొద్ది రోజులుగా ఆమె జట్టు ఊడిపోతూనే ఉంది. ఆరు నెలలోపే తల గుండుగా మారింది. దీంతో సహచర విద్యార్థులకు సమాధానం చెప్పలేక కళాశాలకు వెళ్లడం మానేసింది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. లక్ష్మణ తీర్థ నదిలో నేహ మృతదేహం లభించింది. తల వెంట్రుకలు మొత్తం ఊడిపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment