‘హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించినా నో యూజ్‌’ | hair transplant goes wrong : pakistan actor | Sakshi
Sakshi News home page

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించినా ఫలితం లేదు: నటుడు

Feb 5 2018 12:10 PM | Updated on Mar 23 2019 8:04 PM

hair transplant goes wrong : pakistan actor - Sakshi

ప్రస్తుత కాలంలో ఆడ, మగ, చిన్నా పెద్ద ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని కోసం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత డబ్బు వెచ్చించినా.. ఫలితం లేకుండా పోతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందటానికి ఇటీవల పాకిస్థాన్‌కి చెందిన  ప్రముఖ నటుడు సయీద్‌ సాజిద్‌ హసన్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స చేయించారు. అయితే ఆ చికిత్స వికటించిదంటూ ఓ వీడియో ద్వారా తెలియజేశారు. చికిత్స మొదలు పెట్టినప్పటినుంచి తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని సయీద్‌ సాజిత్‌ ఆ వీడియాలో పేర్కొన్నారు. చికిత్స వికటించి తలపై ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని తెలిపారు. వైద్యులతో ఈ విషయం చెబితే ఇలాంటి సమస్య సాధారణమే అని చెప్పి,  తలపై వచ్చిన ఇన్‌ఫెక్షన్‌ను సెలైన్‌ వాటర్‌తో శుభ్రం చేశారని వాపోయారు.

చికిత్స వికటించి తలపై వచ్చిన గాయాలను హసన్‌ చూపిస్తూ.. ‘ఇప్పడు ఇది నా పరిస్థితి.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల చాలా బాధపడుతున్నాను. కొంతకాలంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. వృత్తిపరంగా కూడా ఇబ్బందిపడాల్సి వస్తోంది’ అని తెలిపారు. అదేవిధంగా ఇలా చికిత్స చేయించుకోవాలనుకునే వారు మంచి సర్జన్‌ దగ్గరికి వెళ్లండి అంటూ.. లేకపోతే నాలాంటి పరిస్థితి మీకు వస్తుందని సందేశమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement