హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌; వ్యక్తి మృతి | Mumbai Man Dies After Getting Hair Transplant | Sakshi
Sakshi News home page

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌; వ్యక్తి మృతి

Published Tue, Mar 12 2019 8:52 PM | Last Updated on Tue, Mar 12 2019 8:53 PM

Mumbai Man Dies After Getting Hair Transplant - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. హెయిర్‌ ప్లాంటేషన్‌ చేయించుకున్న ఓ వ్యక్తి ఎలర్జీతో మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈమేరకు అతడికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన డెర్మటాలజిస్టును విచారిస్తున్నారు.

వివరాలు.. ముంబైకి చెందిన వ్యాపార్తవేత్త(40) కొన్ని రోజుల క్రితం హెయిర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ కోసం ఓ క్లినిక్‌కు వెళ్లాడు. తనకు ఒకే సిట్టింగులో 9 వేల వెంట్రుకలు ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్న అనంతరం అతడికి ఎలర్జీ వచ్చింది. దీంతో అనఫిలాక్సిస్‌ సోకడంతో శరీరంలోని ముఖ్య అవయవాలన్నీ పాడైపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక సిట్టింగ్‌లో 3 వేల వెంట్రుకలు మాత్రమే ట్రాన్స్‌ప్లాంట్‌ చేసుకోవాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. అదే విధంగా సర్జరీ చేసే క్రమంలో గ్రహీత శరీరం సరిగా స్పందించనట్లైతే సైడ్‌ ఎఫెక్‌​‍్ట్ప వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement