మా ప్లాట్లు ఆక్రమించారు..
పోలీసులకు నయూమ్ బాధితుల ఫిర్యాదు
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని అనుచరులు తమ ప్లాట్లను ఆక్రమించి బెదిరింపులకు పాల్పడినట్లు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారి శ్రీధర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజ్‌గిరి, మౌలాలి, రాంనగర్, శంషాబాద్‌తోపాటు భువనగిరి, యాదగిరిగుట్టకు చెందిన 25 మంది ఈ సందర్భంగా మాట్లాడారు. భువనగిరిలో ఉన్న సర్వే నంబర్లు 722, 723, 724, 726, 727, 728, 731, 732లలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనర్సింహనగర్ వెంచర్‌లోని ప్లాట్లను తాము 1996లో కొనుగోలు చేశామని తెలిపారు. ఒక్కో ప్లాటు 300 గజాల చొప్పున ఉందనీ, తాము అప్పులు చేసి కొనుగోలు చేసిన ప్లాట్లను నయీమ్, అతని అనుచరులు 2006లో ఆక్రమించారని వారు ఆరోపించారు.
తమకు కనీసం సమాచారం లేకుండా ప్లాట్ల హద్దులను తొలగించి స్వాధీనం చేసుకుని కొత్తగా లే-అవుట్ చేసినట్లు తెలిపారు. ఇదేమిటని బాధితులమంతా పలుమార్లు అక్కడికి వెళ్లి ప్రశ్నించగా నయీమ్ అనుచరులు పాశం శ్రీనుతోపాటు పలువురు తమపై బెదిరిం పులకు పాల్పడినట్లు ఆరోపించారు. అరుు నా తాము వారిని ఏమీ చేయలేక పోయామన్నారు. నయీమ్ ఆక్రమణల్లో ఉన్న తమ ప్లాట్లను మళ్లీ తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది పేదలను మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బాధితులు ఆర్.శ్యాంకుమార్, బి.శ్రీసాయిరాం, బి.బాలయ్య, ఆర్.సత్యనారాయణగౌడ్, కె.రమేష్, కె.సురేష్, కె.కె.చారి, మనోహర్‌గౌడ్, పి.పాండు, కిష్టయ్య, వీవీ.రాజు, పి.పాండు, ఎ.సత్యనారాయణ, వి.దేవేంద్రమ్మ, వెంకటేష్ ఉన్నారు.