Nayim Gangster
-
నయీం కేసుతో కేసీఆర్ రంగేమిటో తేలింది
మల్లు రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసును మూసివేయ డానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అసలు రంగు ఏమిటో బయటపడిందని పీసీసీ ఉపాధ్య క్షుడు మల్లు రవి ఆరోపించారు. మంగళ వారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదనే విషయం దీంతో తేలిపోయిం దన్నారు. నయీం కేసులో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని, నయీంతో అంటకాగిన వారందరి జాతకాలు బయ టపెడ్తామని బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్కు చెందిన ముఖ్యనేతల పాత్ర బయటకు రావడంవల్లనే ఈ కేసును నీరుగారుస్తు న్నారన్నారు. రాజకీయ నాయకులకు, పోలీసు ఉన్నతాధికారులకు సంబంధాలు న్నట్టుగా ఫొటోలు,ఆధారాలు లభించినా కేసును ఎందుకు మూసేస్తున్నారో ప్రజల కు చెప్పాలని మల్లు రవి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
మా ప్లాట్లు ఆక్రమించారు..
పోలీసులకు నయూమ్ బాధితుల ఫిర్యాదు భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని అనుచరులు తమ ప్లాట్లను ఆక్రమించి బెదిరింపులకు పాల్పడినట్లు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారి శ్రీధర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజ్గిరి, మౌలాలి, రాంనగర్, శంషాబాద్‌తోపాటు భువనగిరి, యాదగిరిగుట్టకు చెందిన 25 మంది ఈ సందర్భంగా మాట్లాడారు. భువనగిరిలో ఉన్న సర్వే నంబర్లు 722, 723, 724, 726, 727, 728, 731, 732లలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనర్సింహనగర్ వెంచర్‌లోని ప్లాట్లను తాము 1996లో కొనుగోలు చేశామని తెలిపారు. ఒక్కో ప్లాటు 300 గజాల చొప్పున ఉందనీ, తాము అప్పులు చేసి కొనుగోలు చేసిన ప్లాట్లను నయీమ్, అతని అనుచరులు 2006లో ఆక్రమించారని వారు ఆరోపించారు. తమకు కనీసం సమాచారం లేకుండా ప్లాట్ల హద్దులను తొలగించి స్వాధీనం చేసుకుని కొత్తగా లే-అవుట్ చేసినట్లు తెలిపారు. ఇదేమిటని బాధితులమంతా పలుమార్లు అక్కడికి వెళ్లి ప్రశ్నించగా నయీమ్ అనుచరులు పాశం శ్రీనుతోపాటు పలువురు తమపై బెదిరిం పులకు పాల్పడినట్లు ఆరోపించారు. అరుు నా తాము వారిని ఏమీ చేయలేక పోయామన్నారు. నయీమ్ ఆక్రమణల్లో ఉన్న తమ ప్లాట్లను మళ్లీ తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది పేదలను మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బాధితులు ఆర్.శ్యాంకుమార్, బి.శ్రీసాయిరాం, బి.బాలయ్య, ఆర్.సత్యనారాయణగౌడ్, కె.రమేష్, కె.సురేష్, కె.కె.చారి, మనోహర్‌గౌడ్, పి.పాండు, కిష్టయ్య, వీవీ.రాజు, పి.పాండు, ఎ.సత్యనారాయణ, వి.దేవేంద్రమ్మ, వెంకటేష్ ఉన్నారు. -
ఇద్దరు నయీమ్ అనుచరుల అరెస్టు
జగిత్యాల అర్బన్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు ఇద్దరిని బుధవారం కరీంనగర్ పోలీసులు కోరుట్లలో అరెస్టు చేశారు. వీరిని జగిత్యాల కోర్టుకు తీసుకొచ్చి ప్రిన్సిపల్ జడ్జి మధు ఎదుట హాజరుపరిచారు. జడ్జి నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. వారిని కరీంనగర్ జైలుకు తరలించారు. మంథని మండలం సోమన్పల్లికి చెందిన పోరబోయిన రమే శ్ ఉరఫ్ రాంబాబు, కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన గోవర్ధనాచారి నయీమ్‌కు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. వీరు కోరుట్లకు చెందిన ప్రముఖ బీడీ కంపెనీ నిర్వాహకుడు రఫూఫ్‌ను బెదిరించడంతోపాటు కిడ్నాప్‌కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేశారు. రఫూఫ్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రమేశ్, గోవర్ధనాచారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, రూ.1.50 లక్షలు, 5 రౌండ్ల బుల్లెట్ గన్, ఒక విదేశీ రివాల్వర్ స్వాధీ నం చేసుకున్నట్లు వివరించారు. -
కస్టడీకి నయీమ్ కుటుంబ సభ్యులు
అదుపులోకి తీసుకున్న షాద్‌నగర్ పోలీసులు వారం రోజులపాటు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు షాద్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబసభ్యులను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులపాటు వారిని కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 8న నయీమ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన అనంతరం నయీమ్ భార్య హసీనాబేగం, అక్క సలీమాబేగం, షాద్‌నగర్ ఇంటికి చెందిన వాచ్‌మన్ మతీన్, అతని భార్య ఖలీమా బేగంలను పోలీసులు అరెస్టు చేసి రిమాం డ్కు తరలించిన విషయం తెలిసిందే. నయీమ్ నేరాలపై విచారణ జరుగుతున్నందున మరింత సమాచారం సేకరించేం దుకు అతడికి సంబంధించిన నలుగురిని విచారణకు అవకాశం కల్పించాలని మంగళవారం షాద్‌నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ఎన్. మూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఆ నలుగురిని బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జైలునుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు గంటలకు నేరుగా షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారణ నిమిత్తం వారిని సిట్ అధికారులకు అప్పగించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. కానీ, సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో స్థానిక పోలీసులే విచారణ జరిపినట్లు తెలిసింది. పోలీసు కస్టడీకి నయీమ్ గ్యాంగ్ హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఠా సభ్యులను జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీమ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయి చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఫర్హానా, అఫ్సా, సాజీదాలను నార్సింగ్ పోలీసులు ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నట్లు జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం తెలిపారు. -
నయూమ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రాజకీయ పార్టీల నాయకులు, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లలో గ్యాంగ్‌స్టర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటపెట్టాలని, ఆయనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ, ఏపీలోనే కాక మరో ఐదు రాష్ట్రాల్లో ఆయన కార్యకలాపాలు విస్తరించాయని, ఎంతోమంది అమాయక ప్రజల ఆస్తులను లాగేసుకొని రోడ్డుపాలు చేశారన్నారు. జిల్లాలో 99 శాతం మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భువనగిరికి చెందిన కౌన్సిలర్లను నయీమ్‌తో బెదిరింపజేసి అధికారపార్టీలో చేర్పించుకున్నారన్నారు. నయీమ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో లభించిన డైరీలో ఎంతోమంది రాజకీయ నాయకుల చరిత్రలు ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్ బయట పెట్టాలన్నారు. సిట్ విచారణ లో వెల్లడైన విషయాలను గోప్యంగా ఉంచి అధికార పార్టీకి చెందిన నాయకులను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నయూమ్ మొత్తం ఆస్తులను చూపెట్టకుండా రూ. 2.80 కోట్లు మాత్రమే చూపెట్టడం విడ్డూరమన్నారు. ఆ ఆస్తులను పేదలకు పంచాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
నయీమ్ ఆస్తులకు లెక్కేలేదు..
పోలీసులకు సైతం అంతుపట్టని నయీమ్ ‘ఖజానా’ రాష్ట్రంలోని ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల్లో వెంచర్లు మరో లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, కాంప్లెక్సులు ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.వేల కోట్లలో.. ఇక ఇతర రాష్ట్రాల్లో ఎన్నున్నాయో..! హైదరాబాద్: ఆస్తుల చిట్టా విప్పే కొద్దీ బయటకొస్తోంది.. ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో అధికారులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు సిట్ గుర్తించిన ఆస్తులే దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వందలాది డాక్యుమెంట్లను సిట్ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఒక్క రాష్ట్రంలోనే నయీమ్ చెరలో ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల భూమిలో వెంచర్లు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన సిట్.. రెవెన్యూ అధికారులతో కలసి ఈ స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలి స్తోంది. వీటితోపాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లోనూ లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఈ ఆస్తుల విలువను ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకా రం కేవలం రూ.14.39 కోట్లుగా లెక్కగడుతున్నారు. అయితే మార్కెట్లో వీటి విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని అంచ నా. హైదరాబాద్ పరిసరాల్లోని కొండాపూర్ ఏరియాలో నయీమ్ చెరలో ఉన్న 9 ఎకరాల స్థలమే దాదాపు రూ.200 కోట్లు ధర పలుకుతోంది. నయీమ్ ఆస్తులన్నీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం తో వాటి విలువ వేలాది కోట్లలో ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక మిగతా రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. సిటీలో షాపింగ్ కాంప్లెక్స్‌లు..? నయీమ్ ఇంటి వద్ద లభించిన పత్రాల్లో సిటీల్లోనూ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇళ్లు, ఫ్లాట్ల రూపంలో 1,67,117 గజాల భూమి ఉందని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయని గుర్తించిన సిట్ అధికారులు ఇప్పటికే అక్కడ తనిఖీలు చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఓపెన్ ప్లాట్ల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. పుప్పాలగూడ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామపంచాయతీ అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంటితోపాటు అతడి వంట మనిషి ఫర్హానా పేరిట ఉన్న అంజలీ గార్డెన్, తిరుమల గార్డెన్‌లోని ఇళ్లను కూడా పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. మిగతా ఐదు రాష్ట్రాల్లో ఆస్తులెన్నో..! రాష్ట్రంలోనే వేల కోట్ల ఆస్తులుంటే నయీమ్ దందా సాగిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఎన్ని ఆస్తులు ఉంటాయన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే సైబరాబాద్ వెస్ట్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించిన నయీమ్ వంట మనిషి ఫర్హానా, అతడి డ్రైవర్ భార్య ఆఫ్సాలు వెల్లడించిన ప్రకారం ఆ ఐదు రాష్ట్రాల్లో ఆస్తులున్నట్టుగా తెలిసింది. వీటిని గుర్తించేందుకు న్యాయస్థానం ఆ ఇద్దరినీ బుధవారం నుంచి ఆరు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వడంతో ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు తీసుకెళుతున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ భార్య హసీనా బేగం, అక్క సలీమా బేగం, షాద్‌నగర్ ఇంటికి చెందిన వాచ్‌మన్ మతీన్, అతని భార్య ఖలీమా బేగంలను వారంరోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. వీరి విచారణలో కూడా మరిన్ని ఆస్తుల వివరాలు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. కన్ను పడిందంటే వదలడు.. దైనా భూమిపై నయీమ్ కన్ను పడిందంటే అది అతడి చేతికి చిక్కాల్సిందే. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా ఉండదు. ఆ భూమి ఎవరిదైనా వశం కావల్సిందేనన్నది నయీమ్ సిద్ధాంతం. ఇలా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పట్టణాలకు దగ్గరగా ఉండే వ్యవసాయ భూములను అనుచరగణంతో కలసి కబ్జా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వ్యవసాయ భూములను ఓపెన్ ప్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ దందా సాగించాలనుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది అనుచరులను ఈ దిశగా రంగంలోకి దింపాడని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 20 ఇళ్ల ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. -
ఇద్దరు నయీమ్ అనుచరుల అరెస్టు
జగిత్యాల అర్బన్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు ఇద్దరిని బుధవారం కరీంనగర్ పోలీసులు కోరుట్లలో అరెస్టు చేశారు. వీరిని జగిత్యాల కోర్టుకు తీసుకొచ్చి ప్రిన్సిపల్ జడ్జి మధు ఎదుట హాజరుపరిచారు. జడ్జి నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. వారిని కరీంనగర్ జైలుకు తరలించారు. మంథని మండలం సోమన్పల్లికి చెందిన పోరబోయిన రమే శ్ ఉరఫ్ రాంబాబు, కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన గోవర్ధనాచారి నయీమ్‌కు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. వీరు కోరుట్లకు చెందిన ప్రముఖ బీడీ కంపెనీ నిర్వాహకుడు రఫూఫ్‌ను బెదిరించడంతోపాటు కిడ్నాప్‌కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేశారు. రఫూఫ్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రమేశ్, గోవర్ధనాచారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, రూ.1.50 లక్షలు, 5 రౌండ్ల బుల్లెట్ గన్, ఒక విదేశీ రివాల్వర్ స్వాధీ నం చేసుకున్నట్లు వివరించారు. -
నయీమ్‌కు మాజీ మంత్రి అండదండలు
-
నయీమ్‌కు మాజీ మంత్రి అండదండలు
రాజకీయ శత్రువుల అంతానికి నయీమ్‌ను వాడుకున్న మంత్రి అనుమానిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలన్నీ సీఎం దృష్టికి.. హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ టీడీపీ హయాంలోనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు రూఢీ అయింది. నయీమ్ రాసుకున్న డైరీ, దొరికిన ఫోన్లు, కాల్ డేటాను విశ్లేషించిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. టీడీపీ హయాంలో నయీమ్‌కు ప్రభుత్వ అండదండలు లభించినట్లు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై కొన్ని ఆధారాలు సేకరించాయి. టీడీపీ హయాంలో ఓ మంత్రి నయీమ్‌కు సహకరించారని.. రాజ కీయ, అజ్ఞాత శత్రువులను అంతం చేసేందుకు నయీమ్‌ను ఆయుధంగా వాడుకున్నారని విచారణ బృందం గుర్తించింది. టీడీపీకి చెందిన ఆ మాజీ మంత్రితో ఇప్పటికీ నయీమ్‌కు మంచి సంబంధాలున్నాయని, తరచుగా ఫోన్లలో మాట్లాడినట్లుగా కాల్ డేటాను సేకరించారు. ఆ మాజీ మంత్రి అనుచరులే చాలా కాలం నుంచి నయీమ్ అనుచరులుగా చెలామణిలో ఉన్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సహకారాన్ని, టీడీపీ ప్రభుత్వంలో నయీమ్‌కు ఉన్న అండదండల వివరాలన్నీ ఇంటెలిజెన్స్ వర్గాలు బుధవారం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో నయీం గుట్టు రట్టు చేసే క్రమంలో ఈ కేసులో మాజీ మంత్రిని సైతం చేరుస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. -
ముమ్మరంగా సోదాలు
నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు భారీగా నగదు, భూ పత్రాలు, ఆయుధాలు లభ్యం! హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురం, కుంట్లూర్తోపాటు నయీమ్ నివాసమున్న అల్కాపూర్ టౌన్షిప్లో మళ్లీ తనిఖీలు చేశారు. హస్తినాపురం ద్వారకానగర్‌లో నయీమ్ బంధువుల ఇంటి పై బుధవారం వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల క్రితం నయీమ్ ద్వారకానగర్‌లో బండ జైపాల్‌రెడ్డి ఇంటిని కొనుగోలు చేసి అందులో నజియాబేగంను ఉంచాడు. ఆ తర్వాత నయీమ్ అనుచరులు సుధాకర్‌చారి, నవీన్‌లు ఈ ఇంటిని సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారు. పోలీసులు ఈ ఇంటికి వెళ్లినపుడు తాళం వేసి ఉండటంతో పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. నగదు, పత్రాలు, ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదరుడి ఇంటిపై దాడులు నయీమ్ పెద్దమ్మ కొడుకు సలీం గత ఆర్నె ల్లుగా పెద్దఅంబర్‌పేట పరిధిలోని కుంట్లూరు తెలంగాణనగర్‌లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి సలీంతోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంటి నుంచి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక అల్కాపురిలోని నయీమ్ ఇంటి ని నార్సింగి పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి తనిఖీ చేశారు. ఒక బెడ్రూమ్ను తనిఖీ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.30కి రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, నార్సింగ్ సీఐ రామ్‌చందర్‌రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరోసారి నయీమ్ ఇంట్లో సోదాలు జరిపారు. డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్ బుక్‌లు లభించినట్లు తెలిసింది. నయీమ్ కేసుల వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ ఇన్చార్జి నాగిరెడ్డి బుధవారం సాయంత్రం అల్కా పురిలోని నయీమ్ ఇంటికి వచ్చి పోలీసుల నుంచి సోదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పోలీసుల ఇంటి నుంచి స్వాధీ నం చేసుకున్న నగదు, బంగారు అభరణాలు, పత్రాలను పోలీసులు గురువారం ఉప్పర్‌పల్లి కోర్టుకు అందజేసి, అనంతరం బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నారు. పోలీస్ కస్టడీలో ఫర్హానా, ఆసియాలు నార్సింగి పోలీసులు ఫర్హానా, ఆసియాలను బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజులపాటు వీరిని విచారించనున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్ళి నయీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వీరి నుంచి రాబడుతున్నట్టు సమాచారం. -
అసెంబ్లీపై నయీమ్ కన్ను!
భువనగిరి నుంచి చట్టసభలో అడుగుపెట్టే యోచన నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్లాన్ రెడీ చేసుకున్నాడా? భువనగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావించాడా? అందుకు సన్నాహాలు కూడా చేసుకున్నాడా? అవుననే అంటున్నారు పోలీసు అధికారులు! ఇటీవల దందాలు పెంచడం, దుబాయ్ వెళ్లి ‘ఎన్-కంపెనీ’ ఏర్పాటుకు పథక రచన చేయడం.. అందులో భాగమనే చెబుతున్నారు. సుదీర్ఘకాలం అనేక అంశాల్లో పరోక్షంగా రాజకీయ నాయకులకు మద్దతు ఇచ్చి, కీలక సమయాల్లో వారి సహకారం పొందాడు. కానీ ఇలా నాయకుల నుంచి సాయం కోరడం కంటే తానే అధికారానికి కేంద్రం కావాలని అతడు భావించాడు. ఈ నేపథ్యంలోనే భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశాడని చెబుతున్నారు. పట్టు పెంచుకునే యత్నాలు భువనగిరి నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో నయీమ్ మద్దతు తీసుకున్నవారెందరో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు భువనగిరి మున్సిపల్ చైర్మన్(బీజేపీ), భువనగిరి, వలిగొండ ఎంపీపీలు, భువనగిరి జెడ్పీటీసీ, మరికొందరు సర్పంచ్‌లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి చేరారు. దీని వెనుక నయీమ్ ఉన్నాడని అంటున్నారు. అయితే ఇలా అధికార పార్టీలో తన పట్టును పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో నయీమ్ సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. రానున్న ఎన్నికల్లో గెలవడంతో పాటు మద్దతుదారుల్నీ గెలిపించుకోవాలని భావించాడు. ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు భారీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో దందాలు పెంచడంతోపాటు ప్రైవేట్ సైన్యాన్ని విస్తరించుకుంటున్నాడు. హైదరాబాద్ కేంద్రంగా ఓ టీవీ ఛానల్ సైతం ఏర్పాటు చేసేందుకు సిద్ధమై.. అందుకు నల్లగొండకు చెందిన ఓ వ్యక్తికి భారీ మొత్తం ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. ఆ చానల్ లోగో కూడా సిద్ధమైనట్లు తెలిసింది. ఓటర్లకు దగ్గరయ్యేందుకు భువనగిరి, వలిగొండ, నల్లగొండలో వినాయక చవితి, ఉర్సు ఉత్సవాలను పెద్దఎత్తున జరిపేందుకు సిద్ధమవుతున్నాడు. భువనగిరి నియోజకవర్గంలోని 30 వార్డుల్లో 30 వాటర్ ప్లాంట్స్ ఏర్పాటుకు ప్రయత్నించాడు. అలాగే నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాలు సైతం చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డిపోర్టేషన్ ద్వారా ‘సేఫ్ జోన్’లోకి.. తన రాజకీయ కలకు కేసులు ప్రధాన అడ్డంకిగా మారతాయని భావించిన నయీమ్.. ‘ఎన్-కంపెనీ’ ఆలోచనకు పదును పెట్టినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. దుబాయ్ వెళ్లి, అక్కడ్నుంచి దందాలు నడపాలని భావించాడు. తర్వాత తనకు అనుకూలంగా ఉన్న పోలీసుల ద్వారా కథ నడిపించి దుబాయ్ నుంచి డిపోర్టేషన్‌పై రావాలని భావించాడని తెలుస్తోంది. ఆపై బెయిల్ పొంది రాజకీయాల్లోకి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.