నయీం కేసుతో కేసీఆర్‌ రంగేమిటో తేలింది | mallu ravi fired on cm kcr | Sakshi
Sakshi News home page

నయీం కేసుతో కేసీఆర్‌ రంగేమిటో తేలింది

Published Wed, Feb 15 2017 2:33 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

నయీం కేసుతో కేసీఆర్‌ రంగేమిటో తేలింది - Sakshi

నయీం కేసుతో కేసీఆర్‌ రంగేమిటో తేలింది

మల్లు రవి ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసును మూసివేయ డానికి సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో అసలు రంగు ఏమిటో బయటపడిందని పీసీసీ ఉపాధ్య క్షుడు మల్లు రవి ఆరోపించారు. మంగళ వారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన ఉండదనే విషయం దీంతో తేలిపోయిం దన్నారు. నయీం కేసులో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని, నయీంతో అంటకాగిన వారందరి జాతకాలు బయ టపెడ్తామని బీరాలు పలికిన కేసీఆర్‌ ఇప్పుడేం చేస్తున్నారన్నారు.

టీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్యనేతల పాత్ర బయటకు రావడంవల్లనే ఈ కేసును నీరుగారుస్తు న్నారన్నారు. రాజకీయ నాయకులకు, పోలీసు ఉన్నతాధికారులకు సంబంధాలు న్నట్టుగా ఫొటోలు,ఆధారాలు లభించినా కేసును ఎందుకు మూసేస్తున్నారో ప్రజల కు చెప్పాలని మల్లు రవి ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement