జగిత్యాల అర్బన్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు ఇద్దరిని బుధవారం కరీంనగర్ పోలీసులు కోరుట్లలో అరెస్టు చేశారు. వీరిని జగిత్యాల కోర్టుకు తీసుకొచ్చి ప్రిన్సిపల్ జడ్జి మధు ఎదుట హాజరుపరిచారు. జడ్జి నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. వారిని కరీంనగర్ జైలుకు తరలించారు. మంథని మండలం సోమన్‌పల్లికి చెందిన పోరబోయిన రమే శ్ ఉరఫ్ రాంబాబు, కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన గోవర్ధనాచారి నయీమ్‌కు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు.
వీరు కోరుట్లకు చెందిన ప్రముఖ బీడీ కంపెనీ నిర్వాహకుడు రఫూఫ్‌ను బెదిరించడంతోపాటు కిడ్నాప్‌కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేశారు. రఫూఫ్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రమేశ్, గోవర్ధనాచారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, రూ.1.50 లక్షలు, 5 రౌండ్ల బుల్లెట్ గన్, ఒక విదేశీ రివాల్వర్ స్వాధీ నం చేసుకున్నట్లు వివరించారు.