మెలానియా ట్రంప్
వాషింగ్టన్ : ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వేధింపులకు గురవతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అంటున్నారు అమెరికా ఫస్ట్ లేడి మెలానియా ట్రంప్. ఆఫ్రికా పర్యటన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెలానియా ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నేను అత్యుత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ దాన్నే సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో చర్చిస్తుంటారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు’ అన్నారు. గత వారం ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియ ఘనా, మళావి, కెన్యా , ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో, మీడాయాలో జనాలు ఆమె వస్త్రధారణ గురించే ఎక్కువగా పరహసించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ మెలానియా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియా ట్రంప్ కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్‌ను ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్‌లకు కూడా కోపం తెప్పించింది. అంతేకాక గత జూన్‌లో టెక్సాస్‌లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్‌పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే వాక్యాలు ఉండడం వివాదాస్పదం అయింది.
అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. అంతేకాక ఈజిప్ట్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా మెలానియా మైకెల్ జాక్సన్ ఆహార్యాన్ని తలపించేలా వైట్ షర్ట్, ప్యాంట్, బ్లాక్ టై ధరించి వెళ్లారు. ఈ సందర్భంగా మెలానియా ‘నా వస్త్రధారణ గురించి కాకుండా నేను చేసిన పనుల గురించి మాట్లాడితే మంచిది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment