Attire
-
బ్యూటిఫుల్ ఔట్ఫిట్ : అమలాపాల్ రాయల్ లుక్ (ఫొటోలు)
-
Samyuktha Menon: శారీలో అలా.. హారంతో ఇలా.. బింబిసార హీరోయిన్ లుక్స్ చూశారా?
-
పల్లెటూరి పొలం గట్లపై రచ్చచేస్తున్న పాపులర్ బ్యూటీ ఫోటోలు వైరల్
-
ట్రెడిషనల్ లుక్‌లో ‘రాధిక’ తిరుగే లేదిక (ఫొటోలు)
-
Anjali: అంజలి సారీ లుక్.. తనకన్నీ అలా సెట్టవుతాయంతే! (ఫోటోలు)
-
Priyamani: ట్రెడిషనల్ డ్రెస్‌లో కవ్విస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
-
మల్లెపూలతో సన్నజాజిలా గుబాలిస్తున్న సిమ్రన్ చౌదరి (ఫొటోలు)
-
కలర్‌ఫుల్ లంగావోణీలో యాంకర్ సుమ లుక్స్.. ఫోటోలు
-
కాలేజీ అమ్మాయిలా లంబసింగి హీరోయిన్ దివి.. ఫోటోలు
-
ట్రెడిషనల్ వేర్లో కిల్లింగ్ లుక్స్... ఎవరీ బ్యూటీ (ఫోటోలు)
-
గ్రాజియా యంగ్ ఫ్యాషన్ వీక్ అవార్డ్స్ 2024 : తారల తళుకు బెళుకులు (ఫోటోలు)
-
Pak: దుస్తులపై వివాదం.. మహిళపై మూక దాడికి యత్నం
ఇస్లామాబాద్: దుస్తులపై అరబిక్ భాషలో ఖురాన్‌ను కించపరిచే రాతలున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఓ యువతిని కొందరు చుట్టుముట్టారు. వెంటనే ఓ మహిళా పోలీసు ఆ యువతిని ఆ మూక నుంచి రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంపు చుట్టుముట్టినపుడు యువతి తన ముఖం కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకుంది. ఈ సమయంలో ఓ మహిళా పోలీసు వచ్చి ధైర్యంగా ఆమెను రక్షించి అక్కడి నుంచి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియెను ఆ మహిళా పోలీసును ఉద్దేశించి పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. ఆమె పేరును ప్రతిష్టాత్మక క్వాడ్ ఈ అజామ్ పోలీస్ మెడల్‌కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆ మహిళా పోలీసు మాట్లాడుతూ ‘అరబిక్‌లో ఏవో పదాలు రాసి ఉన్న దుస్తులు వేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి షాపింగ్‌కు వచ్చింది. ఆమె ధరించిన కుర్తాపై అరబిక్‌లో ఏదో రాసి ఉంది. వెంటనే ఆ మహిళ దగ్గరకు కొందరు వచ్చి కుర్తాను తీసేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆ మహిళ డిజైన్ బాగున్నందునే వాటిని కొన్నాననని సమాధానమిచ్చింది. తనకు ఖురాన్‌ను కించపరిచే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేసింది’ అని మహిళా పోలీసు తెలిపింది. అయితే మరికొందరు మాత్రం మహిళ ధరించిన దుస్తులపై ఖురాన్‌పై ఎలాంటి కించపరిచే రాతలు లేవని సోషల్ మీడియలో పోస్టులు చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో మతం పేరు మీద మాబ్ లించింగ్ పెరిగిపోయిందని, రాజకీయాల కోసమే కొందరు వీటిని ప్రోత్సహిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. This woman police officer is a star. Doing exactly what the state should do when citizens are harassed and attacked for alleged blasphemy. Pakistan’s blasphemy laws, their daily abuse, violent mobs & extremist groups with state patronage have led the country to this madness. pic.twitter.com/o96vhTsIhJ — Raza Ahmad Rumi (@Razarumi) February 25, 2024 ఇదీ చదవండి.. చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్ శిలాజం -
పంచెకట్టు, షేర్వాణీలో మెరిసిపోతున్న ఒబామా: ఫోటో వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి వేడుక సందర్భంగా దక్షిణ భారత వస్త్రాధారణలో మెరిసిపోతున్నాడు. ఆయన భార్య మిచెల్, కూతుళ్లు కూడా భారత సంప్రదాయ దుస్తుల్లో అలరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఒబామ్ కుటుంబం ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలో కింద హ్యాపీ దీపావళి అని కూడా ఉంది. వాస్తవానికి అవి మార్ఫింగ్ ఫోటోలే అయినపట్టికీ ఆ ఫోటోలు అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి ముంచెత్తించి.. కళ్తు తిప్పుకోనివ్వకుండా చేశాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని ప్రభుత్వ స్కూల్స్‌కి 2023 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించనుందట. ఈ విషయాన్ని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్‌లు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేగాదు దీపావళిని జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన సుమారు 2 లక్షల మంది న్యూయార్క్ వాసులను గుర్తించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని రాజకుమార్ ఈ సందర్భంగా అన్నారు. పైగా జూన్ మొదటి గురువారం జరుపుకునే వార్షికోత్సవాన్ని దీపావళిగా మార్చి మరీ సెలవు ప్రకటించనుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలను చూసి ఆయన భారత్ ఒబామా అని ఒకరు కిర్రాక్ ఒబామ అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. obama’s Diwali party outfit pic.twitter.com/Ny7c1Jl6le — bad bitch in booties 👢 (@lilcosmicowgirl) October 18, 2022 (చదవండి: భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు) -
గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. దాన్ని చూడగానే అది ఫలానా ప్రాంతపు సంప్రదాయం అని ఠక్కున గుర్తుపట్టేస్తాం. అది ఏ ప్రాంతానిదయినా అభినందించవలసిందే. దానిపై అక్కడి వాళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, అలవాట్లను, కట్టూబొట్టూను... వీటిని జ్ఞాపకం ఉంచుకోవడం, గౌరవించడం, అనుసరించడం... ఇది మాది ...అని చెప్పుకొని పొంగిపోవడం... ఉండవలసిన లక్షణం. తెలుగువాడు ఎలా ఉంటాడు...అన్నదానికి... అల్లూరి వేంకట నరసింహరాజు గారనే ఒక కవి ఏమంటున్నాడంటే....‘‘ పంచెకట్టు కట్టి పైమీది కండువా వేసికొనిన తెలుగువేషమగును, అటుల సుందరము, శృతిపేయమైనట్టి భాషయన్న తెలుగు భాషయగును’’ అని వర్ణించాడు. పంచెకట్టు తెలుగువాడి వస్త్రధారణ. అదికూడా...కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా దాని అంచు నిలువుగా నిలబడేటట్లుగా ఎడం పక్కకు పెట్టుకొని ..ఒక్కోసారి ఇంకా అందంగా కనబడడానికి అర్ధవృత్తాకారంలో కట్టుకొని, వెనక ప్రత్యేకించి కుచ్చిళ్ళతో గోచీపోసి కట్టుకుని ..అటువంటి అలంకరణతో నడుస్తుంటే ఆ వస్త్రధారణ అందమే వేరు... ఇంతకంటే అందమైన మరొక వస్త్రధారణ ఉంటుందా..అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక పంచెకట్టుతోపాటూ పైన ఉత్తరీయం.. కండువా. కనీసంలో కనీసం ఒక తువ్వాలు... అది లేనిదే తెలుగువాడు ఒకప్పుడు బయట అడుగుపెట్టేవాడు కాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ కుటుంబాల్లో, శుభాశుభాల్లో ఈ వేషధారణ తప్పనిసరిగా కనిపిస్తున్నది. నవతరం కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. ఈ రెంటికీ అదనంగా భాష.. తెలుగు ఎంత మధురమైన భాషంటే... దానిని చెవులతో జుర్రుకోవచ్చు.. అనేంత మధురంగా ఉంటుంది. ఈ భాష రానివాడు కూడా దానిని వింటూ మైమరిచిపోతాడు. ఇది ప్రతి తెలుగువారూ తమది అని గొప్పగా చెప్పుకొని పరవశించే సంస్కృతి. వేదం కూడా ప్రత్యేకించి ఈ రకమైన వస్త్రధారణ చాలా గొప్పది.. అంటుంది. స్వాధ్యాయచ... వేదం చదువుకోవాలన్నా, హోమం చేయాలన్నా, దానం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఆచమనం చేయాలన్నా...ఈ అయిదింటికీ పంచెకట్టే కట్టుకోవాలి. ‘‘విగచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నస్య అవస్త్రేయచ’’ అంటుంది. అంటే వెనుక గోచీ పోసి కట్టుకోకపోతే, ఉత్తరీయం వేసుకొని ఉండకపోతే వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం అంటుంది. తెరమీద రకరకాల వేషాలతో నవయవ్వనులుగా కనిపించినా.. బహిరంగంగా సభలకు వచ్చేటప్పడు ఎటువంటి భేషజాలకు పోకుండా నందరమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్.వి. రంగారావుగార్లలాంటి వారు, అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా కొన్నిరకాల సభలకు, సమావేశాలకు పంచెకట్టుతోనే వచ్చేవారు. వారలా కనిపిస్తుంటే పంచెకట్టులో వెలిగిపోతుండేవారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారు అందంగా గోచీపోసి అంచులు ఆకర్షణీయంగా కనబడేట్టుకట్టి.. అలా వేదికలమీద, జనం మధ్యన నడిచిపోతుంటే అందరి దృష్టి వారిమీదే. వీళ్ళు పై ఉత్తరీయాన్ని కూడా తలపాగా లాగా ఎంత వేగంగా తలకు చుట్టినా అది అంత అదనపు ఆకర్షణగా నిలిచేది. అంత గొప్ప కట్టుబొట్టూ ఉన్నచోట పుట్టే అదృష్టం, అంత మధురమైన తెలుగు భాషను నోరారా మాట్లాడుకొనే అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం!!! మనదైన సంస్కృతిని కొత్త తరం అందిపుచ్చుకొని మరింత వ్యాప్తిలోకి తీసుకురావాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త’’
బత్తలపల్లి: ‘‘మాటేసి ఉన్నాం... మాస్క్ లేకుండా బయటకొచ్చారో జాగ్రత్త’’ అంటూ యముడు వేషధారి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆర్డీటి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాకారులు ఆంజనేయులు, శ్రీరాములు, సుదర్శన్‌లు ప్రజలు కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేశారు. చదవండి: ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా! కరోనా: ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది? -
మగవేషధారణలో అమ్మాయి.. పక్కా ప్లాన్
సాక్షి, నారాయణపేట: మగ వేషధారణలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ బాలికను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా.. సదరు బాలిక మగ వేషధారణలో ఉంటూ కొద్ది రోజులుగా దొంగతనాలకు పాల్పడుతోంది. సోమవారం కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్ శివారులోని తొట్లూరుకు చెందిన వాసురామ్ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు నారాయణపేటకు వచ్చాడు. ఈక్రమంలో సదరు బాలిక ఆయన జేబులో నుంచి రూ.50వేలు తస్కరించింది. బాధితుడు వెంటనే తేరుకుని బాలికను గుర్తించి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అంతలోనే అక్కడికి వచ్చిన పోలీసులు మగవేశంలో ఉన్న బాలికను అదుపులోకి తీసుకున్నారు. బాలిక దగ్గర అప్పుడే కొనుగోలు చేసిన సెల్‌ఫోన్, దుస్తులపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ బాలిక గతంలో చిన్నచిన్న దొంగతనాల్లో దొరికిందని, వయస్సు రిత్యా మైనర్ కావడంతో వెంటనే సఖీ కేంద్రం నిర్వాహకులకు బాలికను అప్పగించినట్లు తెలుస్తోంది. -
చీర కట్టును ప్రపంచానికి చుట్టింది
ఆమె ఇన్స్టాగ్రామ్ హాండిల్ పేరు ‘ది ట్రావెలింగ్ శారీ’. ఆమె ప్రపంచాన్ని తాను మాత్రమే చుట్టేయాలనుకోలేదు.భారతీయతను కూడా కట్టు, బొట్టుతో చూపెట్టాలనుకుంది. చిన్నప్పటి నుంచి కొత్త ప్రాంతాలు తిరిగే హాబీ ఉన్న అజంతా మహాపాత్ర చీరకట్టుతో తిరిగే సోలో ట్రావెలర్‌గా ఎన్నో అవరోధాలు అధిగమించింది.ఎన్నో అనుభవాలుమూటగట్టుకుంది. ఆమె పరిచయం. చీర కట్టుకొని ఆమె ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ముక్కూ ముహం ఎరగని వారి నుంచి వచ్చే పలకరింపు ‘నమస్తే’, ‘హలో ఇండియా’. భారతీయ స్త్రీలు ఒంటరిగా అలా కొత్త దేశాల్లో ప్రయాణించడం తక్కువ. అందునా చీర కట్టుతో కనిపించడం తక్కువ. మన దేశంలో పక్కూరికి రైలు ప్రయాణం అంటే పంజాబీ డ్రస్సును సౌకర్యంగా భావిస్తారు చాలా మంది స్త్రీలు. ఇక దేశాలు, కొత్త పర్యాటక ప్రాంతాలు అన్నప్పుడు ప్యాంట్స్‌తో సమానమైన దుస్తులే సౌకర్యం. కాని అజంతా మహాపాత్ర పెట్టుకున్న నియమం వేరు. ‘నేను ఎక్కడికి వెళ్లినా చీర కట్టులోనే వెళ్లాలి’ అని అనుకుందామె. తద్వారా భారతదేశానికి అనధికార పర్యాటక రాయబారిగా మారింది. ఒరిస్సా అమ్మాయి అజంతా మహాపాత్ర సొంత ప్రాంతం ఒరిస్సా. తండ్రి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చిన్న ఉద్యోగిగా అస్సాంలో పని చేసేవాడు. అలా దేశ దేశాల సాంస్కృతిక ఔన్నత్యం అతని ద్వారా కొద్దో గొప్పో తెలిసి అజంతాలో కొత్త ప్రాంతాల పట్ల కుతూహలం రేగేది. ‘వరల్డ్ మేప్ చిన్నప్పుడు నాకు ఎక్కువగా నచ్చిన ఆట వస్తువు’ అనే అజంతా టీనేజ్‌లో ఉండగా చిరపుంజి, షిల్లాంగ్లకు కుటుంబంతో విహారానికి వెళ్లింది. ఇల్లు, స్కూలు మాత్రమే కాకుండా బయట ఒక పెద్ద ప్రపంచం, అందమైన ప్రపంచం ఉంటుందనిపించింది. కాని ప్రపంచం చూడటం అందరి వల్లా కాదు. స్త్రీల వల్ల కానే కాదు. అందునా భారతీయ స్త్రీలకు అసాధ్యం... ఆ రోజుల్లో ఆమెకు వినిపించిన మాటలు అవి. అంత సులువు కాదు అస్సాంలో చదువు పూర్తయ్యాక ఒరిస్సా తిరిగి వచ్చేశాక ఉద్యోగమా, తిరగడమా అనే మీమాంస వచ్చింది అజంతాకి. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తగిన ఆర్థిక స్తోమత లేకపోతే దేశం కాదు కదా పక్కూరికీ వెళ్లలేదు అని తెలుసుకుంది. అందుకని మొదట కెరీర్లో పైకి రావాలనుకుంది. లండన్ వెళ్లి చదువుకోవడానికి కావాల్సిన డబ్బు కోసం నోయిడాలో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత లండన్ వెళ్లి చదువుకుంది. అక్కడి నుంచి న్యూజెర్సీలో ఒక కార్పొరెట్ సంస్థలో పెద్ద ఉద్యోగిని అయ్యింది. ఆరు నెలలు పని చేశాక తన అకౌంట్లో తగినంత డబ్బు ఉందనగానే ఆమె చేసిన మొదటి పని బ్యాగ్‌లో నాలుగు చీరలు సర్దుకొని ప్రయాణానికి తయారు కావడమే. ఒంటరి ప్రయాణికురాలు ‘గుంపుగా ప్రయాణిస్తే వినోదం ఉంటుంది. ఒంటరిగా ప్రయాణిస్తే మన గురించి మనకు తెలుస్తుంది’ అంటుంది అజంతా మహాపాత్ర. ఆమె అత్యంత సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లింది. అత్యంత ప్రమాదకరమైన తావుల్లోనూ తిరుగాడింది. ఎక్కడకు వెళ్లినా చీరలోనే ఒక భారతీయ వనిత అనే గుర్తింపుతోనే తిరిగింది. అన్ని చోట్లా ఆమెకు సాదర ఆహ్వానం అందింది. ‘అలస్కాలో టెంపరేచర్ మైనస్‌లలో ఉంటుంది. తప్పని సరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. కాని ఆ మంచు దిబ్బల మీద చీరలో ఫొటో దిగాలని నేను ప్రయత్నిస్తుంటే సరిగ్గా రావడం లేదు. ఇంతలో ఆ దారిన వెళుతున్న వ్యక్తి ఆగి ‘ఆర్ యూ యాన్ ఇండియన్’ అని అడిగి ఆగి నాకు ఫోటోలు తీసి పెట్టాడు. అతడు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అని తర్వాత తెలిసింది’ అని తన అనుభవం చెప్పింది అజంతా. ఆమె పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌కు కూడా వెళ్లింది. ‘అత్యంత సెక్యూరిటీ ఉన్న ఆ ప్రాంతంలో భారతీయ స్త్రీలు అతి తక్కువగా వెళ్లే ఆ ప్రాంతంలో చీరతోనే నేను తిరిగాను. నన్ను వారంతా తమ మనిషిగానే ఆదరించారు’ అంటుంది అజంతా. ‘చిన్నప్పుడు నేను అబ్బాయిలాంటి బట్టల్లో తిరగడానికి ఇష్టపడే దాన్ని. మా అమ్మ ఏమో ఒకనాడు నువ్వు తప్పక చీరను ఇష్టపడతావు చూడు అనేది. ఆమె మాటలు నిజమయ్యాయి. కాని ఇదంతా చూడటానికి ఆమె లేదు’ అని మరణించిన తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది అజంతా. బెత్లెహామ్‌లో గులాబీరంగు చీరలో తాను దిగిన ఫొటోలను మురిపెంగా చూసుకుంటుంది. 68 దేశాలు చుట్టేసింది అజంతా మహాపాత్ర ఇప్పటి వరకు 68 దేశాలు తిరిగింది. సౌత్ కొరియా, ఈజిప్ట్, అరబ్ దేశాలు, చైనా, వియత్నాం, యూరోపియన్ దేశాలు ఎన్నో ఉన్నాయి. ‘అన్ని దేశాల్లోనూ మనకు భాష రానప్పుడు పనికొచ్చే భాష ఒకటి ఉంది. అదే సంజ్ఞాభాష. సైగలతో మనకు కావాల్సింది ఎదుటివాళ్లకు చెప్పగలం’ అంటుంది అజంతా. మరో విషయం ఏమిటంటే ఆమె శాకాహారి. ‘కొన్ని దేశాల్లో శాకాహారం అస్సలు దొరకదు. వియత్నాంలో బాగా ఇబ్బంది పడ్డాను. ఇక బసకు ఇబ్బంది ఉండదు. మన ఖర్చుకు సరిపడా పొదుపైన హోటల్స్ అన్ని చోట్లా ఉంటాయి’ అంటుంది అజంతా. అజంతా తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రాస్తుంది. ఆమెకు ప్రత్యేకమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఏదో ఒక కొత్త దేశంలో ఎత్తయిన పర్వత సానువుల మీద మూడురంగుల జండాను చేబూని ఒక భారతీయ వనిత నిలుచుని ఉండటం మనకు కూడా గర్వకారణమే కదూ. – సాక్షి ఫ్యామిలీ -
నేను వేధింపులకు గురయ్యాను : మెలానియా ట్రంప్
వాషింగ్టన్ : ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వేధింపులకు గురవతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అంటున్నారు అమెరికా ఫస్ట్ లేడి మెలానియా ట్రంప్. ఆఫ్రికా పర్యటన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెలానియా ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నేను అత్యుత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ దాన్నే సోషల్ మీడియాలో, ఆన్లైన్లో చర్చిస్తుంటారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు’ అన్నారు. గత వారం ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియ ఘనా, మళావి, కెన్యా , ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో, మీడాయాలో జనాలు ఆమె వస్త్రధారణ గురించే ఎక్కువగా పరహసించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ మెలానియా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియా ట్రంప్ కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్‌ను ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. అంతేకాక గత జూన్‌లో టెక్సాస్‌లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్‌పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే వాక్యాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. అంతేకాక ఈజిప్ట్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా మెలానియా మైకెల్ జాక్సన్ ఆహార్యాన్ని తలపించేలా వైట్ షర్ట్, ప్యాంట్, బ్లాక్ టై ధరించి వెళ్లారు. ఈ సందర్భంగా మెలానియా ‘నా వస్త్రధారణ గురించి కాకుండా నేను చేసిన పనుల గురించి మాట్లాడితే మంచిది’ అన్నారు. -
డెనిమిజమ్
వేడుకలో హైలైట్‌గా నిలవాలని ఎప్పుడూ ఓ కొత్త వేషధారణను ఎంచుకునేవారుంటారు. ఈ కాలానికి తగ్గట్టుగా నెటెడ్, బెనారస్, పట్టులతో ఎన్నో వేల డిజైన్లు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ కాలం ఆధునికంగా మెరవాలన్నా, సంప్రదాయంగా కళగా ఉండాలన్నా కుదరదు అని చలికి వణుకుతూ విసుక్కుంటారు. స్వెటర్ ధరిస్తే డ్రెస్ అందం పడిపోతుందని దిగులుపడుతుంటారు. చలికాలం ఈ సమస్య ఎదురుకాకుండా ‘డెనిమ్’ని కొత్తగా ధరించవచ్చు. స్టైల్‌గా వెలిగిపోవచ్చు. వేడుకలో హైలైట్‌గా నిలవాలని ఎప్పుడూ ఓ కొత్త వేషధారణను ఎంచుకునేవారుంటారు. ఈ కాలానికి తగ్గట్టుగా నెటెడ్, బెనారస్, పట్టులతో ఎన్నో వేల డిజైన్లు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ కాలం ఆధునికంగా మెరవాలన్నా, సంప్రదాయంగా కళగా ఉండాలన్నా కుదరదు అని చలికి వణుకుతూ విసుక్కుంటారు. స్వెటర్ ధరిస్తే డ్రెస్ అందం పడిపోతుందని దిగులుపడుతుంటారు. చలికాలం ఈ సమస్య ఎదురుకాకుండా ‘డెనిమ్’ని కొత్తగా ధరించవచ్చు. స్టైల్‌గా వెలిగిపోవచ్చు. డెనిమ్ ప్యాంట్స్, జాకెట్స్ వరకే పరిమితం కాలేదు. ఇంకాస్త మోడ్రన్ కోరుకునేవారు షార్ట్, లాంగ్ గౌన్స్, షర్ట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. సంప్రదాయాన్ని ఇష్టపడేవారు లెహంగాలు, చుడీదార్లు, అనార్కలీ ఫ్రాక్లను ధరించవచ్చు. డెనిమ్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఒకే రంగులోనే లైట్, డార్క్లతో చూపు తిప్పుకోనివ్వని డెనిమ్ని మరింత ఆకర్షణీయంగా రూపుకట్టవచ్చు అని నిరూపిస్తున్నారు నేటి డిజైనర్లు. డెనిమ్ ఒకటే.. వేల రూపాలు... ప్యాంటులు, స్కర్టులు, డ్రస్సులు, జాకెట్స్, షర్టులు, షార్ట్‌లు, సాక్స్, షూ, బ్యాగులు, టోపీలు.. ఇలా ఎన్నింటినో తయారు చేస్తున్నారు. డెనిమ్ క్లాత్‌తో డిజైనర్స్ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. చలికాలానికి స్టైల్‌గా, కంఫర్ట్‌గా అనిపించే డెనిమ్ ఇప్పుడు చూడచక్కగా కనుల ముందు నిలుస్తోంది. చలి నుంచి రక్షిస్తుంది. వాతావరణం వేడగా ఉన్నా పొట్టి పొట్టి డెనిమ్ దుస్తులు ధరించవచ్చు. అందుకే ప్రపంచమంతా కొన్నేళ్లుగా డెనిమ్ హల్చల్ చేస్తోంది. వరల్డ్ క్లాత్‌గా పేరుపడిపోయిన డెనిమ్‌తో విభిన్నమైన డిజైన్లు సృష్టించండి. ఇక వెచ్చగా మెరిసిపోండి. - ఎన్.ఆర్ డెనిమ్‌ను ఫ్రాన్స్ దేశంలో నిమెస్, ఆండ్రే కుటుంబం తయారుచేశారు. దీనినే సిర్గే డె నిమెస్ అనిపిలుస్తారు. ఈ పేరును ‘డెనిమ్’ అని సంక్షిప్తం చేశారు. ఇది గట్టిగా ఉండే కాటన్ వస్త్రం. దీంట్లో సాధారణంగా నీలిరంగు అద్దకం ఎక్కువ. ప్రస్తుతం అంతా వాడే జీన్స్ అనే పదం ఇటలీలోని జెనెస్ పదం నుండి వచ్చింది. మొదటి డెనిమ్ ప్యాంటులను ఇటలీలోనే తయారుచేసేవారు. డెనిమ్‌లో పొడి డెనిమ్, అంచు డెనిమ్, సాగే డెనిమ్, కలర్ డెనిమ్.. అంటూ విభిన్న రకాలు ఉన్నాయి.