మావోయిస్టుల పేరిట బెదిరింపు.. ఇద్దరిని పట్టుకున్న పోలీసులు
జవహర్‌నగర్: మావోయిస్టు శీనన్న పేరుతో ఓ ఆస్పత్రి యాజమాన్యాన్ని బెది రించిన ఇద్దరిని రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. బుధవారం కీసర మండలం దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య ఆస్పత్రి మేనేజర్ క్యాబిన్‌లోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తుపాకీతో బెదిరించి ఆస్పత్రి ఎండీ డాక్టర్ రవీంద్రకుమార్‌ని కలవాలని, మావోయిస్టు శీనన్న ఫోన్ చేశాడని చెప్పమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రి ఎండీ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం కూడా సదరు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి మేనేజర్‌ను కలిశారు.
రవీంద్రకుమార్ వెంటనే రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆస్పత్రిని పేల్చేసి ఆయనను ఛత్తీస్‌గఢ్ అపహరించుకుపోతామని బెదిరించారు. ఇక్కడే ఇస్తే రూ.50 లక్షలు అవుతుందని, డాక్టర్‌ను తాము తీసుకెళ్తే రూ.2 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్‌కుమార్ చాకచక్యంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రూ.50 లక్షలు ఇస్తారా.. ఆస్పత్రిని పేల్చేయమంటారా?
Published Fri, Sep 30 2016 12:43 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement