
వాషింగ్టన్: తమ దేశంలో ఉన్న 2.5 కోట్ల మంది మెక్సికన్లను జపాన్‌కు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ ఆదేశ ప్రధాని షింజో అబేను బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. గత వారం కెనడాలో జరిగిన జీ–7 సమావేశం సందర్భంగా ట్రంప్ ఇలాంటి పలు వ్యాఖ్యలు చేశారని భేటీలో పాల్గొన్న యూరప్ దేశాల ప్రతినిధులు వెల్లడించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ‘యూరప్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వలసలు. షింజో, మీకు ఈ సమస్య లేదు. అందుకే మీ దేశానికి నేను 2.5 కోట్ల మెక్సికన్లను పంపిస్తా. అప్పుడిక మీరు వెంటనే పదవి కోల్పోతారు’అని ట్రంప్ అనడంతో అబే సహా అక్కడున్న నేతలంతా అసహనానికి గురయ్యారు. ఇరాన్, ఉగ్రవాదం అంశంపై ట్రంప్ మాట్లాడుతూ..‘మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి ఇమ్మానుయేల్, ఎందుకంటే టెర్రరిస్టులంతా పారిస్‌లోనే ఉన్నారు’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌నుద్దేశించి అన్నారు.
అమెరికా దిగుమతులపై సుంకం పెంచిన చైనా
బీజింగ్: అమెరికా నుంచి దిగుమతయ్యే దాదాపు 50 బిలియన్ డాలర్ల వస్తువులపై చైనా శనివారం సుంకాలు పెంచింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 25 శాతం పెంచిన మరుసటి రోజునే, గట్టి సమాధానమిచ్చేలా చైనా తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యయుద్ధం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment