మీటూ.. ఓ బెదిరింపు ఆయుధం | MeToo is being used as a weapon to scare and blackmail | Sakshi
Sakshi News home page

మీటూ.. ఓ బెదిరింపు ఆయుధం

Published Tue, Nov 6 2018 2:11 AM | Last Updated on Tue, Nov 6 2018 2:11 AM

MeToo is being used as a weapon to scare and blackmail - Sakshi

రాధారవి

‘‘ప్రొఫెషనల్‌ పని మీద ఇంటికి వెళ్తే నాతో తప్పుగా ప్రవర్తించాడు’’ అంటూ తమిళ నటుడు, నటి రాధిక సోదరుడు రాధారవి మీద ఓ మహిళ అజ్ఞాతంగా ఆరోపించారు. ఈ విషయంపై రాధారవి స్పందించారు.. ‘‘రేసిజం గురించి మాట్లాడటానికి అమెరికాలో మొదలైన ‘మీటూ’ ఉద్యమం మన ఇండియాలో తప్పు దారిలో నడుస్తోంది. కొన్ని రోజులైతే ‘మీటూ’ అనేది బెదిరింపు ఆయుధంలా మారిపోతుందేమో? మీటూ అనేది కేవలం స్త్రీలకే కాదు పురుషులకు కూడా. ఇలా ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎవరు కరెక్టో మనం తెలుసుకోవాలి. మేం అజ్ఞాతంగా ఉంటాం కానీ మగవాళ్ల పేర్లు మాత్రం చెబుతాం అంటున్నారు. తప్పు జరిగితే వెంటనే బయటకు చెప్పాలి. 15 ఏళ్ల క్రితం ఇలా జరిగింది అని చెప్పడంలో పాయింటే లేదు. ఉద్యమం నిజమైతే నేను కచ్చితంగా సపోర్ట్‌ చేస్తాను. కానీ ‘మీటూ’ నమ్మేలా లేదు. అందుకే సపోర్ట్‌ చేయదలచుకోలేదు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement