రాధారవి, చిన్నయి
పెరంబూరు: దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల యూనియన్ ఎన్నికలు వివాదానికి తెరలేపాయి. ఈ యూనియన్ ఎన్నికలు బుధవారం చెన్నైలో జరిగాయి. కాగా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు రాధారవి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి పోటీ చేశారు. వీరిద్దరి మద్య చాలా కాలంగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రాధారవిపై చిన్మయి మీటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో చందా చెల్లించలేదన్న ఆరోపణలతో ఆమెను యూనియన్ నుంచి తప్పించారు.
అయితే ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు చిన్మయిని తొలగించడం చట్ట ప్రకారం విరుద్ధం అని తీర్పు నిచ్చింది. అలా చిన్మయి యూనియన్‌లో తన సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. కాగా బుధవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో రాధారవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను ఎన్నికల విదానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరష్కరించారు. దీంతో పోటీదారుడైన రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అయితే చిన్మయి నామినేషన్ తిరష్కరణ గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది. దీంతో డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు వివాదానికి దారి తీశాయి. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి తన నామినేషన్ తిరష్కరణపైనా, రాధారవి ఏకగ్రీవ ఎంపికపైనా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. దీని గురించి ఆమె గురువారం మీడియా ముందుకు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment