దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సింగర్ చిన్మయి శ్రీపాదకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. లైంగిక వేధింపుల బాధితులకు మద్దతుగా నిలిచినందుకు.. ఇండస్ట్రీ ‘పెద్ద మనుషుల’ కారణంగా ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. డబ్బింగ్ చెప్పేందుకు అవకాశం లేకుండా ఆమె గొంతుక వినిపించకుండా కొంతమంద్రి కుట్ర పన్నారు. అయితే తాజాగా సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న ఓ బేబీ సినిమా ద్వారా తమిళ డబ్బింగ్ చెప్పే అవకాశం చిన్మయికి లభించింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్న చిన్మయి..‘ సమంతకు తమిళ్‌లో డబ్బింగ్ చెప్పాను. నిజానికి నందినిరెడ్డి, సమంత వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని ఓ బేబి టీజర్‌ను జతచేశారు.
ఈ క్రమంలో ఎంతో మంది చిన్మయికి మద్దతునిస్తుండగా.. మరికొంత మాత్రం.. ‘ఫెమినిస్టులు అందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. ఈ సినిమా ప్లాపవడం ఖాయం’ అంటూ నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన పాత్రకు గొంతుతో జీవం పోసే చిన్మయికి సమంత అండగా నిలబడ్డారు. ‘ థ్యాంక్యూ... ప్రపంచం ఓ మూర్ఖున్ని కలిసింది. ఓ మూర్ఖుడు ప్రపంచంలోకి వచ్చాడు’ అంటూ సమంత ట్వీట్ చేశారు. దీంతో.. ‘కౌంటర్ అదిరింది సామ్. ఆడవాళ్లకు మరింత శక్తి రావాలి. ఓ బేబీ సినిమా కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తొలి సినిమాతో ‘ఏ మాయ చేశావే’తోనే సమంత స్టార్‌గా మారడానికి ప్రధాన కారణం.. నటనతో పాటు ఆ సినిమాలో వినిపించిన గొంతేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గమ్మత్తైన ఆ గొంతు చిన్మయిది. తొలి సినిమా నుంచి సమంతకు చిన్మయి తన గొంతు అరువు ఇస్తూనే ఉన్నారు. ఇక వారిద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.
Aaaaaaand. I DUBBED IN TAMIL for Samantha.
— Chinmayi Sripaada (@Chinmayi) June 17, 2019
Frankly it is only because of @nandureddy4u and @Samanthaprabhu2 that this was possible.
Here’s to women who make life better for other women. https://t.co/KO3dcpHobv https://t.co/0OtisVB1de
Comments
Please login to add a commentAdd a comment