ఎంతోమంది తమకు వీలైనంతలో సాయం చేసి అందర్నీ విస్మయపరిచిన ఘటనలను ఎన్నో చూశాం!. సాయం చేయాలన్న స్వచ్ఛమైన మనుసుంటే చాలు అని ఏవిధంగానైనా లేదా ఏ రూపంలోనైనా సాయం చేయవచ్చు అని నిరూపించారు చాలామంది. అచ్చం అలాంటి కోవకు చెందినవాడే ఇక్కడున్న చిన్న బాలుడు.
అసలు విషయంలోకెళ్లితే... ఒక బాలుడు దాహంతో ఉన్న కుక్కకు చేతి పంపు ద్వారా నీళ్లు అందించాడు. అయితే ఈ ఘటనకు సంబందించిన వీడియోని ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా "వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి వీలైనంతగా వారు సహాయం చేయవచ్చు" అనే క్యాప్షన్‌ని జోడించి మరి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మేరకు నెటిజన్లు ప్రపంచమంతా ఇలాగే ఉండాలని కొందరూ, మానవత్వం హృదయానికి సంబంధించినది వయసుకి సంబంధించినది కాదు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
कद कितना ही छोटा हो, हर कोई किसी की यथासंभव #Help कर सकता है.
— Dipanshu Kabra (@ipskabra) December 7, 2021
Well done kid. God Bless you.
VC- Social Media.#HelpChain #Kindness #BeingKind pic.twitter.com/yQu4k5jyh1
Comments
Please login to add a commentAdd a comment