thirsty
-
హమ్మయ్య.. దాహం తీరింది!
మండుతున్న ఎండలకు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. గ్రీష్మతాపంతో ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరడం లేదు. కోవెలకుంట్ల పట్టణంలో ఓ వానరం దాహం తీర్చుకునేందుకు పడరాని పాట్లు పడింది. గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ పూలవ్యాపారి దాహం తీర్చుకునేందుకు వాటర్ బాటిల్ తోపుడు బండిపై ఉంచుకున్నాడు. గమనించిన వానరం ఆ బాటిల్‌ను ఎత్తుకెళ్లింది. బాటిల్‌కు మూత ఉండటంతో పలుమార్లు ప్రయత్నించి.. చివరకు అతికష్టం మీద మూత తొలగించి బాటిల్లోని నీరు తాగి మెల్లగా జారుకుంది. – కోవెలకుంట్ల -
"సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!
ఎంతోమంది తమకు వీలైనంతలో సాయం చేసి అందర్నీ విస్మయపరిచిన ఘటనలను ఎన్నో చూశాం!. సాయం చేయాలన్న స్వచ్ఛమైన మనుసుంటే చాలు అని ఏవిధంగానైనా లేదా ఏ రూపంలోనైనా సాయం చేయవచ్చు అని నిరూపించారు చాలామంది. అచ్చం అలాంటి కోవకు చెందినవాడే ఇక్కడున్న చిన్న బాలుడు. అసలు విషయంలోకెళ్లితే... ఒక బాలుడు దాహంతో ఉన్న కుక్కకు చేతి పంపు ద్వారా నీళ్లు అందించాడు. అయితే ఈ ఘటనకు సంబందించిన వీడియోని ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా "వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి వీలైనంతగా వారు సహాయం చేయవచ్చు" అనే క్యాప్షన్‌ని జోడించి మరి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మేరకు నెటిజన్లు ప్రపంచమంతా ఇలాగే ఉండాలని కొందరూ, మానవత్వం హృదయానికి సంబంధించినది వయసుకి సంబంధించినది కాదు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. कद कितना ही छोटा हो, हर कोई किसी की यथासंभव #Help कर सकता है. Well done kid. God Bless you. VC- Social Media.#HelpChain #Kindness #BeingKind pic.twitter.com/yQu4k5jyh1 — Dipanshu Kabra (@ipskabra) December 7, 2021 -
పాపం మూగజీవి.. చోద్యం చూడకపోతే సాయం చేయొచ్చుగా
-
మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో
రోజు రోజుకి వేసవి తీవ్రత అధికమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనుషులతో పాటు జంతువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం ఏడు గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వేసవి తాపానికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. మన పరిస్థితే ఇలా ఉంటే ఇక నోరులేని జంతువుల సంగతి చెప్పక్కర్లేదు. అడవిలో నీరు దొరక్క.. జనవాసంలోకి వస్తున్నాయి మూగ జీవులు. ఈ క్రమంలో దాహంతో అల్లాడుతున్న ఏనుగు.. స్వయంగా చేతి పంపు కొట్టుకుని.. నీరు తాగుతున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దాహం తీర్చుకోవడం కోసం గజరాజు ఇన్ని తిప్పలు పడుతుంటే.. ఆ పక్కనే కొందరు కూర్చుని చోద్యం చూశారు.. తప్ప దానికి సాయం చేయలేదు. ఈ దృశ్యాలు చూసిన నెటిజనులు ‘‘మీకు కొంచెం కూడా మానవత్వం లేదా.. పాపం మూగ జీవి నీటి కోసం అల్లాడుతుంటే.. చోద్యం చూస్తారా’’ అని విమర్శిస్తున్నారు. ఇక ఈ వీడియోలో దాహంతో ఉన్న ఏనుగు చేతి పంపు దగ్గరకు వచ్చింది. నీరు ఎలా తాగాలో అర్థం కాలేదు. వెంటనే దానికి మనుషులు చేతి పంపును ఎలా వాడతారో గుర్తుకు వచ్చినట్లుంది. దాంతో అది కూడా తన తొండతో చేతి పంపు కొట్టి.. నీరు తాగి తన దాహం తీర్చుకుంది. అయితే ఏనుగు ఇంత కష్టపడుతుంటే.. పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులు చోద్యం చూశారు తప్ప దానికి సాయం చేయలేదు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఏనుగు సమయస్ఫూర్తిపై ప్రశంసలు.. ఆ వ్యక్తులపై విమర్శలు చేస్తున్నారు. చదవండి: ‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’ -
దాహం తీరింది..
నిర్మల్అర్బన్: ఎండలు మండుతున్నాయి. వేసవి దాహార్తికి పశు, పక్ష్యాదులు విలవిల్లాడుతున్నాయి. అందుకు ఈ చిత్రాలే నిదర్శనం. జిల్లా కేంద్రంలోని మార్కెట్లో ఓ ఆవు దాహార్తితో మసీద్ వద్ద ఉన్న నల్లా వద్దకు చేరింది. నల్లా నుంచి నీరు రాకపోవడంతో అటూ.. ఇటూ దీనంగా చూసింది. ఫోన్లో మాట్లాడుతూనే ఆవును గమనించిన మొజాన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని నల్లాను తెరిచాడు. ఒక్కసారిగా నల్లా నుంచి నీరు రావడంతో నీటిని తాగిన ఆవు తన దాహార్తిని తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
పసుపుపచ్చ దాహం
దాహానికి రంగుండదు. కాని దాహం తీర్చేవాటికి రంగు ఉంటుంది. పుచ్చ ఎర్రన... కీర పచ్చన... కొబ్బరి తెల్లన... వీటన్నింటిలో నిమ్మరసం కలిపితే... పసుపు పచ్చ నిమ్మ నుంచి కొన్ని చుక్కలను పిండి రుచి తెస్తే.... ఆ దాహం పుల్లపుల్లగా తియ్యతియ్యగా తీరుతుంది. ఎర్రటి ఎండను హాయిగా మార్చుతుంది. కీర దోస లెమనేడ్ కావలసినవి: కీర దోస – 2; పుదీనా – పావు కప్పు; నిమ్మ చెక్క తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – పావు కప్పు; వేడి నీళ్లు – నాలుగు కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: ఐస్ క్యూబ్స్ – అర కప్పు; సన్నగా తరిగిన కీర దోస చక్రాలు – 10; తాజా పుదీనా ఆకులు – కొద్దిగా తయారీ: కీర దోసను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, సన్నగా తురిమి పక్కన ఉంచాలి ♦ పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, బాణలిలో వేసి కొద్దిగా వేయించి తీసేసి, పల్చటి వస్త్రంలో వడబోసి, ఒక పాత్రలోకి రసం తీసుకుని పక్కన ఉంచాలి ♦ వేడి నీళ్లలో పంచదార, నిమ్మ రసం వేసి, స్టౌ మీద ఉంచి, పంచదార కరిగే వరకు కలిపి దింపేయాలి ♦ కీర దోస రసానికి ఈ మిశ్రమం జత చేయాలి ∙గంటసేపు ఫ్రీజర్‌లో ఉంచి తీశాక, ఒక గ్లాసులో కొద్దిగా రసం పోసి, ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులు, కీర దోస చక్రాలు జత చేసి అందించాలి. పుచ్చకాయ అల్లం లెమనేడ్ కావలసినవి: పుచ్చకాయ ముక్కలు – 4 కప్పులు; పంచదార – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; సబ్జా గింజలు – టీ స్పూను; కీర దోస చక్రాలు – అర కప్పు (గింజలు తీసేయాలి); సోడా – ఒక కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను తయారీ: కీర దోస చక్రాలను సోడాలో వేసి పక్కన ఉంచాలి. ♦ పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా అయ్యేవరకు మిక్సీ తిప్పాక, సన్నని రంధ్రాలున్న జల్లెడతో పెద్ద పాత్రలోకి వడ పోయాలి ♦ ఒక పాన్‌లో పంచదార, నీళ్లు, అల్లం తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, పంచదార కరిగి, కొద్దిగా తీగ పాకంలా అవుతుండగా దింపేయాలి ♦ ఒక కప్పులో పొడి చేసిన ఐస్, కొద్దిగా పంచదార మిశ్రమం సిరప్, కొద్దిగా నిమ్మ రసం, నాలుగు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం పోసి బాగా కలపాలి ♦ సబ్జా గింజలు జత చేయాలి ♦ సోడాలో నానబెట్టిన కీరదోస ముక్కలు సహా సోడాను జత చేసి, బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి. కమలా – దానిమ్మ లెమనేడ్ కావలసినవి: చల్లటి గ్రీన్ టీ – ముప్పావు కప్పు; తాజా కమలాపండు రసం – అర కప్పు; దానిమ్మ రసం – అర కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను; గార్నిషింగ్ కోసం – కమలా పండు చక్రం; ఐస్ – తగినంత తయారీ: ఒక గ్లాసులో చల్లటి గ్రీన్ టీ, దానిమ్మ రసం, కొద్దిగా ఐస్ వేసి కలిపి, కమలాపండు రసం ఉన్న గ్లాసులో పోయాలి నిమ్మరసం జత చేయాలి ♦ కమలాపండు చక్రంతో గ్లాసును అలంకరించి అందించాలి ♦ ఇది మంచి డిన్నర్ డ్రింక్. సోడా బదులు ఈ లెమనేడ్ వాడటం ఆరోగ్యానికి మంచిది. స్ట్రాబెర్రీ లెమనేడ్ కావలసినవి: స్ట్రాబెర్రీలు – ఒక కప్పు (శుభ్రంగా కడిగి, బాగు చేసి ముక్కలు చేయాలి); పంచదార – 2 టేబుల్ స్పూన్లు; తాజా నిమ్మ రసం – ఒక కప్పు; నీళ్లు – 5 కప్పులు తయారీ: ఒక పాత్రలో స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి, బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ♦ దింపిన తరవాత గరిటెతో మెత్తగా మెదిపి, వడపోయాలి ♦ ఒక పాత్రలో నిమ్మ రసం, నీళ్లు, స్ట్రాబెర్రీ రసం వేసి బాగా కలపాలి ♦ ఐస్ జత చేసి గ్లాసులలో అందించాలి. కొబ్బరి నీళ్ల లెమనేడ్ కావలసినవి: కొబ్బరి నీళ్లు – 4 కప్పులు; నిమ్మ రసం – 5 టేబుల్ స్పూన్లు; తేనె లేదా పంచదార – 3 టేబుల్ స్పూన్లు; నిమ్మ కాయలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); ఐస్ క్యూబ్స్ – 2 కప్పులు; పుదీనా ఆకులు – గార్నిషింగ్‌కి సరిపడా తయారి: ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, పంచదార /తేనె వేసి పంచదార కరిగేవరకు బాగా కలపాలి ♦ నిమ్మ ముక్కలు, ఐస్ క్యూబ్స్ వేసి మరోమారు బాగా కలిపి, గ్లాసులలో పోయాలి ♦ పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. ♦ నిమ్మకాయను ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి అవసరమైన సి విటమిను నిమ్మలో పుష్కలంగా ఉంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను నిమ్మకాయ బాగా తగ్గిస్తుంది. ♦ నిమ్మలో ఉండే విటమిన్ సి... ఎముకలు క్యాల్షియంను స్వీకరించేలా చేస్తుంది. అందువల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కారక కణాలను నిరోధిస్తాయి. ♦ కొద్దిగా నిమ్మరసాన్ని గ్రీన్ టీ కి జత చేసి తాగితే, టీలోని 80 శాతం యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ♦ తరచుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ♦ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే శక్తి నిమ్మరసంలో పుష్కలంగా ఉంది. ♦ మానసిక ఒత్తిడి తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం నిమ్మలో మెండుగా ఉంది. ♦ కాలేయంలో పేరుకుపోయే విషపదార్థాలను తొలగించి, కాలేయం చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ♦ వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడనీయదు. ♦ పంటి నొప్పిని తగ్గిస్తుంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. - సుజాత స్టీఫెన్ ,న్యూట్రిషనిస్ట్ -
వావ్.. నెటిజన్ల ప్రేమను దోచేశారు
-
దప్పికతోనే మహిళ పోలీసుల విధులు!
న్యూఢిల్లీ: మహిళా సాధికారిత సాధనలో భాగంగా పోలీసుశాఖలోనూ పెద్ద ఎత్తున మహిళలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో కనీస మౌలిక సౌకర్యాలు లేక మహిళా పోలీసులు అనుభవిస్తున్న కష్టాలను తాజాగా ఓ సర్వే వెలుగులోకి తెచ్చింది. విధులు నిర్వహించే ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఒకటికి వెళ్లకుండా ఉండేందుకు కనీసం నీళ్లు కూడా తాగకుండా మహిళా పోలీసులు కర్తవ్యపాలన చేస్తున్నారు. దీనికితోడు పురుషుల శరీర దారుఢ్య కొలతలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రక్షణ జాకెట్లు రూపొందిస్తుండటంతో అవి తాము ధరించినప్పుడు చాలా బిగుతూగా ఉండి.. ఊపిరి కూడా అందడం లేదని, చాలాబరువుగా కూడా ఉంటున్నాయని మహిళా పోలీసులు ఈ సర్వేలో వెల్లడించారు. గత ఏడాది జరిగిన పోలీసుశాఖలోని మహిళల 7వ జాతీయ సదస్సు సందర్బంగా ఈ సర్వే వివరాలు, సిఫారసులను అందజేశారు. పోలీసు రీసెర్చ్, అభివృద్ధి బ్యూరో, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే వివరాలు తాజాగా వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాల గురించి చర్చించి.. వాటి పరిష్కారం కోసం సలహాలతో కూడిన ఈ సర్వే వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర బలగాల్లో 33శాతం పోస్టులను, సరిహద్దు భద్రతా దళాల్లో 15 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీసుశాఖలోని మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.