భావోద్వేగాన్ని కలిగించే మంచి పుస్తకాలు చదివితే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. పట్టుమని ఏడాది కూడా లేని ఈ బుడతడికి పుస్తకం చదివి వినిపిస్తే తదేక దృష్టితో వింటాడు. ఆనందంగా నవ్వుతాడు. కథ ముగిసిందంటూ పుస్తకం మూసేస్తే బేర్‌మంటూ ఏడుస్తాడు. అప్పటికీ పట్టించుకోకపోతే తల నేలకు కొట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తాడు. అదే పుస్తకాన్ని తీసి మళ్లీ చదవడం మొదలుపెడితే హఠాత్తుగా ఏడుపు ఆపేసి.. మళ్లీ తదేక దృష్టితో కథను వింటాడు.
అమెరికాలో ఉంటారని అనుకుంటున్న ఆ తల్లి ఎప్పుడూ 'ఐ యామ్ ఏ బన్నీ' అనే పిల్లల పుస్తకాన్ని కొడుకు ముందు చదివేది. 'ది ఎండ్' అంటూ పుస్తకాన్ని మూయగానే కొడుకు ఏడ్చేవాడు. మళ్లీ పుస్తకాన్ని తీసి 'లెట్స్ రీడిట్ ఎగైన్' అనగానే బాలుడు ఊరుకుంటాడు. ఆ తల్లి పేరు, కొడుకు పేరు తెలియదు. కొడుకు వింత ప్రవర్తనను వీడియో తీసిన ఆ తల్లి దాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడది ఇంటర్నెట్‌లో ఎంతో హల్‌చల్ చేస్తోంది.
ఈ బుడతడు పుస్తకాల పురుగు
Published Wed, Sep 2 2015 3:35 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement
Advertisement