‘జీవితాంతం చదువుతూనే ముసలోడినైపోతా’.. పిల్లాడి మాటలకు ఫిదా అవ్వాల్సిందే! | A Little Boy Crying And Refusing To Study Is Going Viral | Sakshi
Sakshi News home page

జీవితాంతం చదువుకుంటూ వృద్ధుడిగా మారిపోతా.. పిల్లాడి మాటలకు నెటిజన్లు ఫిదా

Published Fri, Sep 30 2022 8:20 PM | Last Updated on Fri, Sep 30 2022 8:20 PM

A Little Boy Crying And Refusing To Study Is Going Viral - Sakshi

స్కూల్‌కి వెళ్లమన్నప్పుడు, హోంవర్క్‌ చేయమంటే పిల్లలు మారం చేస్తుంటారు. ఆ సమయంలో వారు ఏడుస్తూ చెప్పే బుజ్జి బుజ్జి మాటలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఓ పిల్లాడు చదువుకోనని ఏడుస్తూ చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందీ అక్షరాలు చదవాలని తల్లి కొరగా.. ఆ పిల్లాడు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ‘జీవితాంతం చదువుకుంటూనే వృద్ధుడిగా మారిపోతా..’అంటూ తల్లితో చెబుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. 

ఈ వీడియోను గుల్జార్‌ సాహాబ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అందులో కళ్ల నిండ నీళ్లతో పిల్లాడు పెన్సిల్‌, నోట్‌ బుక్‌ పట్టుకుని కూర్చున్నాడు. జీవితాంతం చుదువుకుంటూ ఉంటూనే ముసలోడినైపోతా అని తన తల్లితో చెబుతున్నాడు చిన్నోడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 5 లక్షల మంది వీక్షించారు. 23,200 లైకులు వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘పిల్లాడు చెప్పేది తప్పేమి కాదు.. చదువుల వల్లే మనం వృద్ధులుగా మారిపోతున్నాం.’ అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: యాక్సిడెంట్‌ అయినా డెలివరీ ఆగలేదు! అతని సమాధానం ఏంటంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement