
సంప్రదాయ దుస్తుల్లో బామ్మలు వీధుల్లో స్కేట్‌బోర్డింగ్ చేస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదు. బామ్మలు నిజమే. స్కేట్‌బోర్డింగ్ మాత్రం ఏఐ సృష్టి!
ఆశిష్ జోస్ అనే ఆర్టిస్ట్ ప్రాంప్ట్–బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ‘మిడ్‌జర్నీ’ని ఉపయోగించి ఈ చిత్రాలను సృష్టించాడు.
‘స్కేటింగ్ నానీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మూడు రోజుల వ్యవధిలోనే 1.17 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘సాహసానికి వయసు అడ్డు కాదు’లాంటి ఎన్నో కామెంట్స్ కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment