![Krishna: Grand Wel Come For Power Lift Gold Medalist Shaik Sadiya Almas - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/23/shadiya.jpg.webp?itok=HyMETlVf)
సాక్షి, విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్‌కి ఘన స్వాగతం లభించింది. షార్జాలో ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్‌లో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించి స్వదేశానికి వచ్చిన సదియాకి ఆమె తల్లిదండ్రులు, కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు వెల్‌కమ్ చెప్పారు. కాగా సాదియా కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
గోల్డ్ మెడలిస్ట్ సాదియా
‘‘షార్జాలో ఈనెల 16 నుండి 22 వరకు ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్‌లో పాల్గొన్నా. నాలుగు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, కేఎల్ యూనివర్సిటీ సహకారంతో స్వర్ణ పతకం సాధించాను’’ అని సాదియా సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment