బెంగళూరు: ఎవరైనా కరోనాతో చనిపోతే వారిని కడసారి చూడటానికి కుటుంబ సభ్యులకు, బంధువులకు సైతం వీలులేకుండా పోతుంది. కొన్ని చోట్ల అయితే మృతదేహాన్ని తమ గ్రామంలో ఖననం చేయడానికి వీల్లేదనే సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు కూడా ముందుకు రాని పరిస్థితి చాలాచోట్ల నెలకొంది. దీంతో మున్సిపాలిటీ వాళ్లో, ఆస్పత్రి సిబ్బందో అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సోకి మరణించిన వారి సంఖ్య పెరిగిపోతుండటంతో చనిపోయిన వారిని ఖననం చేసే పనిలో కొన్ని ఎన్‌జీవోలు కూడా పాల్గొంటున్నాయి. అలా పనిచేస్తున్న మెర్సీ మిషన్‌తో ప్రఖ్యాత పవర్ లిఫ్టర్ మొహమ్మద్ అజ్మతుల్లా భాగస్వామ్యులయ్యారు. అయిన కోవిడ్ 19తో మరణించిన మృతదేహాలను మోసుకువెళ్లి అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కరోనా వైరస్ కారణంగా మరణించిన వ్యక్తి మృతదేహాన్ని మోస్తున్నప్పుడు నేను అనుభవించిన బాధను మాటలతో చెప్పలేను’ అని పేర్కొన్నారు. చదవండి: కరోనా బూచి చూపి ఇతర రోగులపై నిర్లక్ష్యం
ఐటీ సంస్థ డిఎక్స్ సి టెక్నాలజీలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేస్తున్న అజ్మతుల్లా వారాంతాలలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లాక్‌డౌన్‌లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన జూలై నెలలో కరోనా మరణాలు ఎక్కువ కావడంతో ఖననంలో కూడా పాలుపంచుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ ‘మరణం ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది. కరోనాతో మరణించిన వారిని చూసి అందరూ భయపడుతున్నారు. వారి దగ్గరకు కూడా రావడం లేదు. కరోనా వచ్చి 20ఏళ్ల వయసులోనే మరణించిన వారిని నేను చూశాను. అదేవిధంగా 80 ఏళ్ల వయసులో కూడా కరోనాను జయించిన వారిని కూడా చూశా. కరోనా మనకు కూడా ఎప్పుడొ ఒకసారి రావచ్చు. నాకు దాని గురించి భయం లేదు. కానీ నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని మృతదేహాలను ఖననం చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా కుటుంబం ఉంది’ కదా అని అజ్మతుల్లా పేర్కొన్నారు.
చదవండి: కరోనా భయం.. కొరవడిన మానవత్వం
Comments
Please login to add a commentAdd a comment