
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజీ పురుషుల పవర్‌లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో సయ్యద్ రబ్బార ఖాద్రి, కె. సాగర్ స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో 120 ప్లస్ వెయిట్ కేటగిరీలో సయేద్ విజేతగా నిలవగా... 120 కేజీల వెయిట్ విభాగంలో సాగర్ చాంపియన్‌గా నిలిచాడు. సయేద్ 730 కేజీల బరువునెత్తి తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు. బి. శశాంత్ గౌడ (ఏవీ కాలేజీ) 405 కేజీలు లిఫ్ట్ చేసి రజతాన్ని గెలుచుకున్నాడు. 120 కేజీల విభాగంలో సాగర్ 520 కేజీలు, డి. నిఖిల్ రెడ్డి 430 కేజీల బరువునెత్తి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 105 కేజీల విభాగంలో కె. శ్రీకాంత్ (ఎస్‌ఆర్‌ఎం కాలేజీ; 595 కేజీలు), మహబూబ్ బాషా (కేశవ కాలేజీ; 465 కేజీలు), జునైద్ యూసుఫ్ (విద్యారణ్య కాలేజీ; 435 కేజీలు) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఫైనల్ పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్’ అధికారి శోభ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment