సాక్షి, జగిత్యాల: అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణ అమ్మాయి రంగు విరించి స్వప్నిక స్వర్ణంతో మెరిసింది. షార్జాలో జరిగిన ఏషియన్ యూనివర్సిటీ కప్ టోర్నీలో స్వప్నిక ఈ ఘనత సాధించింది.
జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి చెందిన స్వప్నిక.. జూన్ నెలలో రాంచీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి ఏషియన్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైంది.
ఈ పోటీల్లో ఇండియా తరపున మొత్తం ఐదుగురు పాల్గొనగా.. స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ అనే మూడు విభాగాల్లో స్వప్నిక సత్తా చాటింది. మూడు విభాగాల్లో వేర్వేరుగా గోల్డ్ మెడల్స్ సాధించడంతో పాటు క్లాసిక్ పవర్ లిఫ్టింగ్‌లోనూ (మూడు కలిపి) గోల్డ్ మెడల్ సాధించింది. స్వప్నిక ఈ ఫీట్ సాధించడంపై ఆమె తండ్రి రంగు వెంకటరమణతో పాటక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై స్వప్నిక స్వర్ణం సాధించడంతో ధర్మపురి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వప్నిక స్ధానిన ఎస్సారార్ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతుంది.
Comments
Please login to add a commentAdd a comment