కానిస్టేబుల్ రాతపరీక్షకు 8,619 మంది
-
ఎస్పీ జోయల్‌డేవిస్
కరీంనగర్ క్రై : కానిస్టేబుల్ రాత పరీక్షకు జిల్లాలో 8,619 మంది అర్హత సాధించారని ఎస్పీ జోయల్‌డేవిస్ తెలిపారు. గత నెల 15వ తేదీ నుంచి జిల్లాలోని డీపీటీసీలో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సుమారు 22,054 మంది హాజరయ్యారన్నారు. వీరిలో 18,902 పురుషులు, 3,134 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో 6,787 మంది పురుషులు, 1,832 మంది మహిళలు రాతపరీక్షకు అర్హత సాధించారని ఎస్పీ వివరించారు.
మొక్కలను పరిరక్షించాలి...
నగరంలోని రాంచంద్రపూర్ కాలనీలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఆవరణలో ఎస్పీ శనివారం మెుక్కలు నాటారు. ప్రతీ పౌరుడు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. పోలీస్‌శాఖ తరఫున జిల్లాలో 16 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మరో మూడు నెలలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
డీపీటీసీ జయశంకర్ జయంతి వేడుకలు
జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రొఫెసర్ చిత్రపటానికి ఎస్పీ జోయల్‌డేవిస్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రభాకర్, రామారావు, రవీందర్‌రెడ్డి, సీఐ సీతారెడ్డి, ఆడ్మిన్ ఆర్‌ఐ గంగాధర్, శశిధర్ పాల్గొన్నారు.