SP Joyal Devis
-
సీఎం కేసీఆర్ స్వగ్రామంలో పటిష్ట బందోబస్తు
సాక్షి, సిద్దిపేట: త్వరలో సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకకు రానున్న నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ గ్రామాన్ని సందర్శించారు. గురువారం ఆయన గ్రామంలో తిరుగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన శాశ్వత హెలీప్యాడ్, సమావేశ స్థలం, కేసీఆర్ గ్రామస్తులతో సహఫంక్తి భోజనం చేసే స్థలం, పార్కింగ్, బీసీ గురుకుల పాఠశాల, సీఎం ప్రయాణించే దారులు అన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా జోయల్ డేవిస్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున భారీకేడ్లను ఏర్పాటు చేసి పటిష్టమైన బందోబస్తు కల్పించేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) నర్సింహారెడ్డి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఏసీపీ రామేశ్వర్, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ కోటేశ్వర్రావు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
కమిషనరేట్ కోసం కసరత్తు షురూ
గోదావరిఖనిలో భవనాలను పరిశీలించిన ఎస్పీ జోయల్‌డేవిస్ గోదావరిఖని : రామగుండంలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు కసరత్తు మొ దలైంది. కమిషనరేట్ కార్యాలయం కోసం భవనాలను ఎస్పీ జోయల్ డేవిస్ గురువారం పరిశీలించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోనే కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఐజీ లేక డీఐజీ స్థాయి అధికారి పాలన ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎస్పీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోకి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను రెండు జోన్లుగా ఏర్పాటు చేసి పెద్దపల్లిలో ఒక డీసీపీ, ఒక ఏసీపీ, రామగుండంలో ఒక ఏసీపీ, మంచిర్యాలలో ఒక డీసీపీ, ఒక ఏసీపీ విధులు నిర్వహిస్తారని వివరించారు. ఈ నెల 11లోగా తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని, ఆ లోపే కార్యాలయాలను సిద్ధం చేయనున్నా మని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో అదనంగా ఉండే స్పెషల్ బ్రాంచ్, సిటీ క్రైమ్ బ్యూరో రికార్డు, ఐటీ టీమ్స్, ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్ల ఏర్పాటుకు భవనాలను చూస్తున్నామని చెప్పారు. ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్, టూటౌన్ సీఐ దేవారెడ్డి, రామగుండం సీఐ వాసుదేవరావు భవనాల పనులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను చేసేందుకు ఇద్దరు డీసీపీలు, పరిపాలన వ్యవహారాలు చూసేందుకు ఒక డీసీపీ, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రామగుండంలో లేదా, మంచిర్యాలలో ఏసీపీలు ఉంటారని చెప్పారు. క్రైమ్ కోసం ఏసీపీ, ప్రత్యేకమైన లీగల్ సెల్, సైబర్ క్రైమ్, టాస్క్‌పోర్స్, కమ్యూనికేషన్స్‌కు కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లాల్లో అన్ని మండలాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాతనే పోలీస్స్టేషన్ల సంఖ్యను పెంచే ఆలోచన చేస్తామని ఎస్పీ తెలిపారు. -
క్రమశిక్షణతో మెదిలితేనే ‘ముందడుగు’
యువత సన్మార్గంలో పయనిస్తే మంచి భవిష్యత్తు ఎస్పీ జోయల్ డేవిస్ పెద్దపల్లిరూరల్ : విద్యావంతులైన యువకులు, విద్యార్థులు సన్మార్గంలో పయనిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ జోయల్‌డేవిస్ అన్నారు. మండలంలోని బందంపల్లిలో శనివారం వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులతో సమావేశమై బంగారు భవిష్యత్తుకోసం అనుసరించాల్సిన మార్గాలను వివరించేందుకు ‘ముందడుగు’ పేరిట సమావేశాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. ఉన్నతవిద్యను చదివే సమయమే కీలకమైందన్నారు. ఆ సమయంలో యువత సక్రమమైన మార్గాలలో క్రమశిక్షణతో చదివితే భవిష్యత్ అంతా బంగారుమయమేనని పేర్కొన్నారు. వక్రమార్గంలో పయనించి జీవితాన్ని నాశనం చేసుకుని తల్లిదండ్రులకు శోకం మిగుల్చొద్దన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ పేరిట తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకోసం శ్రమిస్తే సత్ఫలితాలే వస్తాయన్నారు. పోలీసులు ఇచ్చిన సందేశాత్మక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఎస్పీ మల్లా రెడ్డి, కళాశాలల కరస్పాండెంట్లు రేపాల రమేశ్, అల్లెంకి శ్రీనివాస్, తొడుపునూరి శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీనివాస్, విజయేందర్ పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ రాతపరీక్షకు 8,619 మంది
ఎస్పీ జోయల్‌డేవిస్ కరీంనగర్ క్రై : కానిస్టేబుల్ రాత పరీక్షకు జిల్లాలో 8,619 మంది అర్హత సాధించారని ఎస్పీ జోయల్‌డేవిస్ తెలిపారు. గత నెల 15వ తేదీ నుంచి జిల్లాలోని డీపీటీసీలో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సుమారు 22,054 మంది హాజరయ్యారన్నారు. వీరిలో 18,902 పురుషులు, 3,134 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో 6,787 మంది పురుషులు, 1,832 మంది మహిళలు రాతపరీక్షకు అర్హత సాధించారని ఎస్పీ వివరించారు. మొక్కలను పరిరక్షించాలి... నగరంలోని రాంచంద్రపూర్ కాలనీలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఆవరణలో ఎస్పీ శనివారం మెుక్కలు నాటారు. ప్రతీ పౌరుడు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. పోలీస్‌శాఖ తరఫున జిల్లాలో 16 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మరో మూడు నెలలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. డీపీటీసీ జయశంకర్ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రొఫెసర్ చిత్రపటానికి ఎస్పీ జోయల్‌డేవిస్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రభాకర్, రామారావు, రవీందర్‌రెడ్డి, సీఐ సీతారెడ్డి, ఆడ్మిన్ ఆర్ఐ గంగాధర్, శశిధర్ పాల్గొన్నారు. -
లైంగిక వేధింపులు: ఏఎస్సై సస్పెన్షన్
కరీంనగర్ క్రైం: బెజ్జంకి ఏఎస్సై వహిద్ పాషాపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ బెజ్జంకి పీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళ హోంగార్డ్ ఫిర్యాదుచేసింది. ఈమేరకు విచారించిన ఎస్పీ వాహిద్ పాషాను సస్పెండ్‌చేశారు. బెజ్జంకి పీఎస్‌లో ఏఎస్సై పని చేస్తూనే కిందిస్థాయి సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మహిళా హోంగార్డ్ను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో సదరు మహిళా హోంగార్డ్ మూడురోజుల క్రితం సీఐకి, ఎస్పీకి ఫిర్యాదుచేసింది. దీనిపై విచారించిన ఎస్పీ ఏఎస్సైపై వేటు వేశారు. వహిద్ పాషా కొద్దినెలల క్రితం కొడిమ్యాల పీఎస్‌లో పనిచేస్తూ అక్కడా వివాదాస్పదంగా వ్యహరించాడు. పోలీస్‌స్టేషన్‌లోనే మద్యం సేవించి సిబ్బంది, ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో గతంలో ఒకసారి సస్పెండయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత మొదటి పోస్టింగ్ బెజ్జంకి పీఎస్‌కు బదిలీ చేశారు. ఇక్కడా మరోసారి అదే తీరుగా వ్యవహరించడంతో సస్పెండ్ అయ్యాడు. -
‘ఖని’ కేంద్రంగా గుట్కా దందా!
* నెలకు రూ.3 కోట్లకు పైగా అమ్మకాలు * ‘మామూలు’గా తీసుకుంటున్న పోలీసులు * సిద్దిపేటలో నిల్వ కేంద్రం * నేతలే పెట్టుబడిదారులు కరీంనగర్ క్రైం : జిల్లాలో గోదావరిఖని కేంద్రంగా గుట్కా దందా జోరుగా సాగుతోంది. పట్టించుకోవాల్సిన పోలీసులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్లో గుట్కాదందాకు స్థానిక పోలీసులు బ్రేక్ వేసినా.. ‘ఖని’లో మాత్రం అక్కడి పోలీసులు గుట్కా వ్యాపారులకే వంతపాడుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ‘ఖని’కి .. గతంలో జిల్లాకేంద్రంలో గుట్కా దందా జోరుగా కొనసాగేది. వివిధ ప్రాంతాలకు ఇక్కడినుంచే రవాణా చేసేవారు. ఎస్పీ జోయల్‌డేవిస్ గుట్కా రవాణాపై ఉక్కుపాదం మోపడంతో కిందిస్థాయి సిబ్బందిలో చలనం వచ్చింది. జిల్లాకేంద్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్ సీఐలు ఎప్పటికప్పుడు దాడులు చేసి పెద్దఎత్తున గుట్కాలను పట్టుకుని అమ్మకాలు, రవాణాకు బ్రేక్ వేశారు. దీంతో 95 శాతం అమ్మకాలు నిలిచిపోయాయి. ఇక్కడి గుట్కా వ్యాపారులు ఇతర వ్యాపకాలకు మళ్లారు. అదే సమయంలో గోదావరిఖనిలో గుట్కా అమ్మకాలు, వ్యాపా రం జోరుగా సాగుతుండడం చర్చనీయూంశమైంది. నెలకు రూ.కోట్లలో దందా గోదావరిఖని ప్రాంతంలో ప్రతినెలా గుట్కాల దందా రూ.మూడు నుంచి రూ.నాలుగు కోట్ల వరకు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడినుంచే పొరుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, పెద్దపల్లి, మహారాష్ట్ర సరిహద్దు, ధర్మపురి వరకూ దందాను విస్తరించారని తెలిసింది. మహారాష్ట్ర, మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి గుట్కా లోడ్‌తో పదుల సంఖ్యలో లారీలు గోదావరిఖ నికి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వ్యాపారులు సిద్దిపేటకు చెందిన కొందరు బడా నేతలతో సత్సంబంధాలు పెట్టుకుని ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలొస్తున్నారుు. కంపెనీల నుంచి తెప్పించి సిద్దిపేటలో నిల్వ చేసి అనంతరం ఖనికి తరలిస్తున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ గుట్కా దందాపై గోదావరిఖని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఫిర్యాదు చేసినా పట్టుకోవాల్సిన పోలీసులే.. వ్యాపారులను అప్రమత్తం చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ‘లక్షల్లో మామూళ్లు ఇస్తున్నాం.. ఫలానా నాయకుడి అనుచరులు ఈ దందాల్లో భాగస్వాములు..’ అంటూ కొందరు గుట్కా వ్యాపారులు బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారంటే వారి వ్యాపారం ఎలా ఎదుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాకేంద్రంలో ఆర్నెల్ల కాలంలో సుమారు రూ.కోటిన్నర విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అదే గోదావరిఖనిలో ఒక్కకేసూ నమోదు కాలేదు. ఎల్ఎండీ పోలీసులు కూడా రెండు నెలల క్రితం గోదావరిఖనికి రవాణా అవుతున్న రూ.50 లక్షల విలువైన గుట్కాను పట్టుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గుట్కా దందాను నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. భారీగా గుట్కాల పట్టివేత * ఒకరిపై కేసు నమోదు కరీంనగర్ క్రైం : జిల్లాకేంద్రం శివారులో నిల్వ చేసిన గుట్కాప్యాకెట్లను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గంజ్ ప్రాంతానికి చెందిన మాడిశెట్టి శ్రీనివాస్ కరీంనగర్ మండలంలోని రజిచమన్కాలనీలో ఓ రెండు గదులను అద్దెకు తీసుకుని వాటిలో భారీగా గుట్కా ప్యాకెట్లు నిల్వచేశాడు. విశ్వసనీయ సమాచారంతో కరీంనగర్ రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో దాడి చేశారు. షట్టర్లు ఓపెన్ చేసి చూడగా.. గుట్కాలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.రెండున్నర లక్షలకుపైగా ఉంటుందని గుర్తించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.