సీఎం కేసీఆర్‌ స్వగ్రామంలో పటిష్ట బందోబస్తు | Siddipet CP Joyal Devis Visits The CM KCR's Native Chintamadaka | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ స్వగ్రామంలో పటిష్ట బందోబస్తు

Published Fri, Jul 19 2019 12:45 PM | Last Updated on Fri, Jul 19 2019 12:47 PM

Siddipet CP Joyal Devis Visits The CM KCR's Native Chintamadaka - Sakshi

సీపీ జోయల్‌ డేవిస్‌

సాక్షి, సిద్దిపేట: త్వరలో సీఎం కేసీఆర్‌ స్వగ్రామమైన చింతమడకకు రానున్న నేపథ్యంలో సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ గ్రామాన్ని సందర్శించారు. గురువారం ఆయన గ్రామంలో తిరుగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన శాశ్వత హెలీప్యాడ్, సమావేశ స్థలం, కేసీఆర్‌ గ్రామస్తులతో సహఫంక్తి భోజనం చేసే స్థలం, పార్కింగ్, బీసీ గురుకుల పాఠశాల, సీఎం ప్రయాణించే దారులు అన్నింటినీ పరిశీలించారు.

ఈ సందర్భంగా  జోయల్‌ డేవిస్‌ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున భారీకేడ్లను ఏర్పాటు చేసి పటిష్టమైన బందోబస్తు కల్పించేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ (లా అండ్‌ ఆర్డర్‌) నర్సింహారెడ్డి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఏసీపీ రామేశ్వర్, ట్రాఫిక్‌ ఏసీపీ బాలాజీ, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్న సీపీ జోయల్‌ డేవిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement