బెజ్జంకి పీఎస్‌లో ఏఎస్సై పని చేస్తూనే కిందిస్థాయి సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మహిళా హోంగార్డ్‌ను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో సదరు మహిళా హోంగార్డ్ మూడురోజుల క్రితం సీఐకి, ఎస్పీకి ఫిర్యాదుచేసింది. దీనిపై విచారించిన ఎస్పీ ఏఎస్సైపై వేటు వేశారు. వహిద్ పాషా కొద్దినెలల క్రితం కొడిమ్యాల పీఎస్‌లో పనిచేస్తూ అక్కడా వివాదాస్పదంగా వ్యహరించాడు. పోలీస్‌స్టేషన్‌లోనే మద్యం సేవించి సిబ్బంది, ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో గతంలో ఒకసారి సస్పెండయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత మొదటి పోస్టింగ్ బెజ్జంకి పీఎస్‌కు బదిలీ చేశారు. ఇక్కడా మరోసారి అదే తీరుగా వ్యవహరించడంతో సస్పెండ్ అయ్యాడు.
లైంగిక వేధింపులు: ఏఎస్సై సస్పెన్షన్
Published Thu, Jul 21 2016 8:22 AM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM
కరీంనగర్ క్రైం: బెజ్జంకి ఏఎస్సై వహిద్ పాషాపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ బెజ్జంకి పీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళ హోంగార్డ్ ఫిర్యాదుచేసింది. ఈమేరకు విచారించిన ఎస్పీ వాహిద్ పాషాను సస్పెండ్‌చేశారు.

Advertisement
Advertisement