
జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థికి అభినందనలు
కరివిరాల(నడిగూడెం): మండల పరిధిలోని కరివిరాల మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మొక్క సైదులు 62వ స్కూల్ గేమ్స్‌లో అండర్–19 విభాగంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్స్‌పాల్ పి.సుభాషిణి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో జరగనున్న పోటీల్లో తెలంగాణా రాష్ట్రం నుంచి సైదులు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆ క్రీడాకారుణ్ణి పాఠశాల పీడీ సత్యనారాయణ, ఉపాధ్యాయులు క్రాంతి, వీరబాబు, జాని, షరీఫ్, రవీందర్‌రెడ్డి, సంపత్, లింగరాజు, జ్వోతి, తదితరులు అభినందించారు.