జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
బిక్కవోలు: జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిక్కవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా అండర్– 20 బాలురు, బాలికల జట్ల ఎంపిక ఆదివారం జరిగింది. ప్రతిభ కనబరచిన క్రీడాకారుల జాబితాను అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పన వీర్రాజు ప్రకటించారు. బాలుర జట్టుకు వైవీ శివకుమార్‌రెడ్డి, బండారు శేఖర్, డి.సల్లీ, సీహెచ్ కృష్ణ, డి.రమేష్, జి.ఈశ్వర్, ఎం.సాయిరాం, కేఎస్‌ఎస్ ప్రసాద్, ఆర్.సాయిరాం ఎంపికయ్యారు. బాలికల జట్టుకు శీలం కుసుమ, వై.మౌనిక, వి.పావని, బి.రేవతి, జ్యోతి, వీరలక్ష్మి, వీరలత, కె.వాణి, జేవీవీ వరలక్ష్మి, వై.కళ్యాణి, వి.భూలక్ష్మి, సుష్మ, మేరీ ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబరు 17 నుంచి 22 వరకూ బిక్కవోలులో శిక్షణ ఇస్తారు. అనంతరం 23 నుంచి 25 వరకు కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ఆడతారు. కార్యక్రమంలో సెక్రటరీ వి.తంబి, మానుకొండ వీర్రాఘవరెడ్డి,సెలక్షన్ బోర్టు కమిటీ మెంబరు వి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.