ఖోఖో జిల్లా జట్ల ఎంపిక | teams selected for kho kho | Sakshi
Sakshi News home page

ఖోఖో జిల్లా జట్ల ఎంపిక

Published Wed, Oct 19 2016 1:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

teams selected for kho kho

 
గుంతకల్లు టౌన్‌ : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో మంగళవారం జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆ««దl్వర్యంలో ఖోఖో అండర్‌–18 జిల్లా బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా 12 మందితో కూడిన బాలుర జట్టును ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జి.పుల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ కె.శ్రీనివాసులు, ఏడీసీసీఏ జిల్లా కార్యదర్శి నాగార్జున ప్రసాద్‌ ప్రకటించారు.
 
అలాగే ఇటీవల నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్న బాలికల జట్టులో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన 10 మందితోపాటు రాష్ట్రస్థాయి క్రీడాకారిణులైన గుంతకల్లుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను బాలికల జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ రెండు జట్లు ఈ నెల 26–28 వరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. సెలెక్షన్‌ కమిటీ సభ్యులు, పీఈటీలు శ్రీనివాసులు, ప్రభాకర్, మారుతీ ప్రసాద్‌ పాల్గొన్నారు.
 
ఎంపికైన బాలుర జట్టు : రామాంజినేయులు, వంశీకృష్ణ, సురేష్, భాస్కర్, మనోజ్‌కుమార్‌(గుంతకల్లు), ఎర్‌?రస్వామి, రాజశేఖర్, పురుషోత్తం(ఆమిద్యాల), నాగార్జున(అనంతపురం), వేణు, కానప్ప(చిన్నహోతూరు), శశి(ఉరవకొండ).
బాలికల జట్టు : మునీషా, ఆశాబీ, రుబేనా(గుంతకల్లు), వినీత, జ్యోతి, గాయత్రి, హరిత(చిన్నహోతూరు), కవిత, వరలక్షి్మ, శిరీష(నింబగల్లు), ధనలక్షి్మ, శిల్ప(ఆమిద్యాల). 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement