teams
-
అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు
సాక్షి, గుంటూరు: అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు ఎదుర్యయాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐఐటీ హైదరాబాద్, మద్రాస్ బృందాలు.. నిర్మాణాల నాణ్యతను పరిశీలించాయి. రాజధానిలో వరద చేరడంతో బృందాలు.. పడవలో వెళ్లి పనులు పరిశీలించాయి.ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో వరద నీటిలో బృందాలు పర్యటించాయి. జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులు, ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను బృంద సభ్యులు పరిశీలించారు. వరద నీటిలో ఉన్న జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులను కూడా ఐఐటీ బృందం పడవలో వెళ్లి పరిశీలించింది. వరద నీటిని చూసి షాక్ తిన్న ఐఐటీ బృందం.. చిన్నపాటి వర్షాలకే ఇలా వరద చేరడంపై ఆశ్చర్యపోయింది. -
‘ఆడుదాం ఆంధ్రా’ తొలిదశ అదుర్స్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ తలపెట్టని మెగాక్రీడాటోర్నికి క్రీడాభిమానం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు ‘ఆడుదాం ఆంధ్రా’ అద్దం పడుతోంది. తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల (జీఎస్‌డబ్ల్యూఎస్) పరిధిలో క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు (9వ తేదీ కంటే) ఒక రోజు ముందుగానే సచివాలయాల స్థాయిలో పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో తమ సత్తా చాటారు. ఐదు క్రీడాంశాల్లో మొత్తం 1.68 లక్షల మ్యాచ్‌లను వంద శాతం సమర్థవంతంగా నిర్వహించారు. రేపటి నుంచి మండల స్థాయి.. జనవరి 10వ తేదీ నుంచి మండలాలు, మున్సిపాల్టిలు కలిపి 753 మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో ‘పెర్ఫార్మెన్స్ టాలెంట్ హంట్’ ఆధారంగా క్రీడాకారులతో మండల స్థాయి పోటీలకు జట్లు ఎంపిక చేశారు. వీరికి 10వ తేదీ నుంచి సంక్రాంతిలోగా పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అనంతరం నియోజవకర్గ స్థాయి పోటీలకు వెళ్లే వారికి ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం ఇచ్చేలా శాప్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 10 నుంచి 23 వరకు మండల, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయి, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన 2/3 క్రీడామైదానాల్లో సకల వసతుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ స్థాయిలో విజేతల్లో ఉత్సాహాన్ని నింపేలా స్వాగత తోరణాలు, మస్కట్ లోగోలు, కామెంట్రీ, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది స్పోర్ట్స్ వలంటీర్లు స్కోరర్లుగా, అంపైర్లుగా సేవలందిస్తున్నారు. విజేతలకు టీషర్టులు.. ఐదు క్రీడాంశాల్లో 9,478 క్రీడా ప్రాంగణాల్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగి న పోటీలు వీక్షించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. జీఎస్‌డబ్ల్యూఎస్ దశలో మొత్తం 3.30 లక్షల జట్లను ఎంపిక చేశారు. ఇందులో 2.08 లక్షలు పురుషులు, 1.22 లక్షల మహిళల జట్లు ఉన్నాయి. వీరితో సమానంగా 14 రోజుల పాటు ఏకంగా 34.04 లక్షలకుపైగా వీక్షకులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో పోటీలు ముగించుకుని మండల స్థాయి వేదికపై ప్రతిభ చాటేందుకు వెళ్లే జట్లకు సంబంధించి 34.20 లక్షల ప్రొఫెషనల్ టీషర్టులు, టోపీలను అందజేస్తున్నారు. ఇప్పటికే 15,004 గాను 9వేలకుపైగా సచివాలయాల్లో ముగింపు వేడుకలను నిర్వహించగా మంగళవారం (నేడు) మిగిలిన వాటిల్లో గెలుపొందిన జట్లకు టీషర్టులను బహూకరించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి పోటీలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే వాటి తరలింపు పూర్తి చేశారు. ఆన్లైన్లోనే మ్యాచ్‌ల డ్రా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తొలి దశలో సమర్థవంతంగా నిర్వహించాం. 10వ తేదీ నుంచి మండల స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నాం. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు అనంతరం తుది జట్లను ఎంపిక పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో తలపడే జట్లకు ఆన్లైన్లోనే డ్రా నిర్వహిస్తున్నాం. ఈ దశ పోటీలను సమీపంలోని పెద్ద మైదానాలు, స్టేడియాల్లో నిర్వహించేలా ఆదేశించాం. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్రా జెర్సీలు, టోపీలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. వీటిని అన్ని సచివాలయాలకు తరలించాం. నేటితో అక్కడ ముగింపు వేడుకలు నిర్వహించి టీషర్టులను అందజేస్తారు. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
ఆసియా క్రికెట్ సమరానికి సమయం సమీపించింది. ముల్తాన్ వేదికగా ఆగష్టు 30న ఈ వన్డే టోర్నీ షురూ కానుంది. గతేడాది పొట్టి ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలవగా... పాకిస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం తగ్గేదేలే అంటూ టీమిండియా గట్టి పోటీనిచ్చేందుకు సమాయత్తమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఆటగాళ్లకు బీసీసీఐ ప్రత్యేక శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా ప్లేయర్ల ఫిట్నెస్ అంచనా వేసేందుకు యో- యో టెస్టులు నిర్వహిస్తోంది. వన్డే వరల్డ్‌కప్ వంటి ఐసీసీ ఈవెంట్‌కు ముందు ప్రతిష్టాత్మక టోర్నీలో ఈసారి భారత్ విజేతగా నిలవాలనే సంకల్పంతో కఠిన వైఖరితో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2023 పూర్తి షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారాలు, మ్యాచ్ ఆరంభ సమయం తదితర వివరాలు తెలుసుకుందాం! ఆసియా వన్డే కప్-2023 వేదికలు పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా హైబ్రిడ్ విధానంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గ్రూప్-ఏ జట్లు ►ఇండియా, పాకిస్తాన్, నేపాల్ గ్రూప్-బి జట్లు ►బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక ఆసియా కప్-2023 పూర్తి షెడ్యూల్ ►ఆగష్టు 30: పాకిస్తాన్ వర్సెస్ నేపాల్- ముల్తాన్- పాకిస్తాన్ ►ఆగష్టు 31: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- క్యాండీ- శ్రీలంక ►సెప్టెంబరు 2: పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- క్యాండీ- శ్రీలంక ►సెప్టెంబరు 3: బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్తాన్- లాహోర్- పాకిస్తాన్ ►సెప్టెంబరు 4: ఇండియా వర్సెస్ నేపాల్- క్యాండీ- శ్రీలంక ►సెప్టెంబరు 5: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- లాహోర్- పాకిస్తాన్ సూపర్-4 స్టేజ్ ►సెప్టెంబరు 6: గ్రూప్- ఏ టాపర్ వర్సెన్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- లాహోర్- పాకిస్తాన్ ►సెప్టెంబరు 9: గ్రూప్- బి టాపర్ వర్సెస్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- కొలంబో- శ్రీలంక ►సెప్టెంబరు 10: గ్రూప్-ఏ టాపర్ వర్సెస్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- కొలంబో- శ్రీలంక ►సెప్టెంబరు 12: గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- గ్రూప్-బి టాపర్- కొలంబో- శ్రీలంక ►సెప్టెంబరు 14: గ్రూప్-ఏ టాపర్ వర్సెస్ గ్రూప్-బి టాపర్- కొలంబో- శ్రీలంక. ►సెప్టెంబరు 15: గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు వర్సెస్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- కొలంబో- శ్రీలంక ►సెప్టెంబరు 17: సూపర్ ఫోర్ టాపర్ వర్సెస్ సూపర్ ఫోర్ సెకండ్ టాపర్- కొలంబో- శ్రీలంక. మ్యాచ్‌ల ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం) పాకిస్తాన్లో జరిగే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు, శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడంటే.. ►టీవీలో: స్టార్ స్పోర్ట్స్- స్టార్ స్పోర్ట్స్-1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ సెలక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలక్ట్ 1 హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్' తమిళ్. ►డిజిటల్: డిస్నీ+హాట్‌స్టార్(వెబ్సైట్, మొబైల్ యాప్). ఆసియా కప్-2023 జట్లు టీమిండియా: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది. నేపాల్: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), మహమ్మద్ ఆసిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, భీమ్ షర్కీ, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కెసి, గుల్షన్ కుమార్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, ప్రతిష్ జిసి, కిషోర్ మహతో , అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్, సుదీప్ జోరా. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మముద్, మెహదీ హసన్, నసూమ్ అహ్మద్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, ఇబాదత్ హుసేన్, మహ్మద్ నయీమ్ స్టాండ్ బై ప్లేయర్లు - తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్. ►అఫ్గనిస్తాన్, శ్రీలంక ఆసియా కప్ టోర్నీకి తమ జట్లు ప్రకటించాల్సి ఉంది. చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ -
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు వేళాయె...
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ సమరానికి నేడు తెరలేవనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ మెరుపులతో టి20లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్, రన్నరప్ బెజవాడ టైగర్స్ల మధ్య బుధవారం జరిగే పోరుతో రెండో సీజన్ మొదలవుతుంది. ప్రతి రోజు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 27న టైటిల్ పోరు నిర్వహిస్తారు. పోటీలన్నీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే జరుగుతాయి. తొలి సీజన్లో ఆఖరి మెట్టుపై తడబడి టైటిల్ కోల్పోయిన బెజవాడ టైగర్స్ ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హిట్టర్ రికీ భుయ్పై గంపెడాశలు పెట్టుకున్న ఈ ఫ్రాంచైజీ రూ.8.10 లక్షలతో అతన్ని రిటెయిన్ చేసుకుంది. ఏపీఎల్‌లో ఇదే అత్యధిక మొత్తం కాగా, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో నిరూపించుకున్న ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లు కూడా ఈ లీగ్‌లో ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విహారి రాయలసీమ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రూ. 6.60 లక్షలతో కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఈ జట్టులో అతనిదే అత్యధిక పారితోషికం. భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున స్టార్‌గా బరిలో ఉన్నాడు. అతన్ని రూ. 6 లక్షలకు లయన్స్ కొనుగోలు చేసింది. వీళ్లతో పాటు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అకాడమీలలో రాణించిన కుర్రాళ్లు ఈ లీగ్‌తో ఏసీఏ సెలక్టర్ల కంట పడాలని ఆశిస్తున్నారు. ‘మన ఆంధ్ర–మన ఏపీఎల్’ అనే నినాదంతో పూర్తిగా స్థానిక కుర్రాళ్లకే అవకాశమిచ్చిన ఈ లీగ్‌ను చూసే ప్రేక్షకులకు కూడా నిర్వాహకులు బంపరాఫర్ ప్రకటించారు. ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. విజేతగా నిలిచిన క్రికెట్ అభిమానులకు ఈ స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియాల మధ్య నవంబర్ 23న జరిగే టి20 మ్యాచ్ టికెట్లను ఉచితంగా బహుకరించనున్నారు. -
వణికిస్తున్న వడగాల్పులు.. పిట్టల్లా రాలుతున్న జనం.. కేంద్రం అలర్ట్..!
ఢిల్లీ: ఉత్తర భారతంలో వడగాల్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వడగాల్పులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాలకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. వడగాల్పుల తీవ్రత నుంచి బయటపడటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇప్పటికే తగు సూచనలు చేసినట్లు చెప్పారు. ప్రజలను రక్షించడానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వడదెబ్బతో ఎవరూ మరణించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో విపరీతంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా దేశంలో వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. చాలా రాష్ట్రాల్లో మోతాదుకు మించి ఎండలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల్లోనే ఒకే జిల్లాలో 54 మంది మృతి చెందారు. 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశాల్లో ఎండల దృష్ట్యా వేసవి సెలవులను కూడా ప్రభుత్వం పొడిగించింది. ఇదీ చదవండి: రాజకీయ వివాదాల నడుమ.. ‘అందరికీ ఉచితంగా గుర్బానీ’ బిల్లు ఆమోదం -
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్స్
-
ఐపీల్ లో ప్లే ఆఫ్ కు చేరుకునేది ఎవరు?
-
5 ఏళ్ళ తరువాత భారత పర్యటనకు ఆఫ్గనిస్తాన్...!
-
టార్గెట్ స్యాంట్రో రవి..నాలుగో భార్య ఫిర్యాదు
సాక్షి, మైసూరు: రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రముఖ నేరారోపి స్యాంట్రో రవిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏడీజీపీ అలోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం మైసూరుకు వచ్చిన అలోక్ కుమార్ పోలీసు కమిషనర్ రమేశ్ కార్యాలయంలో స్యాంట్రో రవి కేసుల తనిఖీ గురించి పోలీసు అధికారులతో చర్చించారు. స్యాంట్రో రవి ఆర్థిక వ్యవహారాలు, అత్యాచార కేసులను సమగ్రంగా తనిఖీ చేయాలని ఏడీజీపీ సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ గీతా, ఎస్పీ సీమా లట్కర్, ఏసీసీ శివశంకర్, ఇన్స్పెక్టర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై నాలుగో భార్య ఫిర్యాదు కాగా, ఏడీజీపీ ఎదుట స్యాంట్రో రవి నాలుగో భార్య, ఆమె చెల్లెలు హాజరయ్యారు. వారిద్దరిని ఏడీజీపీ సుమారు గంటకు పైగా విచారించారు. ఈ సమయంలో రవితో పాటు బెంగళూరు కాటన్‌పేట ఏడు మంది పోలీసులు తనను వేధించిన తీరు, అలగే గూగుల్ పే ద్వారా ఆ పోలీసు అధికారులకు చెల్లించిన డబ్బుల వివరాలు ఏడీజీపీకి ఆమె తెలిపారు. తనను వేధించిన పోలీసులను సస్పెండ్‌చేయాలని, రవిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాటన్‌పేట సీఐ ప్రవీణ్ సస్పెండ్ స్యాంట్రో రవి కేసులో బెంగళూరు కాటన్‌పేట ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌ను డీజీపీ ప్రవీణ్ సూద్ సస్పెండ్ చేశారు. స్యాంట్రో రవికి మద్దతుగా ఇద్దరు మహిళలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారనే ప్రవీణ్‌పై ఆరోపణలువవచ్చాయి. హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆదేశాలతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్నారు. దోపిడీ కేసులో వారి పాత్ర లేకపోయినా రవి భార్య, ఆమె సోదరిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని తేలింది. రవిపై నిఘా ఉంచాం మీడియాతో అలోక్ కుమార్ మాట్లాడుతూ స్యాంట్రో రవి కేసు విచారణ నిమిత్తం మైసూరుకు వచ్చినట్లు , అతనిపై రేప్, అట్రాసిటీ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అతని ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విమానాశ్రయాల్లో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. బెంగళూరు రాజరాజేశ్వరి లోని రవి మరో భార్య వనజాక్షిని కూడా విచారించినట్లు చెప్పారు. స్యాంట్రో రవి ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. రవి ప్రస్తుతం మొబైల్ వినియోగించడం లేదన్నారు. అతి త్వరగా అతన్ని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తొదరలోనే పట్టుకుంటాం: హోంమంత్రి శివాజీనగర: పలు నేరారోపణలు ఉన్న స్యాంట్రో రవి అరెస్ట్‌కు ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించినట్లు, త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. మంగళవారం బెంగళూరులో మాట్లాడిన ఆయన, రవి కదలికలపై నిఘా ఉంది, అతని అనుచరులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడతాం. అన్నివిధాలా గాలింపు జరుగుతోంది. త్వరలోనే రవి అరెస్ట్ అవుతారని చెప్పారు. అతనిపై ఉన్న అన్ని కేసులపై విచారణ చేస్తామన్నారు. అంతేకాకుండా మహిళపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడంపై స్పందిస్తూ తప్పుడు కేసులు వేసి అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నివేదిక సిద్ధంగా ఉంది. ఇందులో ఏ అధికారి ఉన్నా కూడా వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వమే రవిని దాచిపెట్టిందన్న జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపణపై మాట్లాడుతూ కుమారస్వామి మాటలకు సమాధానం చెప్పను అన్నారు. (చదవండి: హాట్ టాపిక్‌గా స్యాంట్రో రవి..రెండో భార్య వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో ఏముంది?) -
అన్నా...తస్మాత్ జాగ్రత్తే!
ఖమ్మంరూరల్: ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు పెట్టే ఖర్చు పర్యవేక్షణకు అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లాంటి వాటిని నిరోధించేందుకు ఎనిమిది రకాల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. వీరు ప్రతీ అంశాన్ని నేరుగా పరిశీలకులు, ఎన్నికల అధికారికి సమాచారమిస్తారు. వ్యయ పరిశీలకులు వ్యయపరిశీలకులుగా ఐఏఎస్, ఐఆర్ఎస్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులను నియమించారు. ప్రతీ జిల్లాకు నియోజకవర్గాల సంఖ్యకనుగుణంగా పరిశీలకులను నియమించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు నులుగురు వ్యయ పరిశీలకులను నియమించారు. సహాయ వ్యయపరిశీలకులు పరిశీలకులకు సాయంగా ఉండేందుకు సహాయ వ్యయపరిశీలకులను నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతీ నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ అధికారి వద్ద ఒక్కో అభ్యర్థి పేరుతో ఒక్కో రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభ్యర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజిస్టర్ ఖర్చులు పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరతారు. అంతిమంగా అభ్యర్థుల ఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది. ఎంసీసీ(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో ఈ కమిటీలో 48 మంది పనిచేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఐదు, ఆపై సంఖ్యలో కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో ఓ అధికారి, ఓ ఏఎస్‌ఐతోపాటు వీడియోగ్రాఫర్ ఉంటారు. ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనపై సమాచారం ఆధారంగా వీరు రంగంలోకి దిగుతారు. అనుమతి లేని సమావేశాలు రద్దుచేయడం, వాహనాలనను అడ్డుకోవడం వంటి విధులు నిర్వర్తిస్తారు. నిఘా బృందాలు ఈ బృందాలు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఉంటాయి. జిల్లాలో ఒక్కో నియోజవర్గానికి మూడు నుంచి నాలుగు చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో డీటీ స్థాయి అధికారితో పాటు ముగ్గురు ,లేదా నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. వీడియో నిఘా బృందాలు వీడియో నిఘా బృందం నియోజకవర్గానికొకటి ఉంటుంది. ప్రతీ బృందలో ఒక అధికారి, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. వీరు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు ,ర్యాలీలు, ఇతర ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తారు. ఒకే సమయంలో ఎక్కువ కార్యక్రమాలు ఉంటే అదనపు వీడియో గ్రాఫర్‌ను నియమించుకునే అధికారం ఆ అధికారికి ఉంటుంది. అకౌంటింగ్ టీం జిల్లాలో మొత్తం 12 బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలో ఒక అధికారి, ఒక సహాయకుడు ఉంటారు. వీరు వీడియో వ్యూయింగ్ బృందాలు పంపిన సామగ్రి లెక్కలు చూసి వాటికి ఎన్నికల నిబంధనల ప్రకారం ధరలు నిర్ణయిస్తారు. వీడియో వీక్షణ బృందం ప్రతీ నియోజకవర్గానికి ఓ బృందం చొప్పున కేంద్రంలో విధులు నిర్వరిస్తుంటుంది. ఈ బృందంలో ఓ అధికారి, ఇద్దరు సహాయకులు ఉంటారు. ఈ బృందం ఫ్లయింగ్ స్వా్కడ్, స్టాటిక్ సర్వోలెన్స్ టీం, ఎంసీఎంసీ కమిటీల నుంచి వచ్చిన నివేదికలు, వీడియోలను పరిశీలిస్తుంది. ఉదాహరణకు వీడియో బృందం ఇచ్చిన సీడీలో అభ్యర్థి, పార్టీకి సంబంధించిన టోపీలు, కండువాలు, జెండాలు, బ్యానర్లు, వాహనాలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు పరిశీలించి నమోదు చేస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రతీ నియోజకవర్గంలో మూడు, ఆపై సంఖ్యలో ఉంటాయి. ఒక్కో బృందానికి నాయకత్వం వహించే అధికారికి మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయి. ఇలా జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలకు 60మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పనిచేస్తుంటారు. బృందంలో ఒక వాహనం, ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుళ్ళు, ఒక ఏఎస్సై, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై సమాచారమొస్తే ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని రికార్డు చేస్తారు. -
1982 తర్వాత తొలి‘సారీ’
మాస్కో: ఫిఫా ప్రపంచకప్ అందరి సరదాను తీరుస్తుందంటారు. అనుకోని జట్లు అద్బుత విజయాలతో దూసుకపోతుంటే.. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్లు చతికిలపడుతుంటాయి. సాకర్ సమరంలో ఒక ఘట్టం(గ్రూప్ దశ) పూర్తయింది. ఇక ప్రతీ మ్యాచ్ అన్ని జట్లకు చావోరేవో. చిన్నచితకా జట్లు, ఆగ్రశ్రేణి జట్లను మట్టి కరిపించి ఇంటికి పంపించిన ఈ మెగా టోర్నీలో ఆఫ్రికా అభిమానుల కోరిక మాత్రం తీరకుండా అలాగే మిగిలి ఉంది. తమ ఖండపు జట్టు కనీసం సెమీస్‌కు చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల ఆశలు ఈసారి కూడా ఆవిరయ్యాయి. రష్యాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ఏ ఆఫ్రికా జట్టు రౌండ్16కు చేరలేకపోయింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండపు జట్టు నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. రష్యాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీకి ఈసారి అత్యధికంగా ఐదు ఆఫ్రికా జట్లు(నైజీరియా, మొరాకో, ట్యూనీషియా, ఈజిప్ట్, సెనెగల్) అర్హత సాధించాయి. అయితే ఈ దఫా విశ్వసమరంలో ఆఫ్రికా జట్లకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ హెచ్లో జపాన్, సెనెగల్ జట్లకు సమాన పాయింట్లు లభించినా ఫెయిర్ ప్లే కింద జపాన్(ఆసియా నుంచి ఏకైక జట్టు) రౌండ్ 16లోకి అడుగుపెట్టగా.. సెనెగల్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో ఒక్క జట్టైనా నాకౌట్‌కు చేరుతుందనుకున్న ఆఫ్రికా అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఈజిప్ట్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. మొరాకో కూడా 20 సంవత్సరాల తర్వాత సాకర్‌లోకి అడుగుపెట్టి రెండు ఓటములు, ఒక డ్రాతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆఫ్రికన్ అభిమానులు, క్రీడా పండితులు ఎంతో నమ్మకం పెట్టుకున్న నైజీరియా ఒక్క విజయం రెండు ఓటములతో టోర్నీ నుంచి వైదలొగింది. ట్యూనీషియా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆఫ్రికా దేశాలు ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించి అభిమానులను తీవ్ర నిరుత్సాహపరిచాయి. సెమీఫైనల్ చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల కల రష్యాలో కుదరలేదు.. కనీసం ఖతార్‌లోనైనా సాధ్యపడుతుందో చూడాలి. -
ఫిపా వరల్డ్‌కప్‌లో తలకిందులవుతున్న అంచనాలు
-
ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
అట్టహాసంగా ఎంపిక పోటీలు చంద్రమాంపల్లి (పెద్దాపురం) : ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో నిర్వహించే 35వ రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ షిప్ పోటీలకు బాలబాలిక జిల్లా జట్లను ఎంపిక చేశారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఎస్ఎం జిలాని స్మారక మెమోరియల్ ఖోఖో చాంపియన్ షిప్ పేరిట ఆజాద్ నేషనల్ ఆర్మీ, జెడ్పీ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపికకు పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పది బాలుర జట్లు, సుమారు 60 మంది బాలికలు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే బాలికల జట్టుకు 17 మందిని ఎంపిక చేశారు. హాజరైన వంద మందిలో 17 మందిని బాలుర జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అనంతరం సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి) అ«««దl్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావడానికి క్రీడాకారులు కృషి చేయాలన్నారు. ఎంపికైన జట్లను అభినందించారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నలమాటి జానకి రామయ్య, పట్టాభిరామ్, మాజీ ఎంపీపీలు గోపు అచ్యుతరామయ్య, ఇంధన జయకృష్ణ, శృంగార వల్లభ స్వామి ఆలయ చైర్మన్ బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు, చదలవాడ బాబీ, పెంటకోట నాగబాబు, పాగా సురేష్, యండ్రు సత్తిబాబు, బుజ్జి, తుమ్మల రాజా, పచ్చిపాల ప్రసాదరావు, వేమల పండు, తుమ్మల వీరస్వామి నాయుడు, ఎంఈఓ బాబురావు, హెచ్ఎం కె.గాయత్రి, పీఈటీలు మట్టా సుబ్బారావు, మట్టా శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, పీఎస్ఎన్ మూర్తి, కేఎస్ఎన్ మూర్తి, టీఎస్ఎన్ మూర్తి, ఎన్.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన జట్ల వివరాలు బాలికల జట్టు : ఓ.నాగదేవి, డి.అమృత, డి.లక్ష్మీసౌందర్య, సీహెచ్.దివ్య, పి.చంద్రఅనూష, ఎన్.అంజలి శ్రీదేవి, ఎన్.మౌనిక, కె.శ్యామల, పి.సదా, కె.రాజేశ్వరి, ఎల్.వీరలక్ష్మి, ఎస్.లీలా సత్యవేణి, వి.అక్షయ, ఎ.సుగుణ, ఎ.వెంకటదుర్గ, ఎ.రమ్యభారతి, పి.లక్ష్మి. బాలుర జట్టు : వి.వెంకటేష్, జి.నాగేంద్ర, ఎం.సాయి, వెంకట్, రాజీవ్, వై.మహేష్, జి.సూర్య మణికంఠ, ఎస్వీ ప్రసాద్, జి.సత్యేంద్ర, మణికంఠ, పి.చందు, ఎం.వెంకటరమణ, వీర ఆదిశివ, వై.అప్పాజీ. -
ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
గుంతకల్లు టౌన్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మంగళవారం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆ««దl్వర్యంలో ఖోఖో అండర్–18 జిల్లా బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా 12 మందితో కూడిన బాలుర జట్టును ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.పుల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ కె.శ్రీనివాసులు, ఏడీసీసీఏ జిల్లా కార్యదర్శి నాగార్జున ప్రసాద్ ప్రకటించారు. అలాగే ఇటీవల నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్న బాలికల జట్టులో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన 10 మందితోపాటు రాష్ట్రస్థాయి క్రీడాకారిణులైన గుంతకల్లుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను బాలికల జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ రెండు జట్లు ఈ నెల 26–28 వరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. సెలెక్షన్ కమిటీ సభ్యులు, పీఈటీలు శ్రీనివాసులు, ప్రభాకర్, మారుతీ ప్రసాద్ పాల్గొన్నారు. ఎంపికైన బాలుర జట్టు : రామాంజినేయులు, వంశీకృష్ణ, సురేష్, భాస్కర్, మనోజ్‌కుమార్(గుంతకల్లు), ఎర్?రస్వామి, రాజశేఖర్, పురుషోత్తం(ఆమిద్యాల), నాగార్జున(అనంతపురం), వేణు, కానప్ప(చిన్నహోతూరు), శశి(ఉరవకొండ). బాలికల జట్టు : మునీషా, ఆశాబీ, రుబేనా(గుంతకల్లు), వినీత, జ్యోతి, గాయత్రి, హరిత(చిన్నహోతూరు), కవిత, వరలక్షి్మ, శిరీష(నింబగల్లు), ధనలక్షి్మ, శిల్ప(ఆమిద్యాల). -
అండర్–19 జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 స్విమ్మింగ్,బాల్‌బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక సోమవారం నిర్వహించినట్లు స్కూ ల్గేమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, లక్ష్మినారాయణ తెలిపారు. కొత్తూరు బాలుర పాఠశాలలో బాల్‌బ్యాడ్మింటన్ , రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో స్విమ్మింగ్ జట్ల ఎంపిక పోటీలకు జిల్లాలోని జూనియర్ కళాశాలల బాల, బాలికలు హాజరయ్యారన్నారు. బాల్‌బ్యాడ్మింటన్ జటు ్టతూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొం టుందన్నారు. -
ఉత్సాహంగా జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
సామర్లకోట : స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లా పురుషుల, స్త్రీల కబడ్డీ జట్ల ఎంపిక ఆదివారం జరి గింది. రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, కిర్లంపూడి మం డలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు పో టీలు నిర్వహించి జట్లను ఎంపిక చేశా రు. ఈ జట్టు వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు సామర్లకోట పట్టణంలో నిర్వహిం చే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొం టాయి. ఎన్టీఆర్ మెమోరియల్ పేరుతో 64వ రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల నిర్వాహక కమిటీ కార్యదర్శి బోగిళ్ల మురళీకుమార్ (జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు) మాట్లాడుతూ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యవహరిస్తారన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తాళ్లూరి వైకుంఠం ఆధ్వర్యంలో జట్లను ఎంపిక చేశామన్నారు. పురుషుల జట్టు ఎ. నవీన్‌రాజు, జి. ప్రసాద్, కె. శ్రీని వాసు, కె. ఆర్తివదన్, పి. అజయ్, ఈ నా గేంద్ర, బి. పవన్ వెంకటకుమార్, సీహెచ్ మణికంఠ, పీవీ దుర్గారావు, కె.వేణు, కేవీఎల్ నారాయణ, ఆర్.అశోక్ ప్రధాన జట్టుకు ఎంపికయ్యారు. అదనంగా జి.ర ఘు, జి. శ్రీను, కె.దుర్గాప్రసా ద్, బి.ఉమామహేశ్వరరావులను ఎంపిక చేశారు. మహిళల జట్టు డి.దైవకృప, వి.రోహిణిదేవి, కేవీఎం దు ర్గ, వై.గిరిజా అనంతలక్ష్మి, జీఎస్ఎల్ఎన్ శివజ్యోతి, పి.విజయదుర్గ, కె.సత్యవేణి, ఎం.హేమలత, డి.వేదమణి, యు.లక్ష్మి, ఎస్ఎస్ఎస్ఎల్ ప్రసన్న, ఐ.సూర్యభవా ని,ఎన్.కావ్య,కె.స్వాతి, ఎన్.శిరిషా, జె.సుబ్బలక్ష్మి, డి.కృపామణి, వి.విజయ ఎంపికయ్యారు. కార్యక్రమంలో వీఆర్ కెనడీ, కొండపల్లి శ్రీను, గంగిరెడ్డి బలరామ్, మ ట్టా సుబ్బారావు, వెంకటేశ్వరరావు,గోలి సత్తిరాజు, బి. మోహనరావు పాల్గొన్నారు. -
సపక్‌తక్రా జిల్లా జూనియర్ జట్ల ఎంపిక
అమలాపురం : రాష్ట్రస్థాయి 20వ జూనియర్ బాలబాలికల సపక్ తక్రా చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికలు అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో బుధవారం జరిగాయి. ఈనెల 18, 19 తేదీల్లో వైఎస్సార్ జిల్లా కడప స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగే పోటీల్లో ఎంపికైన జట్లు తలపడతాయని ఆ క్రీడ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రంబాల చిట్టిబాబు తెలిపారు. జిల్లా అసోసియేషన్ కార్యదర్శి మునగాల మన్యం జట్ల వివరాలను వెల్లడించారు. బాలుర విభాగంలో కేతా సతీష్ (కెప్టెన్), పాటి సన్ని, టి.యశ్వంత్, కె.ప్రసాద్, బాలికల విభాగంలో ఆచంట కావ్య, విన్న గాయత్రి, వాకపల్లి పూజిత, వాకపల్లి దీపిక, వి.రమ్యశ్రీ ఎంపికయ్యారు. జట్లకు మేనేజర్‌గా స్థానిక తులిప్స్ స్కూలు పీఈటీ ప్రసాద్, కోచ్‌లుగా సపక్ తక్రా జాతీయ క్రీడాకారులు సందీప్, గౌతమ్ వ్యవహరిస్తారు. జిల్లా జట్లను అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ దొమ్మేటి రాము, ఈదరపల్లి సర్పంచి నక్కా సంపత్‌కుమార్ అభినందించారు. -
2015 ఐపీఎల్‌తో దేశానికి 11.5 బిలియన్ల ఆదాయం
ఢిల్లీ: ఐపీఎల్ 2015 సీజన్ ద్వారా ఇండియాకు 11.5 బిలియన్ రూపాయల స్థూల దేశీయాదాయం సమకూరింది. ఈ విషయం స్వయంగా బీసీసీఐ నియమించిన కేపీఎంజీ స్పోర్ట్స్ అథారిటీ గ్రూప్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. శుక్రవారం బీసీసీఐ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. 2015 ఐపీఎల్ సీజన్లో 8 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. 44 రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నీలో మొత్తం 60 మ్యాచ్‌లు జరిగాయి. -
షీ టీమ్స్ రెడీ
మహిళల భద్రతకు ప్రత్యేక బృందాలు కళాశాలలు.. గ్రామాలు.. పట్టణాల్లో నిఘా జిల్లాలో 59 మంది పోలీసులతో ఏర్పాటు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడి 'రాగిణి.. మదనపల్లెలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ప్రతీ రోజూ ఓ ఆకతాయి బస్టాపు వద్దకు వచ్చి వెంటపడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమవుతుందోనని భయంతో మౌనం వహిస్తోంది. ఈ తతంగాన్ని బస్టాపు వద్ద చుడిదార్ ధరించిన ఇద్దరు మహిళా పోలీసులు చూసి పట్టుకుని తాటతీసి స్టేషన్‌కు తరలించి, ఈవ్‌టీజింగ్ కేసు పెట్టి జైలుకు పంపిస్తారని అతనికి తెలియదు పాపం..' "కీర్తన ఓ సాధారణ గృహిణి. చిత్తూరు నగరంలో ఉంటోంది. భర్త ఇంట్లో లేని సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్. అసభ్య మెసేజ్‌లు వస్తున్నాయి. ఫోన్ రింగయితే భయపడిపోతోంది. ‘షీ’ టీమ్స్ గురించి విన్న ఈమె తన వివరాలు చెప్పొద్దని నిందితుడి భరతం పట్టాలని పోలీసులను కోరింది. గంటలో పోలీసులు ఆ పోకిరిని పట్టుకుని కటకటాల్లోకి నెడుతారు." షీ టీమ్‌ల ఏర్పాటుతో మహిళలకు ఈ తరహా భద్రత కల్పించేందుకు పోలీసులు కంకణం కట్టుకున్నారు. షీ... అంటే ఆమె. స్త్రీలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాలను అరికట్టడానికి జిల్లా పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. జంటనగరాల్లో అమలవుతున్న ‘షీ’ టీమ్స్‌ను జిల్లాలో తొలిసారిగా ప్రవేశపెడుతున్నట్లు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం వద్ద దీన్ని ప్రాంరభించారు. మొత్తం 59 మందితో తొలి దశగా ఈ బృందాలను ప్రజల మధ్యలో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు సైతం మహిళల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని కోరారు. త్వరలో కమ్యూనిటీ పోలీస్ పేరిట ట్రాఫిక్, బందోబస్తు, ఇతర సేవల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, డీఎస్పీలు గిరిధరరావు, రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, రమణయ్య, దేవదాసులు, సీఐలు సూర్యమోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు ప్రాంతాల్లో షీ టీమ్స్ ఏర్పాటు తొలి ప్రయత్నంగా జిల్లాలోని ఐదు చోట్ల ‘షీ’ టీమ్స్ ఏర్పాటు చేశారు. చిత్తూరులో 16 మంది, పలమనేరులో 11 మంది, మదనపల్లెలో 15 మంది, కుప్పంలో ఆరుగురు, పుత్తూరులో 11 మందితో మహిళా భద్రత కమిటీలు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, కళాశాలల కూడళ్లు, బస్టాపుల్లో బృంద సభ్యులు మఫ్టీలో తిరుగుతుంటారు. ఎక్కడైనా మహిళలకు ఇబ్బంది కలిగిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అంతేగాక భార్య, భర్తల మధ్య గొడవలను తీర్చడం, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లలో ఇరువురికీ అవగాహన కల్పించడం చేస్తారు. గ్రామాలు, పట్టణాల్లో మహిళా భద్రత కమిటీలు పనిచేస్తాయి. రానున్న ఆరు నెలల కాలంలో జిల్లాలోని అన్ని పట్టణాలు, నగరాలు, మేజర్ పంచాయతీల్లో ‘షీ’ టీమ్స్ ఏర్పాటు చేయడానికి ఇదొక ప్రయత్నంగా పోలీసుశాఖ భావిస్తోంది. ఇందులో వచ్చే లోటుపాట్లు సరిదిద్దుకుని భవిష్యత్తులో ఏర్పాటు చేసే కమిటీల్లో వాటిని సరిచేసుకుంటారు.