ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
Published Wed, Oct 19 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
అట్టహాసంగా ఎంపిక పోటీలు
చంద్రమాంపల్లి (పెద్దాపురం) : ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో నిర్వహించే 35వ రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ షిప్ పోటీలకు బాలబాలిక జిల్లా జట్లను ఎంపిక చేశారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఎస్‌ఎం జిలాని స్మారక మెమోరియల్ ఖోఖో చాంపియన్ షిప్ పేరిట ఆజాద్ నేషనల్ ఆర్మీ, జెడ్పీ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపికకు పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పది బాలుర జట్లు, సుమారు 60 మంది బాలికలు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే బాలికల జట్టుకు 17 మందిని ఎంపిక చేశారు. హాజరైన వంద మందిలో 17 మందిని బాలుర జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అనంతరం సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి) అ«««దl్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావడానికి క్రీడాకారులు కృషి చేయాలన్నారు. ఎంపికైన జట్లను అభినందించారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నలమాటి జానకి రామయ్య, పట్టాభిరామ్, మాజీ ఎంపీపీలు గోపు అచ్యుతరామయ్య, ఇంధన జయకృష్ణ, శృంగార వల్లభ స్వామి ఆలయ చైర్మన్ బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు, చదలవాడ బాబీ, పెంటకోట నాగబాబు, పాగా సురేష్, యండ్రు సత్తిబాబు, బుజ్జి, తుమ్మల రాజా, పచ్చిపాల ప్రసాదరావు, వేమల పండు, తుమ్మల వీరస్వామి నాయుడు, ఎంఈఓ బాబురావు, హెచ్‌ఎం కె.గాయత్రి, పీఈటీలు మట్టా సుబ్బారావు, మట్టా శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, పీఎస్‌ఎన్ మూర్తి, కేఎస్‌ఎన్ మూర్తి, టీఎస్‌ఎన్ మూర్తి, ఎన్.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎంపికైన జట్ల వివరాలు
బాలికల జట్టు : ఓ.నాగదేవి, డి.అమృత, డి.లక్ష్మీసౌందర్య, సీహెచ్.దివ్య, పి.చంద్రఅనూష, ఎన్.అంజలి శ్రీదేవి, ఎన్.మౌనిక, కె.శ్యామల, పి.సదా, కె.రాజేశ్వరి, ఎల్.వీరలక్ష్మి, ఎస్.లీలా సత్యవేణి, వి.అక్షయ, ఎ.సుగుణ, ఎ.వెంకటదుర్గ, ఎ.రమ్యభారతి, పి.లక్ష్మి.
బాలుర జట్టు : వి.వెంకటేష్, జి.నాగేంద్ర, ఎం.సాయి, వెంకట్, రాజీవ్, వై.మహేష్, జి.సూర్య మణికంఠ, ఎస్‌వీ ప్రసాద్, జి.సత్యేంద్ర, మణికంఠ, పి.చందు, ఎం.వెంకటరమణ, వీర ఆదిశివ, వై.అప్పాజీ.
Advertisement
Advertisement